Intermediate Public Exams 2024: ముగిసిన ఇంటర్మీడియెట్ పరీక్షల మూల్యాంకనం
Sakshi Education
ముగిసిన ఇంటర్మీడియెట్ పరీక్షల మూల్యాంకనం
కర్నూలు : ఇంటర్మీడియెట్ పరీక్షల మూల్యాంకనం గురువారంతో ముగిసింది. ఈ ప్రక్రియ గత 18న మొదలు కాగా.. అదే నెల 31వ తేదీకి ముగియాల్సి ఉంది. అయితే ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులు మూల్యాంకన కార్యక్రమానికి హాజరు కాలేదు. షోకాజ్ నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. ఆయా కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడి అధ్యాపకులను బాధ్యతలు అప్పగించడంతో నాలుగు రోజులు ఆలస్యంగా మూల్యాంకనం పూర్తయ్యింది. చివరి రోజున ఫిజిక్స్ 2,356, గణితం 2,400, కెమిస్ట్రీ సబ్జెక్టుకు సంబంధించి 2,110 సమాధాన పత్రాలను మూల్యాంకనం చేశారు. పరీక్ష ఫలితాలు ఈ నెల 12వ తేదీలోపు విడుదల చేసేందుకు బోర్డు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
Published date : 05 Apr 2024 01:40PM