Skip to main content

Free Training : నిరుద్యోగులకు ఉచిత ఉపాధి శిక్షణ

Free employment training for the unemployed

దొండపర్తి: టెక్‌ మహీంద్రా ఫౌండేషన్‌ సహకారంతో నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఉన్న కోర్సుల్లో ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు నిర్మాణ్‌ సంస్థ సీఈఓ మయూర్‌ పట్నాల తెలిపారు. ఇంటర్‌ పాస్‌, డిగ్రీ పూర్తయిన 18 నుంచి 28 ఏళ్లలోపు ఉన్న యువతీ, యువకులు ఈ శిక్షణకు అర్హులని పేర్కొన్నారు.
టైపింగ్‌ స్కిల్స్‌, ఎంఎస్‌ ఆఫీస్‌, ఇంటర్నెట్‌ కాన్సెప్ట్స్‌, కమ్యూనికేటివ్‌ ఇంగ్లిష్‌, హెచ్‌టీఎంఎల్‌, సీఎస్‌ఎస్‌, ఆఫీస్‌ అడ్మినిస్ట్రేషన్‌, టెక్నికల్‌ స్కిల్స్‌, బేసిక్‌ అకౌంటింగ్‌ స్కిల్స్‌ కోర్సుల్లో 3 నెలల పాటు ఉచిత శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోగా బాజీ జంక్షన్‌ ప్రాంతంలో ఉన్న నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌ కేంద్రంలో కానీ, 9502874304, 9908104113 నెంబర్లకు సంప్రదించాలని సూచించారు.

చదవండి: Mini Job Mela: 31న మినీ జాబ్‌మేళా

Published date : 29 Aug 2023 03:05PM

Photo Stories