Skip to main content

Teacher Post: డీఈవో కార్యాలయంలో శనివారం నియామక ప్రక్రియ

కొత్త‌గా మంజూరైన విద్యాల‌యంలో అర్హులైన అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసేందుకు నిర్వ‌హించిన ప‌రీక్ష‌ల‌తో పాటు, నియామక ప్ర‌క్రియ‌లు వారి వివ‌రాలు చేప‌ట్టేందుకు కావాల్సిన‌వి సూచించారు. వాటికి సంబంధించిన పూర్తి వివరాలు..
teachers post in kgbv school
teachers post in kgbv school

సాక్షి ఎడ్యుకేష‌న్: కొత్తగా మంజూరైన మావల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో సీఆర్టీ, పీజీ సీఆర్టీ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు డీఈవో ప్రణిత ప్రకటనలో తెలిపారు. జూలైలో నిర్వహించిన ఆన్‌లైన్‌ పరీక్ష ద్వారా అర్హులైన అభ్యర్థులను మెరిట్‌, రోస్టర్‌ విధానంలో ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. 1:3 పద్ధతిన డీఈవో కార్యాలయంలో శనివారం నియామక ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు.

September Month Exams: సెప్టెంబ‌ర్‌లో నిర్వ‌హించ‌నున్న ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..!

అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. డీఈవో వెబ్‌సైట్‌లో అర్హులైన అభ్యర్థుల వివరాలు పొందుపరిచినట్లు తెలిపారు. స్పెషల్‌ ఆఫీసర్‌ 1, సీఆర్టీ బయోసైన్స్‌ 2, తెలుగు 2, హిందీ 1, సాంఘిక శాస్త్రం 1, పీఈటీ 1, ఇంగ్లీష్‌ 4, సీఆర్టీ గణితం 1, ఫిజికల్‌ సైన్స్‌ 2, పీజీ సీఆర్టీ ఇంగ్లీష్‌ 1, పీజీ సీఆర్టీ తెలుగు 1 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వివరించారు.
 

Published date : 04 Sep 2023 11:11AM

Photo Stories