TS 10th Class Results: తెలంగాణ పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే..
తెలంగాణ పదోతరగతి పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 30వ తేదీన లేదా మే 1న విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఫలితాల ప్రకటన గురించి అధికారిక వర్గాలు సమాచారం అందించాయి.
పదో తరగతి ఫలితాల ప్రకటన అనంతరం అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్ధులు తమ వివరాలను నమోదు చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా 5,08,385 మంది విద్యార్థులు రాశారు. దాదాపు 2,676 పరీక్ష కేంద్రాలలో నిర్వహించారు.
ఈ సారి తెలంగాణ పదో తరగతి-2024 ఫలితాలను ఒకే ఒక్క క్లిక్‌తో అందరి కంటే ముందుగానే సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
చదవండి: After 10th & Inter: పది, ఇంటర్‌తో పలు సర్టిఫికేషన్ కోర్సులు.. ఉద్యోగావకాశాలకు మార్గాలు ఇవే!!
అక్కడక్కగా కొన్ని మాల్ ప్రాక్టీస్ సంఘటనలు జరిగినప్పటికీ ఎలాంటి అవాంతరాలు చోటు చేసుకోకుండా పరీక్షలను పకడ్భందీగా విజయవంతంగా నిర్వహించారు.
ఫలితాల డీకోడింగ్ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేసి, అనంతరం ఏప్రిల్ 30వ తేదీన లేదంటే మే నెల 1వ తేదీ ఉదయం ఫలితాలను వెల్లడించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం.
తాజాగా ఇంటర్‌తో పాటు పదో తరగతి పరీక్ష ఫలితాల వెల్లడికి అనుమతి కోరుతూ ఎన్నికల సంఘానికి విద్యాశాఖ లేఖ రాసింది.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున మంత్రుల చేతుల మీద కాకుండా విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు.
తొలుత ఇంటర్ ఫలితాలు ప్రకటించిన అనంతరం పదో తరగతి ఫలితాలు వెల్లడించాలని విద్యాశాఖ భావిస్తోంది.