Skip to main content

BEL Recruitment: బెల్, బెంగళూరులో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. నెలకు రూ.ల‌క్ష 80 వేల వరకూ వేతనం

Bharat Electronics Limited

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బెల్‌), బెంగళూరు యూనిట్‌.. ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 12
పోస్టుల వివరాలు: డిప్యూటీ మేనేజర్లు–02, సీనియర్‌ మేనేజర్లు–10.

డిప్యూటీ మేనేజర్లు: 
అర్హత: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ /మెకానికల్‌/మెకట్రానిక్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌/ఏరోస్పేస్‌/ ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 01.11.2021 నాటికి 36 ఏళ్లు మించకూడదు. 
వేతనం నెలకు రూ.60,000 నుంచి రూ.1,80,000 వరకు చెల్లిస్తారు.

సీనియర్‌ ఇంజనీర్లు: 
అర్హత: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ /మెకానికల్‌/మెకట్రానిక్స్‌/కంప్యూటర్‌ సైన్స్‌/ఏరోస్పేస్‌/ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి. 
వయసు: 01.11.2021 నాటికి 36 ఏళ్లు మించకుండా ఉండాలి. 
జీతం: నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000 వరకు చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 08.12.2021

వెబ్‌సైట్‌: https://www.bel-india.in/

చ‌ద‌వండి: NALCO Recruitment: నాల్కోలో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..

Qualification GRADUATE
Last Date December 08,2021
Experience Fresher job
For more details, Click here

Photo Stories