ARIES: ఏఆర్‌ఐఈఎస్‌లో 11 టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు
భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్యభట్ట రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్సెస్(ఏఆర్‌ఐఈఎస్).. ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: పర్సనల్ అసిస్టెంట్–01, ఇంజనీరింగ్ అసిస్టెంట్–02, జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్–04, జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్–02, మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్)–02.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో రెండేళ్ల ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, బీఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో పాటు టైపింగ్ నైపుణ్యాలు ఉండాలి.
వయసు: 27ఏళ్ల నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24.09.2021
వెబ్‌సైట్: https://www.aries.res.in
Qualification | GRADUATE |
Last Date | September 24,2021 |
Experience | Fresher job |