Teacher Jobs: 13,500 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు!
కోర్టు తీర్పు అనంతరం విద్యాశాఖలో ఖాళీగా ఉన్న 13,500 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని కర్ణాటక ప్రాథమికోన్నత విద్యా శాఖ మంత్రి మధు బంగారప్ప విధాన పరిషత్‌లో సోమవారం తెలిపారు.
చదవండి: పదితోనే కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 1558 గ్రూప్-సి పోస్ట్‌లు.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి... జాబ్ కొట్టండి
సోమవారం కూడా రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌తో చర్చించామన్నారు. హైకోర్టులో ఉన్న స్టే తొలగించి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అబ్దుల్ జబ్బార్, మంజునాథ్ భండారి లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి, ప్రభుత్వం 15 వేల ఉద్యోగాల మంజురు చేసిందని, అందులో 13,500 ఉపాధ్యాయుల నియామక ప్రక్రియ జరిగింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. రాష్ట్రంలో 1 నుంచి 10వ తరగతి వరకు అన్ని ప్రభుత్వ పాఠశాల పిల్లలకు యూనిఫారం, షూ పంపిణీ చేశామని మంత్రి తెలిపారు.
చదవండి: ఈఎంఆర్‌ఎస్ పాఠశాలల్లో 4062 టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..