Job Opportunities: ఖాళీగా 18 లక్షల ఉద్యోగాలు.. కానీ అభ్యర్థులు కరువు
దేశంలో నిరుద్యోగం తీవ్రంగా ఉందని వార్తల్లో చూస్తున్నాం. పదుల సంఖ్యలో ఉద్యోగాలకు వేల సంఖ్యలో అభ్యర్థులు వస్తుండటం గమనిస్తున్నాం. అయితే ఆర్థిక సేవల రంగంలో మాత్రం సరైన అభ్యర్థుల్లేక లక్షల్లో జాబ్స్ ఖాళీగా ఉన్నాయి.
గత ఏడాది ఆర్థిక సేవల రంగంలో దాదాపు 18 లక్షల ఉద్యోగాలు అభ్యర్థులు లేక ఖాళీగా ఉండిపోయాయని, దీంతో ఆ రంగం నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటోందని ఎఫ్‌పీఎస్‌బీ ఇండియా (ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్) ఉన్నతాధికారిని ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.
ఆర్థిక సేవల రంగంలో దాదాపు 6,000 మందికి ఉపాధి కల్పిస్తున్న గాంధీనగర్‌లోని గిఫ్ట్ సిటీ వచ్చే ఐదేళ్లలో ఈ రంగంలో దాదాపు 1.5 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుందని ఎఫ్‌పీఎస్‌బీ ఇండియా సీఈవో క్రిషన్ మిశ్రా పీటీఐకి తెలిపారు.
"గత సంవత్సరం, కేంద్ర ప్రభుత్వ నేషనల్ కెరీర్ సర్వీసెస్ పోర్టల్ అందించిన డేటా ప్రకారం, భారత్ ఆర్థిక సేవలలో 46.86 లక్షల ఉద్యోగాలను సృష్టించింది. వాటిలో 27.5 లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ అయ్యాయి. 18 లక్షల ఉద్యోగాలకు అభ్యర్థులు లేరని చూపిస్తోంది. ఉద్యోగాలు ఉన్నాయి. కానీ వాటికి తగిన సామర్థ్యం కలిగిన అభ్యర్థులు లేరు" అని మిశ్రా అన్నారు.
Job Reservation Bill: రాష్ట్రాన్ని విడిచివెళ్లనున్న టెక్ కంపెనీలు.. కారణం ఇదే..
"బ్యాంకులు, బీమా కంపెనీలు, బ్రోకరేజ్ సంస్థలు, మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు ఎల్లప్పుడూ శిక్షణ పొందిన అభ్యర్థుల అవసరం ఉంటుంది. మీరు ఆన్‌లైన్ జాబ్ సెర్చ్ చేస్తే, ప్రస్తుతం ఉన్న సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ (CFP) నిపుణులకు 40 రెట్లు అధికంగా ఉద్యోగఖాళీలున్న విషయం తెలుస్తుంది”అని పేర్కొన్నారు. ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా 2.23 లక్షల మంది సీఎఫ్‌పీ నిపుణులు ఉండగా భారత్‌లో 2,731 మంది మాత్రమే ఉన్నారు.
Tags
- job opportunities
- Financial Services
- Job Crisis in India
- Unfilled jobs
- un employability
- Financial Sector
- jobs in Financial Sector
- Financial Planning Standards Board
- employability
- EmployabilitySkills
- financial services sector
- employability issue
- 18 lakhs jobs
- financial education
- Financial Planners
- 18 lakh jobs unfilled
- FinancialPlanningStandardsBoard
- FinancialServicesSector
- JobVacancies
- UnemploymentProblem
- JobMarketInFinance
- SakshiEducationUpdates