Skip to main content

Infosys, Wipro: ఉద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పిన ఇన్ఫోసిస్‌, విప్రో... భారీగా వేరియ‌బుల్

లే ఆఫ్స్ వార్త‌ల‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల‌కు ఇది తీపి క‌బుర‌నే చెప్పొచ్చు. త‌మ ఉద్యోగుల‌కు యావ‌రేజ్‌గా 80 శాతం మేర వేరియ‌బుల్ పేను అంద‌జేస్తామ‌ని దేశీయ దిగ్గ‌జ ఐటీ సంస్థ‌లు ఇన్ఫోసిస్‌, విప్రో ప్ర‌క‌టించాయి. ఈ నెల వేత‌నంతో క‌లిపి దీన్ని చెల్లిస్తామ‌ని ఇన్ఫోసిస్ ఇప్ప‌టికే వెల్ల‌డించింది.
Infosys, Wipro
ఉద్యోగుల‌కు తీపి క‌బురు చెప్పిన ఇన్ఫోసిస్‌, విప్రో... భారీగా వేరియ‌బుల్

ఈ ఏడాది మార్చి త్రైమాసికంలో 60 శాతం వేరియబుల్‌ పేను ఇన్ఫోసిస్‌ చెల్లించిన సంగ‌తి తెలిసిందే. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇంక్రిమెంట్‌ను మాత్రం ప్ర‌క‌టించ‌లేదు. చివరిసారిగా గ‌తేడాది 2022 జులైలో వేతనాలు పెంచింది. అప్ప‌టినుంచి వేత‌నాల పెంపుపై ఎలాంటి స‌మాచారం ఇవ్వ‌ట్లేదు.

ఇవీ చ‌ద‌వండి: నీట్‌లో అద‌ర‌గొడుతున్న‌ గురుకుల విద్యార్థులు.. 185 మందికి ఎంబీబీఎస్‌ సీట్లు 

2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మంచి పనితీరు క‌న‌బ‌ర్చిన‌ నేపథ్యంలో తన ఉద్యోగులకు సగటున 80శాతం వేరియబుల్ పేను అంద‌జేయ‌నుంది. క్యూ1లో మంచి పనితీరును కనబర్చామని, భవిష్యత్తులో కంపెనీ విస్తరణకు బలమైన పునాదిని ఏర్పాటు చేసామని ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు పంపిన మెయిల్స్‌లో తెలిపింది. గత ఏడాది ఇన్ఫోసిస్ సగటు వేరియబుల్ పే 60 శాతంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఇవీ చ‌ద‌వండి: ఒకే ఇంట్లో రెండు ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆ అక్కాచెల్లెళ్లు సరస్వతీ పుత్రికలు

2023-24 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సంస్థ స్థాయిలో సరాసరి 80 శాతం వేరియబుల్‌ పే చెల్లించనుండగా, వ్యక్తిగత చెల్లింపుల శాతం.. ఆయా ఉద్యోగుల పని తీరు, జూన్‌ త్రైమాసికంలో వారి వాటా ఆధారంగా మారుతుందని కంపెనీ పేర్కొంది.

Published date : 24 Aug 2023 04:09PM

Photo Stories