Gurukulam Students: నీట్‌లో అదరగొడుతున్న గురుకుల విద్యార్థులు.. మొదటి కౌన్సెలింగ్‌లోనే 185 మందికి ఎంబీబీఎస్ సీట్లు
సోషల్ వెల్ఫేర్ గురుకులాల నుంచి 135 మంది, గిరిజన గురుకులాల నుంచి 45 మంది సీట్లు పొందారు. వీరిలో రెగ్యులర్ ఇంటర్ విద్యార్థులు 30 మంది, లాంగ్‌టర్మ్ నుంచి 105 మంది ఉన్నారు. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలకు చెందిన ఐదుగురు విద్యార్థులు కూడా మెడికల్ సీట్లు సాధించారు.
Board Exams Twice A Year: ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు
గిరిజన గురుకులాల నుంచి గత ఏడాది 41 మంది మెడిసిన్ సీట్లు సాధించగా, ఈసారి 45 మంది సీట్లు పొందారు. వీరిలో 18 మంది బాలికలు ఉన్నారు. రెగ్యులర్ ఇంటర్ నుంచి 8 మంది, లాంగ్‌టర్మ్ నుంచి 37 మంది ఎంపికయ్యారు. మొదటిసారిగా పర్టిక్యులర్ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (పీవీటీజీ)కు చెందిన విద్యార్థిని సైతం ఎంబీబీఎస్ సీటు సాధించారు. పీవీటీజీకి చెందిన సంగర్సు స్రవంతి కరీంనగర్‌లోని ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో సీటు దక్కించుకుంది.
ఇవీ చదవండి: డెంటల్ అడ్మిషన్లు కోసం... మొదటి దశ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు ఉచితంగా నీట్ లాంగ్‌టర్మ్ కోచింగ్ అందించేందుకు ఎస్సీ గురుకులాల్లో ఆపరేషన్ బ్లూ క్రిస్టల్ (ఓపీబీసీ), గిరిజన గురుకులాల్లో ఆపరేషన్ ఎమరాల్డ్ (ఓపీఎం) ప్రారంభించిన సంగతి తెలిసిందే.