Skip to main content

SP Ravi Teja: గుజ‌రాత్‌ ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందుతోన్న తెలుగు ఎస్పీ రవితేజ‌... ఈయ‌న స్వ‌స్థ‌లం ఎక్క‌డంటే...

సివిల్స్ స‌ర్వంట్స్‌గా ప్ర‌జ‌ల‌కు సేవచేసే అవ‌కాశం అతికొద్ది మందికి మాత్ర‌మే ల‌భిస్తుంది. ఈ ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని అనేక‌మంది అధికారులు త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాలు చూసుకుంటూ ఉంటారు.
SP Ravi Teja
గుజ‌రాత్‌లో ప్ర‌జ‌ల మ‌న్న‌న‌లు పొందుతోన్న తెలుగు ఎస్పీ రవితేజ‌... ఈయ‌న స్వ‌స్థ‌లం ఎక్క‌డంటే...

అయితే మ‌రికొంత‌మంది చిత్త‌శుద్ధితో ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు విని, వాటి ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకుంటూ వార్త‌ల్లో నిలుస్తుంటారు. ఇలాంటి వారిలో ఒకరే మ‌న వాసంశెట్టి ర‌వితేజ‌.

గుజ‌రాత్‌లోని జునాగ‌ఢ్ జిల్లా ఎస్పీ నుంచి బ‌దిలిపై వెళుతున్న ర‌వితేజ‌కు అక్క‌డి ప్ర‌జ‌లు, అధికారులు అపూర్వ వీడ్కోలు ప‌లికారు. ప్ర‌స్తుతం ఇది నెట్టింట వైర‌ల్‌గా మారింది. తెలుగు ఐపీఎస్ అధికారిపై దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. 

ఇవీ చ‌ద‌వండి: స్టార్ట‌ప్స్ విల‌విల‌... ఆరు నెల‌ల్లో 17 వేల మందికి ఉద్వాస‌న‌.. రానున్న రాజుల్లో మ‌రింత‌మంది

Sp Raviteja

రవితేజ 2015 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన వారు. త‌నను గుజ‌రాత్ కేడ‌ర్‌కు కేటాయించారు. ఎస్సీగా త‌న తొలి పోస్టింగ్‌ జునాగఢ్‌. 2019లో జునాగఢ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌గా నియమితులై మూడేళ్లు సేవలు అందించారు. తాజాగా జునాగఢ్‌ నుంచి గుజరాత్‌లోని గాంధీనగర్‌ ఎస్పీగా బదిలీ అయ్యారు.

ఇవీ చ‌ద‌వండి: ఒక‌దాని త‌ర్వాత ఒక‌టి.. వ‌రుస‌గా మూడు ఉద్యోగాలతో అద‌ర‌గొట్టిన తెలంగాణ యువ‌కుడు

బ‌దిలీపై వెళుతున్న‌ రవితేజకు జునాగఢ్ వాసులు భిన్నంగా వీడ్కోలు పలికారు. ముందుగా పూలతో అలంకరించిన కారులో అధికారి రవితేజను కూర్చోబెట్టారు. పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం నుంచి పోలీసు కాన్వాయ్ జునాగఢ్ వీధుల గుండా ముందుకు సాగింది. దారిగుండా జునాగఢ్ ప్రజలు అపూర్వరీతిలో వీడ్కోలు పలికారు. 

Sp Raviteja

ఇవీ చ‌ద‌వండి: క‌ష్టాల‌ను అధిగ‌మించి.. నాసాలో కొలువు సాధించా... పులివెందుల‌ కుర్రాడు హ‌ర్ష‌వ‌ర్ద‌న్‌రెడ్డి 

రవితేజ పోలీసు విభాగంలో అందించిన సేవలకు గుర్తుగా అప్పటి డిప్యూటీ సీఎం నవీన్‌ పటేల్‌ చేతులమీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ర‌వితేజ స్వ‌స్థ‌లం డా. బి ఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలం పెదపట్నంలంక. తమ ప్రాంతానికి చెందిన వ్యక్తి గుజరాత్‌లో ఇంతటి పేరుప్రఖ్యాతులు సంపాదించడంపై కోనసీమ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Published date : 07 Aug 2023 04:25PM

Photo Stories