Indian Army Recruitment: ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ కోర్సు నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు ఇవే..
ఇండియన్ ఆర్మీ.. షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ఆఫీసర్లుగా చేరేందుకు ఎన్‌సీసీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ 51వ కోర్సు(ఏప్రిల్ 2022).. నోటిఫికేషన్ విడుదలచేసింది. అవివాహిత పురుషులు,
మహిళలు దరఖాస్తుకు అర్హులు.
మొత్తం పోస్టుల సంఖ్య: 55
పోస్టుల వివరాలు: ఎన్‌సీసీ మెన్–50(జనరల్ కేటగిరి–45, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి–05), ఎన్‌సీసీ ఉమెన్–05(జనరల్ కేటగిరి–04, యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి–01).
అర్హత: కనీసం 50శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దీనితోపాటు ఎన్‌సీసీ సీ సర్టిఫికేట్‌ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. యుద్ధ ప్రమాదాల్లో
గాయపడ్డ ఆర్మీ సిబ్బందికి సీ సర్టిఫికెట్ అవసరం లేదు.
వయసు: ఎన్‌సీసీ అభ్యర్థులకు(యుద్ధ ప్రమాదాల్లో గాయపడ్డ ఆర్మీ సిబ్బందిని కలుపుకొని) 01.01.2022నాటికి 19–25ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులను మొదట షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారికి ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇది రెండు ఫేజ్‌లుగా ఉంటుంది. ఫేజ్–1, ఫేజ్–2 పరీక్షలు ఉంటాయి. ఫేజ్–1లో ఎంపికైన
అభ్యర్థులకు ఫేజ్–2 ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో ఎంపికైన వారికి చివరగా మెడికల్ టెస్ట్ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 03.11.2021
వెబ్‌సైట్: https://joinindianarmy.nic.in
చదవండి: Faculty Posts: ఎన్‌ఎఫ్‌ఎస్‌యూలో ఫ్యాకల్టీ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
Qualification | GRADUATE |
Last Date | November 03,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |