Indian Army: 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్.. అర్హతలు ఇవే..
ఇండియన్ ఆర్మీ.. జనవరి 2022లో ప్రారంభమయ్యే 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్–46వ కోర్సుకు అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులకు ఐదేళ్ల శిక్షణ తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీతోపాటు పర్మనెంట్ కమిషన్‌లో ఆఫీసర్లుగా నియమిస్తారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 90
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ /తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. జేఈఈ(మెయిన్) 2021 పరీక్షకు హాజరై ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.
వయసు: 16 1/2 నుంచి 19 1/2 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూను 5 రోజులపాటు నిర్వహిస్తారు. ఇందులో స్టేజ్–1, స్టేజ్–2 విభాగాలు ఉంటాయి. స్టేజ్–1 టెస్ట్ ఒక రోజు మాత్రమే ఉంటుంది. స్టేజ్–1లో అర్హత సాధించని అభ్యర్థులు అదే రోజు వెనుదిరగాల్సి ఉంటుంది. స్టేజ్–1లో ప్రతిభ చూపిన వారికి స్టేజ్ 2 ప్రక్రియ కొనసాగిస్తారు.
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు: డిసెంబర్ 2021 నుంచి ప్రారంభం
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 08.11.2021
వెబ్‌సైట్: http://www.joinindianarmy.nic.in/
చదవండి: Indian Army Recruitment: జేఏజీ ఎంట్రీ స్కీమ్‌లో ఉద్యోగాలు.. దరఖాస్తుకు అర్హతలు ఇవే..
Qualification | 12TH |
Last Date | November 08,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |