Indian Navy Recruitment: ఇండియన్ నేవీ–10+2(బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్
ఇండియన్ నేవీ 2022 జనవరిలో ప్రారంభమయ్యే 10+2(బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్(పర్మనెంట్ కమిషన్) కోసం అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 35
ఖాళీల వివరాలు: ఎడ్యుకేషన్ బ్రాంచ్–05, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అండ్ టెక్నికల్ బ్రాంచ్–30.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ సబ్జెక్టులతో సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్(10+2) ఉత్తీర్ణతతోపాటు జేఈఈ(మెయిన్)–2021 పరీక్ష రాసిన విద్యార్థులు అర్హులు.
వయసు: 02.07.2002 నుంచి 01.01.2005 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: జేఈఈ(మెయిన్) ఆల్ ఇండియా ర్యాంక్ 2021 ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన వారిని ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు నిర్వహించే కేంద్రాలు: బెంగళూరు/భోపాల్/కోల్‌కతా/విశాఖపట్నం.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 10.10.2021
ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు: 2021 అక్టోబర్–నవంబర్.
వెబ్‌సైట్: https://www.joinindiannavy.gov.in/
చదవండి: Oil India Limited Recruitment: ఓఐఎల్‌లో ఇంజనీర్, మెడికల్ ఆఫీసర్ పోస్టులు
Qualification | GRADUATE |
Last Date | October 10,2021 |
Experience | Fresher job |
For more details, | Click here |