Skip to main content

విశ్లేషణతో చదివితే విజయం మీదే!

Bavithaబిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) క్యాంపస్‌లో కాలుపెట్టి, సుస్థిర కెరీర్ దిశగా అడుగులు వేయాలని చాలా మంది తమ లక్ష్యంగా నిర్దేశించుకుంటారు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు, కోరుకున్న కోర్సులో చేరేందుకు వీలుకల్పించే బిట్‌శాట్-2014కు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నేపథ్యంలో బిట్‌శాట్‌పై స్పెషల్ ఫోకస్..

బీఈ/బీటెక్ ఔత్సాహిక విద్యార్థులు ఐఐటీ, నిట్‌ల తరహాలోనే బిట్స్‌లో సీటు రావడాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. నాణ్యమైన విద్య, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పరిశోధనశాలలను కలిగి ఉన్న బిట్స్ క్యాంపస్‌లు యువతను ఆకట్టుకుంటున్నాయి. బిట్స్‌కు దేశంలో మూడు క్యాంపస్‌లున్నాయి. అవి: బిట్స్ పిలానీ, బిట్స్ పిలానీ-గోవా, బిట్స్ పిలానీ-హైదరాబాద్. వీటిలో ప్రవేశానికి బిట్‌శాట్‌ను నిర్వహిస్తున్నారు. ఐఐటీలు, నిట్‌లలో ప్రవేశాలకు ఎలా సిద్ధమవుతారో, అంతే స్థాయిలో బిట్‌శాట్‌కూ చదవాలి.

అర్హతలు:
  • 2013లో ఇంటర్ పూర్తిచేసిన వారు, 2014లో ఇంటర్ సెకండియర్ పరీక్ష రాసే విద్యార్థులు మాత్రమే అర్హులు.
  • బిట్స్ క్యాంపస్‌లలో బీఈ (ఆనర్స్); బి.ఫార్మసీ (ఆనర్స్); ఎంఎస్సీ (ఆనర్స్); ఎంఎస్సీ (టెక్) కోర్సుల్లో ప్రవేశాలకు బిట్‌శాట్‌ను నిర్వహిస్తున్నారు.
  • ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో విడివిడిగా 60 శాతం మార్కులు, గ్రూపు మొత్తంమీద 75 శాతం మార్కులు పొంది ఉండాలి.
టాపర్లకు నేరుగా ప్రవేశాలు:
రాష్ట్ర స్థాయిలో ఇంటర్ బోర్డు పరీక్షల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్‌కు బిట్స్‌లో నేరుగా ప్రవేశం కల్పిస్తారు. దాదాపుగా బిట్స్ పిలానీలో 800 సీట్లు, గోవా క్యాంపస్‌లో 600 సీట్లు, హైదరాబాద్ క్యాంపస్‌లో 600 వరకు సీట్లున్నాయి.

పరీక్ష విధానం:
బిట్‌శాట్‌ను ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం నాలుగు విభాగాల్లో 150 బహుళైచ్ఛిక ప్రశ్నలుంటాయి. మూడు గంటల్లో సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి +3 మార్కులు, ప్రతి తప్పుకు -1 మార్కులుంటాయి. ప్రశ్నను అటెంప్ట్ చేయకుంటే ఏలాంటి మార్కులు ఉండవు.

 

సబ్జెక్టు

ప్రశ్నలు

మార్కులు

1

ఫిజిక్స్

40

120

2

కెమిస్ట్రీ

40

120

3

ఎ- ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ

15

45

 

బి-లాజికల్ రీజనింగ్

10

30

4

మ్యాథమెటిక్స్

45

135

 

మొత్తం

150

450


పరీక్ష కేంద్రాలు:
రాష్ర్టంలో హైదరాబాద్, బిట్స్ పిలానీ-హైదరాబాద్ క్యాంపస్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి.

పట్టు సాధిస్తే పక్కాగా సీటు:
బిట్‌శాట్ గత ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలకు సంబంధించిన ప్రశ్నలు ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతుల పుస్తకాల ఆధారంగా వస్తున్నాయి. ఇంటర్ పబ్లిక్ పరీక్షలు, జేఈఈ మెయిన్ పూర్తయిన తర్వాత ఇంగ్లిష్, లాజికల్ రీజనింగ్ విభాగాలపై ప్రత్యేక దృష్టిపెట్టి చదవాలి. ఎక్కువ ప్రశ్నలు కాన్సెప్టుల ఆధారంగా బేసిక్స్‌పై వస్తున్నాయి. అందువల్ల పాఠ్యాంశాల్లో లెవెల్-1, లెవెల్-2 స్థాయి వరకు ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.
  • కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి వేగం, కచ్చితత్వం ఎంతో ప్రధానం. నెగిటివ్ మార్కులున్నాయి కాబట్టి పూర్తిగా తెలియని ప్రశ్నలకు సమాధానాలు రాయకూడదు.
  • మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్‌లలో ఎక్కువ మార్కులు సాధించేందుకు ప్రయత్నించాలి. పిలానీలో మంచి బ్రాంచ్‌లో సీటు రావాలంటే 320 కంటే ఎక్కువ మార్కులు రావాలి. హైదరాబాద్‌లో మంచి బ్రాంచ్‌లో సీటు కోసం 300కు పైన మార్కులు సాధించేందుకు ప్రయత్నించాలి.
  • బిట్‌శాట్‌లో ఉన్న మరో సౌలభ్యం అదనపు ప్రశ్నలు ఎంచుకునే అవకాశం లభించడం. ఒక విద్యార్థి మూడు గంటల వ్యవధిలోపే మొత్తం 150 ప్రశ్నలకు సమాధానాలు గుర్తిస్తే.. మిగిలిన సమయంలో అదనంగా 12 ప్రశ్నలు రాసే అవకాశం లభిస్తుంది. ఇవి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి నాలుగు చొప్పున ఉంటాయి. అయితే 150 ప్రశ్నలకు గుర్తించిన సమాధానాలన్నీ సరిగా ఉన్నాయనుకున్నప్పుడే..12 అదనపు ప్రశ్నలను ఎంపిక చేసుకోవాలి.
  • బిట్‌శాట్‌లో అడిగే ప్రశ్నలు కాన్సెప్ట్స్, అప్లికేషన్స్ ఆధారితంగానో లేదా రెండింటి సమ్మిళితంగానో ఉంటాయి. దీంతో విద్యార్థులు తమ ప్రిపరేషన్ క్రమంలో కాన్సెప్ట్స్‌లపై పట్టు సాధించడం.. విజయానికి తొలిమెట్టుగా భా వించి కసరత్తు ప్రారంభించాలి. ప్రతి సబ్జెక్ట్‌లోని కాన్సె ప్ట్స్, అప్లికేషన్స్‌ను నోట్స్ రూపంలో రాసుకుని వాటికి సంబంధించిన ప్రశ్నలను విశ్లేషణతో ప్రాక్టీస్ చేయాలి.
  • ఆన్‌లైన్ విధానంలో జరిగే పరీక్షల విషయంలో మొదట్లో పరీక్ష రాసిన వారికి సులభంగా, చివరి దశలో రాసిన వారికి క్లిష్టంగా ఉంటుందనే అపోహ ఉంది. అయితే బిట్‌శాట్ విషయంలో ఇలాంటి అపోహలకు తావులేకుండా ప్రశ్నల రూపకల్పన జరుగుతుంది. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఒకే స్థాయిలో ప్రశ్నలు ఇచ్చేలా జాగ్రత్త తీసుకుంటారు.
బిట్స్ ప్రత్యేకతలు:
నిబంధనలకు లోబడి మొదటి ఏడాదిలో ఏ కోర్సులో చేరినప్పటికీ రెండో సంవత్సరంలో బ్రాంచ్/కోర్సును మార్చుకోవచ్చు.డ్యూయల్ డిగ్రీని ఎంపిక చేసుకోవచ్చు. బీటెక్ చేస్తూ ఎంటెక్ లేదా ఎంటెక్ చేస్తూ పీహెచ్‌డీ ప్రవేశాలు పొందొ చ్చు. నాలుగు సెమిస్టర్లు పూర్తయిన తర్వాత విద్యార్థులను పారిశ్రామిక శిక్షణకు పంపుతారు. దీనివల్ల విద్యార్థుల్లో ప్రాక్టికల్ పరిజ్ఞానం పెరుగుతుంది. పరిశ్రమల అవసరాల కు తగినట్లు నైపుణ్యాలను పెంచుకునేందుకు వీలవుతుంది.
  • నేర్చుకునే విషయంలో విద్యార్థులకు పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. విద్యార్థులు తమకు అనుకూలమైన టైంటేబుల్‌ను, సబ్జెక్టుకు సంబంధించిన తరగతులను ఎంపిక చేసుకునేందుకు వీలుంటుంది.
జనరల్ టిప్స్:
  • 150 ప్రశ్నల్లో దాదాపు 120 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా ప్రాక్టీస్ చేయాలి.
  • కొద్దిగా శ్రద్ధ పెడితే ఇంగ్లిష్, రీజనింగ్‌లో ఎక్కువ స్కోర్‌కు అవకాశముంటుంది.
  • జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్‌లో వీలైనన్ని పరీక్షలను ఆన్‌లైన్‌లో ప్రాక్టీస్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
  • దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 15, 2014.
  • పరీక్ష కేంద్రం కేటాయింపు: ఫిబ్రవరి 25, 2014.
  • పరీక్ష తేదీని రిజర్వ్ చేసుకునేందుకు వ్యవధి: మార్చి 1- మార్చి 20.
  • హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు: ఏప్రిల్ 15- ఏప్రిల్ 30.
  • పరీక్ష తేదీలు: మే 14- జూన్ 1.
  • కోర్సులో ప్రవేశాలకు ఇంటర్ మార్కులతోపాటు దరఖాస్తు: మే 20 - జూన్ 30, 2014.
  • వెబ్‌సైట్: www.bitsadmission.com
బిట్‌శాట్ 2013-14 కటాఫ్

 

పిలానీ

గోవా

హైదరాబాద్

బీఈ ఆనర్స్ కెమికల్

309

279

280

బీఈ ఆనర్స్ సివిల్

308

-

290

బీఈ ఆనర్స్ ఎలక్ట్రికల్
అండ్ ఎలక్ట్రానిక్స్

343

305

300

మెకానికల్

337

300

299

కంప్యూటర్ సైన్స్

354

323

316

మ్యానుఫ్యాక్చరింగ్

300

-

277

ఎలక్ట్రానిక్స్ అండ్
కమ్యూనికేషన్

-

-

308


మ్యాథమెటిక్స్
Bavitha
  • ముఖ్యమైన చాప్టర్లు: వృత్తాలు, సరళరేఖలు, సరళయుగ్మాలు, సదిశా బీజగణితం, అవకలనాలు, సమాకలనాలు, అవకలన సమీకరణాలు, ద్విపద సిద్ధాంతం, సంభావ్యత..
  • సంకీర్ణ సంఖ్యలలో మాడ్యులస్, ఆంప్లిట్యూడ్, క్యూబ్ రూట్ ఆఫ్ యునిటీ, ఫోర్త్ రూట్ ఆఫ్ యునిటీ, రేఖాగణిత మిళిత సమస్యలు ముఖ్యమైనవి.
  • అవకలన సమీకరణాలలో Higher order సమస్యలు, వాటి అనువర్తనాలు; రోల్స్ సిద్ధాంతం, మీన్ వాల్యూ సిద్ధాంతం; స్టాటిస్టిక్స్, మ్యాథమెటికల్ లాజిక్‌లపై అదనపు సన్నద్ధత అవసరం.
ఫిజిక్స్
Bavitha
  • అటామిక్ ఫిజిక్స్; హీట్ అండ్ థర్మోడైనమిక్స్; మ్యాగ్నటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్; వేవ్ మోషన్; కరెంట్ ఎలక్ట్రిసిటీ; సింపుల్ హార్మోనిక్ మోషన్; ఎలక్ట్రోస్టాటిక్స్; రొటేటరీ మోషన్; రే-ఆప్టిక్స్ ముఖ్యమైన అంశాలు.
  • వెలాసిటీ వివిధ సంబంధాలు, యాక్సిలరేషన్, మ్యాగ్జిమమ్, మినిమమ్ వాల్యూస్ గుర్తుంచుకోవాలి.
  • అటామిక్ ఫిజిక్స్, మెకానిక్స్ నుంచి వచ్చే ప్రశ్నలు కాన్సెప్ట్, అప్లికేషన్ సమ్మిళితంగా ఉంటాయి. కాబట్టి ఈ దిశగా ప్రిపరేషన్ కొనసాగించాలి.
  • ఎక్కువ ప్రశ్నలు ఇంటర్మీడియెట్ ద్వితీయు సంవత్సరం సిలబస్ నుంచి వస్తున్నాయి.
కెమిస్ట్రీ
Bavitha
  • రసాయనిక బంధం, పరమాణు నిర్మాణం, పి-బ్లాక్ మూలకాలు, బయో మాలిక్యూల్స్, కెమికల్ థర్మో డైనమిక్స్, హైడ్రో కార్బన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి.
  • ఆర్గానిక్ కెమిస్ట్రీలో నేమ్డ్ రియాక్షన్స్, ఇంటర్ కన్వర్షన్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
  • ఫిజికల్ కెమిస్ట్రీలో స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, సొల్యూషన్స్, యాసిడ్స్ అండ్ బేసిస్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, థర్మో డైనమిక్స్, సాలిడ్ స్టేట్, కెమికల్ కెనైటిక్స్, ఈక్విలిబ్రియం, కెమికల్-ఎనర్జిటిక్‌లలో ముఖ్య ఫార్ములాలు, కాన్సెప్ట్‌లను.. రివిజన్‌కు వీలుగా తమకు అనుకూలమైన రీతిలో (పాయింట్స్, షార్ట్ నోట్స్, టేబుల్స్ తదితర) పొందుపరచుకోవాలి.
లాజికల్ రీజనింగ్
  • ఇతర ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలతో పోల్చితే ఎదురయ్యే విభిన్నమైన విభాగం లాజికల్ రీజనింగ్. ఇందుకోసం బొమ్మల చిత్రీకరణ, అనాలజీ, లాజికల్ డిడక్షన్, నంబర్, ఆల్ఫాబెటికల్ సిరీస్‌లపై పట్టు సాధించాలి.
ఇంగ్లిష్ ప్రొఫిషియన్సీ
  • ప్రాథమిక ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఎక్కువగా సినానిమ్స్, యాంటానిమ్స్, సెంటెన్స్ కంప్లీషన్/ఫార్మేషన్, టెన్సెస్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్, జంబుల్డ్ వర్డ్స్‌పై దృష్టి సారించాలి. గ్రామర్‌లోని ప్రాథమిక అంశాలన్నింటిపైనా పట్టు సాధించాలి.
రిఫరెన్‌‌స బుక్స్:
Bavitha
ఎన్‌సీఈఆర్‌టీ 11, 12 తరగతి పుస్తకాలు
అరిహంత్ పబ్లికేషన్‌‌స బిట్‌శాట్ ప్రత్యేక పుస్తకాలు
Published date : 26 Dec 2013 03:00PM

Photo Stories