ఇంటర్ పరీక్షలకు తుది దశ ప్రిపరేషన్ వ్యూహం ఇలా...
Sakshi Education
ఇంటర్ పరీక్షలు కొద్ది రోజుల్లోనే జరగనున్నాయి. ప్రథమ సంవత్సరం విద్యార్థులు తొలిసారిగా ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్నారు.
ముఖ్యంగా ఎంపీసీ విద్యార్థులకు భవిష్యత్ కోణంలో ఇంటర్ మార్కులు అత్యంత కీలకం. తొలి సంవత్సరం పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసి... మరింత ఉత్సాహంతో సెకండియర్‌కు వెళ్లాలని విద్యార్థులు కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రథమ సంవత్సరం ఎంపీసీ విద్యార్థులకు ఉపయోగపడేలా తుది దశ ప్రిపరేషన్ వ్యూహం...
మ్యాథ్స్‌పై ఫోకస్ :
విద్యార్థులు అందుబాటులో ఉన్న ఈ తక్కువ సమయాన్ని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలి. ప్రతి సబ్జెక్టును రివిజన్ చేస్త్తూ ముందుకెళ్లాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీలకు సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. మ్యాథ్స్‌కు సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాల్లోని సాల్వ్‌డ్ ప్రాబ్లమ్స్‌ను సాధన చేయాలి. దీంతోపాటు అభ్యసన (ఎక్సెర్‌సైజ్)లో ఇచ్చిన అతిస్వల్ప, స్వల్ప, దీర్ఘ సమాధాన సమస్యలను ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది. వెయిటేజీని దృష్టిలో పెట్టుకొని ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో 8 మార్కుల ప్రశ్నలను, మ్యాథ్స్‌లో 7 మార్కుల ప్రశ్నలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. పరీక్షలో ముందుగా దీర్ఘసమాధాన ప్రశ్నలు, తర్వాత లఘు సమాధాన, అతి స్వల్ప ప్రశ్నలను రాయడం తెలివైన వ్యూహం. 100 శాతం మార్కులు లక్ష్యంగా ఉన్నవారు రెండు మార్కుల ప్రశ్నలను టార్గెట్ చేయాలి. అతి స్వల్ప సమాధాన ప్రశ్నలను అన్నింటినీ ఒకే వరుసలో రాయాలి. ఇప్పటికీ అభ్యర్థుల్లో ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే లెక్చరర్లతో మాట్లాడాలి. దీంతోపాటు గత మూడేళ్ల ప్రశ్నపత్రాలను సాధన చేస్తే పరీక్షకు ముందు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆల్ ది బెస్ట్!
- ఎం.ఎన్.రావు, శ్రీచైతన్య విద్యాసంస్థలు.
మ్యాథ్స్‌పై ఫోకస్ :
- మ్యాథ్స్‌లో చూపిన ప్రతిభపైనే ఇంటర్ పర్సంటైల్ ఆధారపడి ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రథమ సంవత్సరంలో మ్యాథ్స్ రెండు పేపర్లకు కలిపి 150 మార్కులు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు మిగిలిన సబ్జెక్టులతో పోల్చితే మ్యాథ్స్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి. శ్రద్ధ పెడితే మ్యాథ్స్‌లో పూర్తిస్థాయి మార్కులు సాధించొచ్చు.
- మ్యాథ్స్ IAలో 10 చాప్టర్లు ఉన్నాయి. వీటిలో ప్రమేయాలు, గణితానుగమన సిద్ధాంతం, మాత్రికలు, సదిశలు, విలోమ త్రికోణమితీయ ప్రమేయాలు, త్రిభుజ ధర్మాలు నుంచి ఏడు మార్కుల ప్రశ్నలు అడుగుతున్నారు. మాత్రికలకు అత్యధికంగా 22 మార్కులు వెయిటేజీ ఉంది. ఈ చాప్టర్ నుంచి రెండు దీర్ఘసమాధాన ప్రశ్నలు, రెండు లఘు ప్రశ్నలు, రెండు అతిస్వల్ప ప్రశ్నలు వస్తాయి. మాత్రిక కోటి కనుక్కోవడం, డెట్ పద్ధతి, విలోమ, క్రామర్స్ తదితర పద్ధతులపై సమస్యలు వస్తాయి. ప్రమేయాలకు 11 మార్కుల వెయిటేజీ ఉంది. ఈ చాప్టర్ నుంచి సిద్ధాంతాలపై ఏడు మార్కుల ప్రశ్న వస్తుంది. కొంచెం శ్రద్ధపెడితే మాత్రికలు, ప్రమేయాల నుంచే 33 మార్కులు సాధించొచ్చు. గణితానుగమనంలో ‘ఎన్’వ పదం సమస్యలను సాధించడంతోపాటు కాన్సెప్టులపై పట్టుసాధించాలి.
- మ్యాథ్స్ IBలో 10 చాప్టర్లు ఉన్నాయి. సరళరేఖ నుంచి ఒకటి, సరళరేఖాయుగ్మాల నుంచి రెండు, దిక్ కొసైన్లు-దిక్ సంఖ్యలు నుంచి ఒకటి, అవకలనం నుంచి ఒకటి, అవకలజం-అనువర్తనాలు నుంచి రెండు ఏడు మార్కుల ప్రశ్నలు వస్తాయి. ఈ పేపర్‌లో అవకలజం-అనువర్తనాల చాప్టర్‌కు అత్యధికంగా 26 మార్కుల వెయిటేజీ ఉంది. దీన్నుంచి దీర్ఘసమాధాన ప్రశ్నలతోపాటు రెండు లఘు ప్రశ్నలు, రెండు అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి. సరళరేఖ చాప్టర్‌కు 15 మార్కుల వెయిటేజీ ఉంది. దీన్నుంచి ఒక ఏడు మార్కులు, ఒక నాలుగు మార్కులు, రెండు అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి. అవకలనం(15 మార్కులు) చాప్టర్ నుంచి ఒక ఏడు మార్కులు, ఒక నాలుగు మార్కులు, రెండు అతిస్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి. బిందుపథం నుంచి నాలుగు మార్కుల ప్రశ్న వస్తుంది.
- మ్యాథ్స్(IA, IB)కు సంబంధించి అభ్యర్థులు సులభంగా మార్కులు సాధించేందుకు అవకాశం ఉన్న చాప్టర్ల వివరాలు...
- మాత్రికలు, నిర్ధారకాలు.
- సదిశా బీజగణితం.
- గణితానుగమన సిద్ధాంతం.
- ప్రమేయాలు.
- సరళరేఖలు.
- సరళయుగ్మాలు.
- దిక్ కొసైన్‌లు.
- 8. అవకలనాలు.
- మ్యాథ్స్‌లో అభ్యర్థులు ఎక్కువగా రెండు మార్కుల ప్రశ్నల్లో మార్కులు కోల్పోతుంటారు. మార్కులు కోల్పోయేందుకు ఆస్కారమున్న అంశాలు....
-
- ప్రమేయాల్లోని వ్యాప్తి, ప్రదేశం.
- సదిశలు
- అవధులు
- తలాలు
- పైన పేర్కొన్న చాప్టర్లలో అతి స్వల్ప ప్రశ్నలను జాగ్రత్తగా సాధించగలిగితే విద్యార్థులకు 100 శాతం మార్కులు సొంతమవుతాయి.
- ప్రథమ సంవత్సరంలోని గ్రూపు సబ్జెక్టుల్లో ఫిజిక్స్ సులభమైందని చెప్పొచ్చు. ఏ ఒక్క చాప్టర్‌ను వదలకుండా.. తెలుగు అకాడమీ పుస్తకంలోని ప్రశ్నలన్నీ చదివితే పూర్తిస్థాయి మార్కులు సాధించొచ్చు. ఫిజిక్స్‌లో వెయిటేజీ ఏటా మారుతోంది. అభ్యర్థులు దీన్ని తప్పనిసరిగా గమనించాలి. 2014, 2015 ప్రశ్నపత్రాలను ప్రిపేర్‌కావడం లాభిస్తుంది.
- ఫిజిక్స్‌లో మొత్తం 13 పాఠ్యాంశాలు ఉన్నాయి. వీటిలో థర్మోడైనమిక్స్, ఆసిలేషన్స్, పని-సామర్థ్యం-శక్తి(గతిశాస్త్రం) నుంచి ఎనిమిది మార్కుల ప్రశ్నలు వస్తాయి. భ్రమణ చలనం నుంచి రెండు నాలుగు మార్కుల ప్రశ్నలు వస్తాయి. ఒకవేళ దీన్నుంచి ఎనిమిది మార్కుల ప్రశ్న వస్తే.. థర్మోడైనమిక్స్ నుంచి రెండు నాలుగు మార్కుల ప్రశ్నలు అడుగుతారు.
- శక్తి నిత్యత్వ నియమం (స్వేచ్ఛగా కిందకు పడే వస్తువు విషయంలో నిరూపణ).
- లఘులోలక సరళహరాత్మక చలనం
- క్షితిజాక్ష సిద్ధాంతం
- లంబాక్ష సిద్ధాంతం
- కార్నాట్ ఇంజన్ సూత్రాలు, పనితీరు.
- రెండవ ఉష్ణగతిక నియమం, హీట్ ఇంజన్, రిఫ్రిజిరేటర్-పనితీరు
- న్యూటన్ శీతల నియమం.
- ఆదర్శవాయు సమీకరణం
- ఉష్ణవాహకత.
- పని-శక్తి సిద్ధాంతం(నిరూపణ).
- మోషన్ ఆఫ్ పార్టికల్ ఇన్ రిఫరెన్స్ సర్కిల్, సరళ హరాత్మక చలనం.
- న్యూటన్ రెండో గమన నియమం(F=ma)
- అభ్యర్థులు పరీక్షలో ఎక్కువ భాగాలుగా ఉన్న దీర్ఘసమాధాన ప్రశ్నలను ఎంచుకొని రాయడం లాభిస్తుంది. కొన్నేళ్లుగా దీర్ఘసమాధాన ప్రశ్నల్లో తప్పకుండా ఒక సమస్య ఇస్తున్నారు. ఇవి యూనిట్స్ కన్వెర్షన్, సబ్‌స్టిట్యూషన్, క్యాలిక్యులేషన్‌కు సంబంధించినవిగా ఉంటున్నాయి. అభ్యర్థులు ఫిజిక్స్‌లో డయాగ్రామ్స్ వద్ద సమయం వృథా చేసుకోవద్దు, సంబంధిత భాగాన్ని స్పష్టంగా వేస్తే సరిపోతుంది.
- నాలుగు మార్కులకు సంబంధించి ఒక ప్రాబ్లమ్, ఒక కంపారిజన్(పోల్చడం) క్వశ్చన్, మూడు డెరివేటివ్ క్వశ్చన్స్, మూడు సిద్ధాంతపరమైన(థియరిటికల్) ప్రశ్నలు అడుగుతారు. ప్రాబ్లమ్ క్వశ్చన్‌కు సంబంధించి డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఫార్ములా అండ్ సబ్‌స్టిట్యూషన్, క్లాసిఫికేషన్ యూనిట్లకు ఒక మార్కు చొప్పున(మొత్తం నాలుగు) ఇస్తారు. ఫలితాన్ని బాక్స్‌లో రాయడం లాభిస్తుంది. కంపారిజన్ క్వశ్చన్స్‌కు సంబంధించి ప్రతిదానికి నాలుగు పాయింట్లు చొప్పున టేబుల్ రూపంలో రాయాలి.
- అతిస్వల్ప సమాధాన ప్రశ్నల్లో 5 థియరిటికల్ (సిద్ధాంత పరమైనవి), ప్రాబ్లమ్స్, డిఫరెన్సెస్‌పై చెరొకటి, విలువలపై రెండు, అభ్యర్థి ఆలోచనను పరీక్షించేలా ఒక ప్రశ్న అడుగుతున్నారు.
- కెమిస్ట్రీలో పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ-ఆవర్తన ధర్మాలు, రసాయన బంధం చాప్టర్ల నుంచి దీర్ఘసమాధాన ప్రశ్నలు అడుగుతున్నారు. పదార్థ స్థితులు, రసాయన సమతాస్థితి, కర్బన రసాయన శాస్త్రం, హైడ్రోజన్, దాని సమ్మేళనాలు, 13వ గ్రూపు మూలకాలు నుంచి లఘు సమాధాన ప్రశ్నలు వస్తున్నాయి. పర్యావరణ రసాయనశాస్త్రం, 1ఎ, 2ఎ గ్రూపు మూలకాలు, 14వ గ్రూపు, పదార్థస్థితులు, ఆమ్లాలు-క్షారాలు, కర్బన రసాయన శాస్త్రం నుంచి అతి స్వల్ప ప్రశ్నలు అడుగుతున్నారు.
- కెమిస్ట్రీలో 60 మార్కులు పొందాలంటే.. ప్రతి విద్యార్థీ తెలుగు అకాడమీ పుస్తకాన్ని సమగ్రంగా చదవాలి. దీంతోపాటు కాలేజీ మెటీరియల్‌ను ప్రిపేర్‌కావాలి. గత రెండేళ్ల ప్రశ్నపత్రాల సరళిని పరిశీలిస్తే.. కింది చాప్టర్ల నుంచి దీర్ఘసమాధాన ప్రశ్నలు అడిగే అవకాశం ఉందని చెప్పొచ్చు...
1. అటామిక్ స్ట్రక్చర్
2. మూలకాల వర్గీకరణ
3. రసాయనబంధం
4. కర్బన రసాయన శాస్త్రం
- బోర్స్ మోడల్ ఆఫ్ ఆటమ్ అండ్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్
- క్వాంటమ్ నంబర్స్
- ఆవర్తన ధర్మాలు, పరమాణు వ్యాసార్ధం, అయనీకరణ శక్మం, ఎలక్ట్రాన్ ఎఫినిటీ.
- హైబ్రడైజేషన్ అండ్ వెస్పర్ థియరీ
- ఇథిలీన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్
- ఎసిటిలీన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్
- బెంజీన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్
విద్యార్థులు అందుబాటులో ఉన్న ఈ తక్కువ సమయాన్ని ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలి. ప్రతి సబ్జెక్టును రివిజన్ చేస్త్తూ ముందుకెళ్లాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీలకు సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. మ్యాథ్స్‌కు సంబంధించి తెలుగు అకాడమీ పుస్తకాల్లోని సాల్వ్‌డ్ ప్రాబ్లమ్స్‌ను సాధన చేయాలి. దీంతోపాటు అభ్యసన (ఎక్సెర్‌సైజ్)లో ఇచ్చిన అతిస్వల్ప, స్వల్ప, దీర్ఘ సమాధాన సమస్యలను ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది. వెయిటేజీని దృష్టిలో పెట్టుకొని ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో 8 మార్కుల ప్రశ్నలను, మ్యాథ్స్‌లో 7 మార్కుల ప్రశ్నలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలి. పరీక్షలో ముందుగా దీర్ఘసమాధాన ప్రశ్నలు, తర్వాత లఘు సమాధాన, అతి స్వల్ప ప్రశ్నలను రాయడం తెలివైన వ్యూహం. 100 శాతం మార్కులు లక్ష్యంగా ఉన్నవారు రెండు మార్కుల ప్రశ్నలను టార్గెట్ చేయాలి. అతి స్వల్ప సమాధాన ప్రశ్నలను అన్నింటినీ ఒకే వరుసలో రాయాలి. ఇప్పటికీ అభ్యర్థుల్లో ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే లెక్చరర్లతో మాట్లాడాలి. దీంతోపాటు గత మూడేళ్ల ప్రశ్నపత్రాలను సాధన చేస్తే పరీక్షకు ముందు ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఆల్ ది బెస్ట్!
- ఎం.ఎన్.రావు, శ్రీచైతన్య విద్యాసంస్థలు.
Published date : 18 Feb 2019 06:14PM