Skip to main content

సరైన సాధనతో విజయ శిఖరాలకు..!

Commerce చార్టర్డ్ అకౌంటెంట్‌గా స్థిరపడాలని కోరుకునే వారు కొందరు.. కంపెనీ సెక్రటరీ కొలువును చేజిక్కించు కోవాలనుకునే వారు మరికొందరు.. వీరి లక్ష్యాల సాధనకు మార్గాన్ని సుగమం చేసే సబ్జెక్టులు.. సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్. ఇవి గ్రూపు సబ్జెక్టులుగా ఉన్న సీఈసీని అధిక మార్కులతో దిగ్విజయంగా పూర్తిచేసి సుస్థిర వృత్తి జీవితం వైపు అడుగులు వేయొచ్చు. ఈ నేపథ్యంలో ఇంటర్ సెకండియర్ సీఈసీ ప్రిపరేషన్ ప్రణాళిక..

సివిక్స్
సీనియర్ ఇంటర్ సివిక్స్ పాఠ్య ప్రణాళికలో భారత రాజ్యాంగం, భారత ప్రభుత్వం, పరిపాలన అంశాలు ఉన్నాయి. సిలబస్‌లో ఎనిమిది యూనిట్లు ఉన్నాయి.

ప్రశ్నపత్రం:
  • సివిక్స్‌కు 100 మార్కులు కేటాయించారు. ప్రశ్నపత్రం మూడు విభాగాలుగా ఉంటుంది.
  • సెక్షన్-ఎలో ఐదు వ్యాసరూప ప్రశ్నలుంటాయి. వాటిలో మూడింటికి సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 10 మార్కులు.
  • సెక్షన్-బిలో 12 ప్రశ్నలుంటాయి. వాటిలో 8 ప్రశ్నలకు కనీసం 20 పంక్తుల్లో సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు.
  • సెక్షన్-సిలో 20 ప్రశ్నలు ఇస్తారు. వాటిలో 15 ప్రశ్నలకు కనీసం 5 పంక్తుల్లో సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు.
వ్యాసరూప ప్రశ్నలకు ముఖ్యమైనవి:
  1. భారత రాజ్యాంగం-ముఖ్య లక్షణాలు.
  2. ప్రాథమిక హక్కులు.
  3. భారత రాష్ట్రపతి.
  4. భారత ప్రధానమంత్రి.
  5. భారత పార్లమెంటు.
  6. రాష్ట్ర గవర్నర్.
  7. గ్రామీణ- పట్టణ స్థానిక ప్రభుత్వాలు.
  8. జిల్లా కలెక్టర్ తదితర అంశాలు.
ఐదు మార్కుల ప్రశ్నలకు:
  • భారత జాతీయోద్యమం ఆవిర్భావానికి కారణాలు, వివిధ జాతీయోద్యమ ఉద్యమాలు, భారత ప్రభుత్వ చట్టాలు.
  • ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు- ఆదేశిక సూత్రాల మధ్య భేదాలు.
  • ఉప రాష్ట్రపతి- మంత్రిమండలి.
  • శాసన తయారీ విధానం- వివిధ బిల్లులు, పార్లమెంటరీ కమిటీలు.
  • సుప్రీంకోర్టు అధికారాలు; రాష్ట్ర ప్రభుత్వం- రాష్ట్ర శాసనశాఖ- రాష్ట్ర న్యాయశాఖ.
  • కేంద్ర- రాష్ట్ర సంబంధాలు- సర్కారియా కమిషన్ సూచనలు.
  • 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాలు, వివిధ స్థానిక ప్రభుత్వాల విధులు.
  • భారత విదేశాంగ విధానం, ఐక్యరాజ్యసమితి, సమకాలీన ధోరణులు- అంశాలు.
రెండు మార్కుల ప్రశ్నలకు:
ప్రతి పాఠ్యాంశానికి సంబంధించిన ఏ అంశం నుంచైనా రెండు మార్కుల ప్రశ్నలు వచ్చే అవకాశముంది. అయితే ఎక్కువ ప్రశ్నలు వచ్చేందుకు అవకాశమున్న ముఖ్యమైన అంశాలు: భారత రాజ్యాంగం (యూనిట్ 1); కేంద్ర ప్రభుత్వం (యూనిట్ 3); భారత పార్లమెంటు (యూనిట్ 4); రాష్ట్ర శాసనశాఖ (యూనిట్ 7); కేంద్ర- రాష్ట్ర సంబంధాలు (యూనిట్ 9); స్థానిక ప్రభుత్వాలు (యూనిట్ 10); ఐక్యరాజ్య సమితి (యూనిట్ 12); సమకాలీన ధోరణులు- అంశాలు (యూనిట్ 13).

సూచనలు:
  • ప్రశ్నపత్రాన్ని ఒకటికి రెండుసార్లు చదవాలి. పూర్తిగా అవగాహన ఉన్న ప్రశ్నలనే ఎంపిక చేసుకోవాలి.
  • మొదట రెండు మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఈ విభాగంలో 15 ప్రశ్నలకే సమాధానాలు రాయాల్సి ఉన్నా అదనంగా మరో రెండింటికి సమాధానాలు రాస్తే మంచిది.
  • వ్యాసరూప ప్రశ్నలకు 20-30 నిమిషాలు, ఐదు మార్కుల ప్రశ్నలకు 10-20 నిమిషాలు, రెండు మార్కుల ప్రశ్నలకు ఐదు నిమిషాలు కేటాయించాలి. చివరి 5 నిమిషాలు పునఃపరిశీలనకు కేటాయించాలి.
  • సీనియర్ ఇంటర్ సిలబస్‌లో రాజ్యాంగ అధికరణలు (ఆర్టికల్స్) ఉన్నాయి. అందువల్ల అవసరమైన చోట ఆర్టికల్స్‌ను, సమకాలీన ఉదాహరణలు రాయవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల ఎక్కువ మార్కులు వచ్చేందుకు అవకాశముంటుంది.
కామర్స్
పార్ట్-1 వాణిజ్య శాస్త్రం సిలబస్:
యూనిట్ 1:
అంతర్జాతీయ వర్తకం.
యూనిట్ 2: మార్కెటింగ్ వ్యవస్థలు, వ్యాపార ప్రకటనలు, వినియోగదారిత్వం.
యూనిట్ 3: వ్యాపార సేవలు.
యూనిట్ 4: స్టాక్ ఎక్స్చేంజ్‌లు.
యూనిట్ 5: కంప్యూటర్ అవగాహన.
పార్ట్- 2 వ్యాపార గణక శాస్త్రం:
యూనిట్ 1: వర్తకం బిల్లులు, తరుగుదల.
యూనిట్ 2: కన్‌సైన్‌మెంట్ ఖాతాలు.
యూనిట్ 3: వ్యాపారేతర సంస్థల ఖాతాలు.
యూనిట్ 4: ఒంటిపద్దు విధానం.
యూనిట్ 5: భాగస్వామ్య వ్యాపార ఖాతాలు, భాగస్తుని ప్రదేశం, భాగస్తుని విరమణ.
ప్రశ్నపత్రం:
పార్ట్- 1 థియరీ- 50 మార్కులు
విభాగం మార్కులు సమయం
సెక్షన్-ఎ 10 x 2 = 20 35 నిమిషాలు
సెక్షన్-బి 4 x 5 = 20 35 నిమిషాలు
సెక్షన్-సి 5 x 2 = 10 20 నిమిషాలు
  • సెక్షన్-ఎ విభాగంలో వ్యాసరూప ప్రశ్నలు.. ప్రధానంగా స్టాక్ ఎక్స్చేంజ్, మార్కెటింగ్ వ్యవస్థ, వ్యాపార సేవలు, వినియోగదారిత్వం యూనిట్ల నుంచి వస్తాయి. అధిక మార్కులు సాధించేందుకు నిర్వచనం, ముఖ్యాంశాలను అండర్‌లైన్ చేస్తూ ముగింపు రాయాలి.
  • సెక్షన్-బిలోని లఘు సమాధాన ప్రశ్నలు.. ప్రధానంగా స్టాక్ ఎక్స్చేంజ్, అంతర్జాతీయ వర్తకం, వ్యాపార ప్రకటనలు, కంప్యూటర్ అవగాహన లేదా వ్యాపార సేవల యూనిట్ల నుంచి వస్తాయి. ఈ సెక్షన్‌లో పూర్తి మార్కులు పొందేందుకు ఎక్కువ అవకాశం ఉన్నందున నిర్వచనంతో పాటు ప్రశ్నకు సంబంధించిన ప్రత్యక్ష సమాధానాలను విపులంగా రాయాలి.
  • సెక్షన్-సిలో అతిస్వల్ప సమాధాన ప్రశ్నలకు క్లుప్తంగా, వివరంగా సమాధానాలు రాసి పూర్తి మార్కులు పొందొచ్చు.
పార్ట్- 2
అకౌంట్స్- 50 మార్కులు
విభాగం మార్కులు సమయం
సెక్షన్-డి 1 x 20 = 20 30 నిమిషాలు
సెక్షన్-ఇ 1 x 10 = 10 20 నిమిషాలు
సెక్షన్-ఎఫ్ 2 x 5 = 10 20 నిమిషాలు
సెక్షన్-జి 5 x 2 = 10 20 నిమిషాలు
  • సెక్షన్-డి లో భాగస్వామ్య వ్యాపార సంస్థకు సంబంధించి 20 మార్కుల ప్రశ్న వస్తుంది. దీనికి సమాధానం సుదీర్ఘంగా ఉండటం వల్ల సంబంధిత పట్టికల్లో జాగ్రత్తగా వ్యవహారాలను నమోదు చేస్తూ సరైన పద్ధతిలో ఖాతాల నిల్వల్ని తేల్చాలి. సమయం వృథా కాకుండా చూసుకోవాలి.
  • సెక్షన్-ఇ లో కన్‌సైన్‌మెంట్ ఖాతాలు, వ్యాపారేతర సంస్థల ఖాతాల నుంచి 10 మార్కుల ప్రశ్నలు వస్తాయి. వీటిని బాగా చదివి, అర్థం చేసుకొని ఒక ప్రశ్నను ఎంపిక చేసుకొని అవసరమైన మేరకు మాత్రమే సమాధానం రాయాలి.
  • సెక్షన్-ఎఫ్ లోని నాలుగు ప్రశ్నల్లో 3 అకౌంట్స్ ప్రశ్నలు, 1 థియరీ ప్రశ్న వచ్చేందుకు అవకాశముంది. విద్యార్థులు వారికి అనువైన ప్రశ్నలను ఎంపిక చేసుకోవాలి.
  • సెక్షన్-జి లో అతిస్వల్ప సమాధాన ప్రశ్నలకు క్లుప్తంగా, సవివరంగా సమాధానాలు రాయాలి.
సూచనలు:
  • అకౌంట్స్ విభాగంలో అధిక శాతం సుదీర్ఘ సమాధాన ప్రశ్నలు, ఛ్చిఛిఠ్చ్టజీౌట ఉన్నందున సమాధానాలు రాయటంలో వేగం, కచ్చితత్వం ప్రధానం.
  • అకౌంట్స్‌లో నియమాలు, సూత్రాలను అనుసరిస్తూ సమాధానాలు రాయాలి. అవసరమైన చోట తప్పనిసరిగా స్కేలు, పెన్సిల్ ఉపయోగించాలి.
ఎకనామిక్స్
ఇంటర్ ద్వితీయ సంవత్సరం అర్థశాస్త్రంలో అధిక మార్కులు సాధించాలంటే భారత దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వివిధ అంశాలు, ఆర్థిక సమస్యలు- కారణాలు, నివారణ చర్యలు, గణాంక వివరాలను కూలంకషంగా చదివి, అర్థం చేసుకుంటే మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది.

సిలబస్:
యూనిట్ 1: ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి.
యూనిట్ 2: నూతన ఆర్థిక సంస్కరణలు.
యూనిట్ 3: జనాభా, మానవ వనరుల అభివృద్ధి.
యూనిట్ 4: జాతీయాదాయం.
యూనిట్ 5: వ్యవసాయ రంగం.
యూనిట్ 6: పారిశ్రామిక రంగం.
యూనిట్ 7: తృతీయ రంగం.
యూనిట్ 8: ప్రణాళికలు.
యూనిట్ 9: పర్యావరణం, ఆర్థికాభివృద్ధి.
యూనిట్10: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ- విహంగ వీక్షణం.

ప్రశ్నపత్రం:
  • సెక్షన్- ఎలోని ఐదు ప్రశ్నల్లో మూడింటికి సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 10 మార్కులు.
  • సెక్షన్- బిలోని 12 ప్రశ్నల్లో ఎనిమిది ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 5 మార్కులు.
  • సెక్షన్- సిలోని 20 ప్రశ్నల్లో 15 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
మార్కుల వెయిటేజీ:
యూనిట్ 10 మార్కులు 5 మార్కులు 2 మార్కులు
1 1 - 2
2 1 2 2
3 1 1 2
4 1 2 -
5 1 2 4
6 1 2 2
7 - 2 3
8 - 1 3
9 - 1 3
10 - 1 -
  • పది మార్కుల ప్రశ్నకు 20 నిమిషాలు, ఐదు మార్కుల ప్రశ్నకు 10 నిమిషాలు, రెండు మార్కుల ప్రశ్నకు రెండు నిమిషాలు కేటాయించాలి. పునఃపరిశీలనకు 10 నిమిషాలు కేటాయించాలి.
సూచనలు:
  • ద్వితీయ సంవత్సరం అర్థశాస్త్రం సిలబస్‌లో ముఖ్యంగా నాలుగు యూనిట్లపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. అవి: జాతీయాదాయం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, నూతన ఆర్థిక సంస్కరణలు. వీటి నుంచి దాదాపు 80 నుంచి 90 మార్కుల వరకు ప్రశ్నలు వస్తాయి.
  • ప్రతి సమాధానంలో సబ్ హెడ్డింగ్స్, గణాంకాలు ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఎక్కువ మార్కులు సాధించేందుకు అవకాశముంటుంది.
  • 10 మార్కుల ప్రశ్నకు కనీసం 8 కారణాలు, ఆరు నివారణ చర్యలు రాయాలి. 5 మార్కుల ప్రశ్నకు ఐదారు అంశాలు రాయాలి.
  • పరీక్షలో తొలుత రెండు మార్కుల ప్రశ్నలకు, తర్వాత ఐదు మార్కుల ప్రశ్నలకు, చివరగా 10 మార్కుల ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.
ఎకనామిక్స్
Commerce జాతీయాదాయం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, నూతన ఆర్థిక సంస్కరణల అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.



కామర్స్
Commerce ‘అకౌంట్స్’ విభాగానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు రాయటంలో వేగం, కచ్చితత్వం ప్రధానం.



సివిక్స్
Commerce అవసరమైన చోట సమకాలీన ఉదాహరణలు, ఆర్టికల్స్‌తో సమాధానాలు రాస్తే ఎక్కువ మార్కులు వస్తాయి.



prepared by
K. Janardhan Reddy (Economics)
Kuruhuri Ramesh (Commerce)
G.W. Stevenson (Civics)
Royal Educational Institutions,
Hyderabad.
Published date : 04 Oct 2013 04:32PM

Photo Stories