మెరుగైన మార్కులకు మార్గాలివిగో..
Sakshi Education
ఇంజనీర్‌గా స్థిరపడాలని కోరుకున్న వారు కొందరు.. శాస్త్రవేత్త స్థాయికి ఎదగాలని తపించే వారు మరికొందరు.. వీరి లక్ష్యాల సాధనకు ఇంటర్ ఎంపీసీ తొలిమెట్టు! దీన్ని అధిక మార్కులతో దిగ్విజయంగా పూర్తిచేసి ఉన్నత కెరీర్ దిశగా అడుగులు వేయొచ్చు. ఎంసెట్, జేఈఈలో ఇంటర్ మార్కులకు వెయిటేజ్ ఉన్న నేపథ్యంలో ఎంపీసీ సెకండియర్ పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కుల సాధనకు దీర్ఘకాలిక ప్రిపరేషన్ ప్రణాళిక..
సీనియర్ ఎంపీసీ విద్యార్థులకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ముఖ్యమైనవి. మార్కుల పరంగా చూస్తే మ్యాథమెటిక్స్‌కు 150 మార్కులు, ఫిజిక్స్‌కు 60 మార్కులు, కెమిస్ట్రీకి 60 మార్కులు కేటాయించారు. విద్యార్థులు ఇంటర్ బోర్డు పరీక్షలకు సమాంతరంగా ఎంసెట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. పక్కా ప్రణాళికను అనుసరిస్తే తప్ప ఇది సాధ్యం కాదు. విద్యార్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులను పరీక్షల్లో మంచి మార్కులు సాధించడమే లక్ష్యంగా కాకుండా నైపుణ్యాల (Skills)ను మెరుగుపరచుకోవాలన్న దృక్పథంతో చదివినప్పుడే మంచి ఫలితం ఉంటుంది.
వ్యూహంతో విజయం:
మొదటి ఏడాదితో పోలిస్తే ద్వితీయ సంవత్సరం కీలకమైనది. ఒకవైపు ఎంట్రన్స్ పరీక్షలకు, మరోవైపు ఇంటర్ ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలకు సిద్ధంకావాల్సి ఉంటుంది. అందువల్ల విద్యార్థులు ఒత్తిడికి గురవుతుంటారు. చక్కని సమయ పాలన (Time Management), ప్రిపరేషన్ వ్యూహాల (Preparation Strategies)ను అనుసరిస్తే ఒత్తిడిని అధిగమించి విజయం సాధించవచ్చు. జనవరి మొదటి వారం వరకు అధిక సమయాన్ని పోటీ పరీక్షలకు కేటాయించాలి. వీలైనన్ని ఆబ్జెక్టివ్ టైప్ పరీక్షలు రాస్తూ, ఐపీఈకి సంబంధించిన పరీక్షలను కూడా రాస్తుండాలి. జనవరి రెండో వారం నుంచి ఆబ్జెక్టివ్ పద్ధతిని పక్కనపెట్టి ఐపీఈ ప్రాక్టికల్స్, లాంగ్వేజెస్, సబ్జెక్టుల థియరీ పరీక్షలకు సిద్ధం కావాలి. ఎంసెట్‌లో ఇంటర్ మార్కులకు 25 శాతం, జేఈఈ మెయిన్‌లో 40 శాతం వెయిటేజీ ఉంది. అడ్వాన్స్‌డ్‌కి టాప్ 20 పర్సంటైల్‌లో ఉండాలి. విద్యార్థులు ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ప్రిపరేషన్‌ను కొనసాగించాలి.
బేసిక్ కాన్సెప్ట్‌లపై పట్టు:
రోజులో కాలేజీ సమయాన్ని మినహాయించి ఓ విద్యార్థి ఆరు గంటలు చదువుకు కేటాయిస్తే అందులో మూడు గంటలు మ్యాథమెటిక్స్, గంటన్నర ఫిజిక్స్, గంటన్నర కెమిస్ట్రీకి కేటాయించాలి. ఎంట్రన్స్ పరీక్షల్లో బేసిక్ కాన్సెప్ట్‌ల ఆధారంగా ప్రశ్నలు వస్తాయి. అందువల్ల విద్యార్థులు ప్రతి అంశానికి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ పాయింట్స్‌ను నోట్సు రూపంలో రాసుకొని నిర్దిష్ట సమస్య సాధనలో వాటి అప్లికేషన్స్‌ను గుర్తించాలి. ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు, ఎంట్రన్స్‌ల్లో మంచి ర్యాంకు సాధించాలంటే వీకెండ్ టెస్ట్‌లు, యూనిట్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లు రాయడంతో పాటు ప్రీవియస్ పేపర్స్‌ను సాధన చేయాలి.
చాప్టర్లను వదిలేయొద్దు:
సాధారణంగా కొందరు విద్యార్థులు కష్టంగా ఉన్నాయనే భావనతోనో లేదంటే టైమ్ ప్లానింగ్ లేకపోవడం వల్లో కొన్ని చాప్టర్లను విస్మరిస్తుంటారు. అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో ఇలా చేయడం మంచిది కాదు. ప్రతి చాప్టర్‌కు దానికి ముందున్న చాప్టర్‌తో సంబంధముంటుంది. ప్రస్తుతం సెకండియర్ చదువుతున్న విద్యార్థులు ఒకవేళ ఫస్టియర్‌లో ఏవైనా చాప్టర్లను వదిలేస్తే వాటిని ఒకసారి చదివి, తర్వాత వాటితో సంబంధమున్న సెకండియర్ టాపిక్స్‌ను చదవాలి.
కచ్చితత్వం, సమయ పాలన ముఖ్యం:
ఎంపీసీలో మంచి మార్కులు సాధించాలంటే విద్యార్థులు కచ్చితత్వం, సమయ పాలనకు ప్రాధాన్యమివ్వాలి. సీనియర్ లెక్చరర్లను అడిగి, గత ప్రశ్నపత్రాలను పరిశీలించి ముఖ్యమైన చాప్టర్లను గుర్తించాలి. వాటికి సంబంధించిన సమాచారాన్ని ప్రామాణిక పాఠ్యపుస్తకాలు, లెక్చరర్ నోట్స్ నుంచి చదవాలి. ప్రతి చాప్టర్‌కు సంబంధించిన సినాప్సిస్‌ను చదవడం, అన్ని రకాల సమస్యల్ని సాధించడం అనే లక్షణాలను విద్యార్థులు అలవరచుకోవాలి.
అకాడమీ పుస్తకాలతో మేలు:
విద్యార్థులు పుస్తకాల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. అయిదారు పుస్తకాలను పోగేసుకొని చదవకుండా అకాడమీ పుస్తకాలు, కాలేజీ మెటీరియల్‌కి పరిమితమై వాటిలోని అంశాలపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలి. సిలబస్‌ను పూర్తిగా చదవడం పూర్తయిన తర్వాత మొదటి, రెండో రివిజన్ సమయంలో వ్యాసరూప సమాధాన ప్రశ్నలకు బదులు కాన్సెప్ట్, అప్లికేషన్ విధానానికి ప్రా ధాన్యం ఇవ్వాలి. విద్యార్థులు తొలుత తేలికైన టాపిక్స్‌ను చదవడం దిగ్విజయంగా పూర్తిచేస్తే తర్వాత కష్టమైన అంశాలను పూర్తిచేసేందుకు తగిన ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది.
మ్యాథమెటిక్స్
మ్యాథ్స్ 2-ఏ పేపర్‌కు 75 మార్కులు కేటాయించారు. ప్రశ్నపత్రంలో ఏడు దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఐదింటికి సమాధానాలు రాయాలి. ఏడు స్వల్ప సమాధాన ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఐదింటికి సమాధానాలు రాయాలి. అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు పది ఇస్తారు. అన్నింటికీ సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మ్యాథ్‌స 2-బీ పేపర్ కూడా ఇలాగే ఉంటుంది.
మ్యాథ్స్‌లో ఎక్కువ దృష్టిపెట్టాల్సిన అంశాలు:
2-ఏ: రేండమ్ వేరియబుల్స్; ద్విపద సిద్ధాంతం; సిద్ధాంత సమీకరణాలు; సంకీర్ణ సంఖ్యలు. 2-బీ: వృత్తాలు, పరావలయం, కలన గణితం, అవకలన సమీకరణాలు.
సెకండియర్:సంకీర్ణ సంఖ్యలు-8 గంటలు; అవకలన సమీ కరణాలు- 8 గంటలు; సంభావ్యత- 9 గంటలు; ప్రస్తారాలు, సంయోగాలు- 6 గంటలు; వృత్తాలు- 10 గంటలు.
ఫస్టియర్: మాత్రికలు- 8 గంటలు; త్రికోణమితి సమీకరణాలు, విలోమ త్రికోణమితి ప్రమేయాలు- 5 గంటలు; 3డీ రేఖలు- 4 గంటలు; ప్రమేయాలు- 8 గంటలు.
ఇంటర్ సెకండియర్ ఫిజిక్స్ పేపర్‌కు 60 మార్కులు కేటాయించారు. ప్రశ్నపత్రంలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఇస్తారు. విద్యార్థులు రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 8 స్వల్ప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఆరింటికి సమాధానాలు రాయాలి. 10 అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. అన్నింటికీ సమాధానాలు రాయాలి.
కెమిస్ట్రీ
సెకండియర్ కెమిస్ట్రీకి 60 మార్కులు కేటాయించారు. ప్రశ్నపత్రంలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 8 స్వల్ప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఆరింటికి సమాధానాలు రాయాలి. 10 అతి స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. విద్యార్థులు అన్నింటికీ సమాధానాలు రాయాలి.
గెలుపు సూత్రాలు

- ఇంటర్ సెకండియర్ విద్యార్థులు జనవరి మొదటి వారం వరకు ఫస్టియర్, సెకండియర్ సిలబస్‌ను ఆబ్జెక్టివ్, కాన్సెప్ట్‌ల ఆధారంగా చదవాలి. ఆ తర్వాత ప్రాక్టికల్స్, థియరీ పరీక్షలకు సిద్ధంకావాలి.
సెకండియర్:సంకీర్ణ సంఖ్యలు-8 గంటలు; అవకలన సమీ కరణాలు- 8 గంటలు; సంభావ్యత- 9 గంటలు; ప్రస్తారాలు, సంయోగాలు- 6 గంటలు; వృత్తాలు- 10 గంటలు.
ఫస్టియర్: మాత్రికలు- 8 గంటలు; త్రికోణమితి సమీకరణాలు, విలోమ త్రికోణమితి ప్రమేయాలు- 5 గంటలు; 3డీ రేఖలు- 4 గంటలు; ప్రమేయాలు- 8 గంటలు.
- మ్యాథ్స్ 2-ఏలో బీజగణితం, సంభావ్యత అనే రెండు భాగాలుంటాయి. బీజగణితంలో సమీకరణ వాదం; ప్రస్తారాలు, సంయోగాలు, ద్విపద సిద్ధాంతం అతి ముఖ్యమైనవి. వర్గ సమీకరణాలు, పాక్షిక భిన్నాలు తేలికైనవి. సంభావ్యత సిద్ధాంతపరమైనది, క్లిష్టమైనది.
- మ్యాథ్స్ 2-బీలో నిరూపక జ్యామితి, కలన గణితం రెండు విభాగాలూ ముఖ్యమైనవి. సిద్ధాంతాల పరంగా నిరూపక జ్యామితి ప్రధానమైనది అయితే కలన గణితం సూత్రాలు, వాటి అనువర్తనాల పరంగా ముఖ్యమైనది.
ఇంటర్ సెకండియర్ ఫిజిక్స్ పేపర్‌కు 60 మార్కులు కేటాయించారు. ప్రశ్నపత్రంలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలు ఇస్తారు. విద్యార్థులు రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 8 స్వల్ప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఆరింటికి సమాధానాలు రాయాలి. 10 అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. అన్నింటికీ సమాధానాలు రాయాలి.
- సెకండియర్ విద్యార్థులు ఫిజిక్స్‌లోని ఎలక్ట్రో స్టాటిక్, వేవ్ మోషన్, ఆప్టిక్స్‌లను కష్టమైనవిగా భావిస్తారు. డాప్లర్ ఎఫెక్ట్ చాలా ముఖ్యమైనది. విద్యార్థులు స్థిర, అనుదైర్ఘ్య తరంగాల ధర్మాలు, వాటి భేదాలను నేర్చుకోవాలి.
- మారిన సిలబస్ ప్రకారం ప్రతి చాప్టర్‌లోనూ విశ్లేషణాత్మక ప్రశ్నలు, సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి విద్యార్థులు తెలుగు అకాడమీ ఫిజిక్స్ పుస్తకాన్ని క్షుణ్నంగా చదవాలి. ప్రతి చాప్టర్‌కు వెనకున్న ప్రశ్నలన్నింటినీ సాధించాలి.
- వేవ్ మోషన్, సెమీ కండక్టర్ డివెసైస్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఎలక్ట్రో మాగ్నటిక్స్ నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
వేవ్ మోషన్ | 4 గంటలు |
కరెంట్ ఎలక్ట్రిసిటీ | 6 గంటలు |
న్యూక్లియర్ ఫిజిక్స్ | 3 గంటలు |
ఎలక్ట్రో మాగ్నటిక్ | 4 గంటలు |
రే ఆప్టిక్స్ | 4 గంటలు |
సెమీ కండక్టర్ డివెసైస్ | 6 గంటలు |
కెమిస్ట్రీ
సెకండియర్ కెమిస్ట్రీకి 60 మార్కులు కేటాయించారు. ప్రశ్నపత్రంలో మూడు దీర్ఘ సమాధాన ప్రశ్నలుంటాయి. వీటిలో రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. 8 స్వల్ప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఆరింటికి సమాధానాలు రాయాలి. 10 అతి స్వల్ప సమాధాన ప్రశ్నలుంటాయి. విద్యార్థులు అన్నింటికీ సమాధానాలు రాయాలి.
- విద్యార్థులు సెకండియర్ కెమిస్ట్రీ సిలబస్‌లోని సాలిడ్ స్టేట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కాంప్లెక్స్ కాంపౌండ్స్‌లను కష్టమైనవిగా భావిస్తారు. కొత్త సిలబస్ ప్రకారం ఆర్గానిక్‌లో చాలా రీజనింగ్ ప్రశ్నలున్నాయి. వాటిని చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి.
- ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ.. ఈ మూడింటిలో మూడు వ్యాసరూప ప్రశ్నలు వస్తాయి. వీటిలో అధిక ప్రాధాన్యం గల చాప్టర్లు.. ఆల్కహాల్స్, అమైన్స్, సాలిడ్ స్టేట్, కార్బొనిల్ కాంపౌండ్‌స, ఎలక్ట్రో కెమిస్ట్రీ, డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్, కాంప్లెక్స్ కాంపౌండ్స్.
- కెమిస్ట్రీలో ఏదైనా చాప్టర్ చదివేటప్పుడు తెలుగు అకాడమీ బుక్‌లోని ప్రతి ముఖ్యమైన పాయింట్‌ను అండర్‌లైన్ చేసుకోవాలి. వాటిని దశలవారీగా రివిజన్ చేయాలి. దీనివల్ల విద్యార్థులు లఘు సమాధాన ప్రశ్నలన్నింటికీ తేలిగ్గా సమాధానాలు రాయగలుగుతారు.
సాలిడ్ స్టేట్ | 6 గంటలు |
సొల్యూషన్స్ | 4 గంటలు |
ఎలక్ట్రో కెమిస్ట్రీ | 4 గంటలు |
సర్ఫేస్ కెమిస్ట్రీ | 3 గంటలు |
మెటలర్జీ | 8 గంటలు |
పి-బ్లాక్ ఎలిమెంట్స్ | 8 గంటలు |
డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ | 8 గంటలు |
కోఆర్డినేట్ కాంపౌండ్స్ | 4 గంటలు |
పాలిమర్స్ | 4 గంటలు |
బయో మాలిక్యూల్స్ | 3 గంటలు |
ఆర్గానిక్ కాంపౌండ్స్ | 12 గంటలు |
గెలుపు సూత్రాలు
- పబ్లిక్ పరీక్షల కోణంలో అతి ముఖ్యమైన చాప్టర్లను, కాన్సెప్ట్‌లను గుర్తించి వాటికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
- ప్రతి ప్రధాన కాన్సెప్ట్‌ను చదవడంతోపాటు సంబంధిత కాన్సెప్ట్‌నకు సంబంధించిన లెక్చర్ నోట్స్‌ను, మెటీరియల్‌ను బాగా అధ్యయనం చేయాలి.
- ప్రతి కాన్సెప్ట్‌ను నిర్వచించడం-విశ్లేషించడం-అనువర్తించడం విధానంలో చదవాలి.
- ఏ అంశాన్ని చదువుతున్నా సమయ పాలన, కచ్చితత్వం ప్రధానం. వీటిని తప్పకుండా పాటించాలి.
- ప్రతి సబ్జెక్టుకు ఒక నిర్దిష్ట ప్రణాళికను రూపొందించుకోవాలి. దానికి తగినట్లు ఏ రోజు చదవాల్సిన అంశాలను ఆ రోజే పూర్తిచేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకూడదు. ఇలా చేయకుంటే ఒత్తిడి పెరుగుతుంది.
- ప్రతి చాప్టర్‌కు సంబంధించిన ముఖ్యమైన సినాప్సిస్‌ను నోట్ బుక్‌లో రాసుకొని బాగా చదవాలి.
- ప్రతి పాఠంలో ఉన్న సమస్యల్ని సంబంధిత సూత్రాల సహాయంతో పరిష్కరించాలి.
- విద్యార్థులు తప్పనిసరిగా మొదటి నుంచి దీర్ఘ సమాధాన, స్వల్ప సమాధాన, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలతోపాటు బహుళైచ్ఛిక ప్రశ్నలపైనా దృష్టిసారించాలి.
- ఎంసెట్, జేఈఈకి సిద్ధమవుతున్నవారు తొలుత సబ్జెక్టు బేసిక్స్‌ను తర్వాత కాన్సెప్ట్‌లపై పట్టు సాధించాలి. చివర్లో అప్లికేషన్స్‌పై దృష్టిసారించాలి.
- పాఠ్య పుస్తకాలను చదువుతున్నప్పుడు ముఖ్యమైన అంశాలను అండర్‌లైన్ చేయాలి. ఇలాచేస్తే చివర్లో క్విక్ రివిజన్‌కు ఉపయోగపడుతుంది.
- అతి విశ్వాసం అనర్ధదాయకం. ‘సిలబస్ అంతా చదివాం.. అంతా వచ్చినట్లే’ అనే భావన వీడాలి. వీలైనన్ని ఎక్కువసార్లు పునశ్చరణ చేయాలి.
Published date : 05 Sep 2013 05:00PM