ఐపీఈ, మెడిసిన్ ప్రవేశ పరీక్షల ప్రిపరేషన్
జువాలజీ
- ఎంసెట్ ర్యాంకింగ్‌లో ఇంటర్మీడియెట్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఉంది. ప్రస్తుతమున్న తీవ్ర పోటీ వాతావరణంలో ఒక మార్కు కూడా చాలా ముఖ్యమైంది. కాబట్టి విద్యార్థులు పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ కొనసాగించాలి.
- ద్వితీయ సంవత్సరం జంతుశాస్త్రం సిలబస్‌లో 8 యూనిట్లు ఉన్నాయి. జువాలజీ ప్రశ్నపత్రం 60 మార్కులకు ఉంటుంది. అతిస్వల్ప సమాధాన ప్రశ్నలకు 20 మార్కులు, స్వల్ప సమాధాన ప్రశ్నలకు 24 మార్కులు, దీర్ఘసమాధాన ప్రశ్నలకు 16 మార్కులు ఉంటాయి.
పాఠ్యాంశాలు- వెయిటేజీ
యూనిట్ | వెయిటేజీ |
1 | 10 మార్కులు (2+4+4) |
2 | 10 మార్కులు (2+8) |
3 | 8 మార్కులు (2+2+4) |
4 | 8 మార్కులు (2+2+4) |
5 | 12 మార్కులు (2+2+8) |
6 | 12 మార్కులు (4+8) |
7 | 8 మార్కులు (4+4) |
8 | 8 మార్కులు (2+2+4) |
- మొత్తం 8 యూనిట్లలో మానవ శరీర నిర్మాణ శాస్త్రం, శరీరధర్మ శాస్త్రం, ప్రత్యుత్పత్తికి సంబంధించిన అంశాల నుంచి 48 మార్కులకు ప్రశ్నలు వస్తున్నాయి.
- పటాలతో పాటు సమాధానాలు రాయాల్సి ఉంటుంది కాబట్టి, చక్కని పటాలు గీయటాన్ని ప్రాక్టీస్ చేయాలి.
ముఖ్యమైన దీర్ఘసమాధాన ప్రశ్నలు (8 మార్కులు)
- మానవుని గుండె నిర్మాణం
- మానవుని గుండె- పనిచేసే విధానం
- మానవ విసర్జన వ్యవస్థ- వృక్క ప్రమాణం నిర్మాణం
- మూత్రం ఏర్పడే విధానం
- కండర సంకోచ అంశాలు
- మానవుడి మెదడు నిర్మాణం- విధులు
- స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ
- పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ
- బహుళ యుగ్మ వికల్పాలు (A, B, O గ్రూపులు)
- లింగ నిర్ధరణ- క్రోమోజోమ్ సిద్ధాంతం
- క్రిస్‌క్రాస్ అనువంశికత
స్వల్ప సమాధాన ప్రశ్నలు:
- ఏవియన్ ఫ్లూ
- ఈసీజీ
- ఈఈజీ
- వివిధ రకాల కేన్సర్‌లు
- వాక్సిన్లు
- తేనెటీగల పెంపకం
- నిర్మాణ సామ్య, క్రియా సామ్య అవయవాలు
- ఉత్పరివర్తన సిద్ధాంతం
- డార్విన్ ప్రకృతి వరణ సిద్ధాంతం
- జీవ పరిణామంలో వివిధ వరణాలు
- డ్రోసోఫిలా లింగ నిర్ధారణలో జన్యుతుల్యన సిద్ధాంతం
- ఎరిత్రోబ్లాస్టాసిస్
- ఫీటాలిస్
- ఇమ్యునోగ్లోబ్యులిన్స్
- హెచ్‌ఐవీ-ఎయిడ్స్
- పిట్యుటరీ, థైరాయిడ్, మరుగుజ్జులు
- మానవ వెన్నుపాము అడ్డుకోత పటం
- రెటీనా, సహానుభూత, సహ సహానుభూత నాడీవ్యవస్థలు
- శ్రోణి మేఖల పటం
- సైనోవియల్ కీలు
- జీర్ణాశయంలో మాంసకృత్తుల జీర్ణక్రియ
- దంతం నిలువుకోత పటం
సూచనలు:
- ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఇంకా ఆర్నెల్ల సమయం అందుబాటులో ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి సమయపాలన పాటిస్తూ ప్రిపరేషన్ కొనసాగించాలి.
- తెలుగు అకాడమీ పుస్తకంలో ప్రతి అధ్యాయం చివర ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలను ప్రాక్టీస్ చేయాలి.
- విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు కూడా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన ప్రిపరేషన్, రికార్డులను సరైన సమయంలో పూర్తిచేయాలి.
- చాలా సమాధానాలు పటాలతో పాటు ఉంటాయి కాబట్టి భాగాలతో కూడిన పటాలను ప్రాక్టీస్ చేయాలి.
- అధ్యాపకుల నుంచి సరైన సూచనలు తీసుకుంటూ తగిన ప్రణాళికతో సన్నద్ధమైతే 60కి 60 మార్కులు సాధించడం కష్టమేమీకాదు.
ఎంసెట్
- ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడే ప్రతి అధ్యాయం నుంచి ఎంసెట్ పరంగా ఎలాంటి పాయింట్లు ముఖ్యమైనవో గుర్తించాలి. వాటిని ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలి. వారంలో కనీసం రెండుసార్లు వాటిని పునశ్చరణ చేయాలి.
- వివిధ అంశాలపై లభించే అసైన్‌మెంట్లను ప్రాక్టీస్ చేయాలి.
- గత ప్రశ్నపత్రాలను సేకరించి, ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయనే దానిపై అవగాహన పెంపొందించుకోవాలి. వాటి సమాధానాలను ప్రాక్టీస్ చేయాలి.
2015 ఎంసెట్ వెయిటేజీ (ద్వితీయ సంవత్సరం)
యూనిట్ | ప్రశ్నలు |
యూనిట్ 1 | 2 |
యూనిట్ 2 | 2 |
యూనిట్ 3 | 2 |
యూనిట్ 4 | 3 |
యూనిట్ 5 | 3 |
యూనిట్ 6 | 3 |
యూనిట్ 7 | 2 |
యూనిట్ 8 | 3 |
మొత్తం | 20 |
బోటనీ
మెడిసిన్ ప్రవేశపరీక్షల్లో మంచి ర్యాంకు సాధించిన వారికి ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో 90 శాతానికి తక్కువ కాకుండా మార్కులు వచ్చాయి. ఈ విషయాన్ని ప్రస్తుతం సెకండియర్ చదువుతున్న విద్యార్థులు దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ సాగించాలి.
ఐపీఈ వెయిటేజీ:
యూనిట్ | మార్కులు |
1. వృక్ష శరీరధర్మ శాస్త్రం | 28 |
2. సూక్ష్మజీవ శాస్త్రం | 6 |
3. జన్యుశాస్త్రం | 6 |
4. అణుజీవ శాస్త్రం | 8 |
5. జీవసాంకేతిక శాస్త్రం | 16 |
6. మానవ సంక్షేమంలో మొక్కలు, సూక్ష్మజీవులు | 12 |
- దీర్ఘ సమాధాన ప్రశ్నలు సాధారణంగా 1, 5, 6 యూనిట్ల నుంచి వచ్చేందుకు అవకాశముంది.
ప్రిపరేషన్ వ్యూహాలు:
- ముఖ్యమైన పటాలను గీచి, భాగాలను గుర్తించటాన్ని ప్రాక్టీస్ చేయాలి.
- శరీరధర్మ శాస్త్రంలోని క్రెబ్స్, కెల్విన్ వలయాలు పూర్తిగా ఉండాలి. ప్రతి చర్యను విశదీకరించాలి.
- మొదటి యూనిట్‌కు మొత్తం మార్కుల్లో దాదాపు సగం వెయిటేజీ ఇచ్చిన కారణంగా.. ఈ యూనిట్‌పై అధికంగా దృష్టి సారించాలి.
- సమాధానాలు రాసేటప్పుడు, ప్రతి సమాధానానికి సబ్-హెడ్డింగ్, అవసరమైన చోట ఫ్లో చార్ట్ వేయడంవంటి అంశాలకు ప్రాధాన్యతనివ్వాలి. వీటికోసం ప్రత్యేకంగా కొన్ని మార్కులు కేటాయిస్తారు.
ఎంసెట్ ప్రణాళిక:
- సిలబస్‌లోని ప్రతి అంశాన్నీ క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. సిలబస్ జనవరి చివరి నాటికి పూర్తయ్యేలా చూడాలి. డిసెంబర్, జనవరి నెలల్లో ప్రాక్టికల్స్ కారణంగా రెగ్యులర్ విద్యార్థులకు కొంత ఇబ్బంది ఎదురవుతుంది. ప్రిపరేషన్‌లో జాప్యం జరుగుతుంది. అందువల్ల ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్ కొనసాగించాలి.
- ఐపీఈకి సమాంతరంగా ఆబ్జెక్టివ్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యమైన అంశాలను ప్రత్యేకంగా పొందుపరచుకొని, వీలైనప్పుడు పునశ్చరణ చేయాలి.
2015 ఎంసెట్ వెయిటేజీ (ద్వితీయ సంవత్సరం):
యూనిట్ | ప్రశ్నలు |
యూనిట్-1 | 9 |
యూనిట్-2 | 1 |
యూనిట్-3 | 2 |
యూనిట్-4 | 4 |
యూనిట్-5 | 1 |
యూనిట్-6 | 3 |
- మొదటి, రెండో సంవత్సరం పాఠ్యాంశాల్లో సారూప్యం ఉన్నవాటిని కలిపి చదవాలి.
ఫిజిక్స్
ఇంటర్మీడియెట్ సెకండియర్ ఐపీఈ ఫిజిక్స్ ప్రశ్నపత్రం 60 మార్కులకు ఉంటుంది. పబ్లిక్ పరీక్షల కోణంలో చూస్తే ఎలక్ట్రో స్టాటిస్టిక్స్, వేవ్ మోషన్, ఆప్టిక్స్ చాప్టర్లు కష్టమైనవిగా భావిస్తారు. అయితే ఇవి చాలా ముఖ్యమైనవి. ప్రతి చాప్టర్‌లోనూ విశ్లేషణాత్మక ప్రశ్నలు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తెలుగు అకాడెమీ పుస్తకాల్లోని అంశాలను క్షుణ్నంగా చదవాలి. ప్రతి చాప్టర్ వెనుక ఉన్న ప్రశ్నలన్నింటినీ సాధించాలి. వేవ్ మోషన్,సెమీ కండక్టర్ డివెసైస్, న్యూక్లియర్ ఫిజిక్స్, ఎలక్ట్రో మ్యాగ్నటిజం చాప్టర్ల నుంచి దీర్ఘ సమాధాన ప్రశ్నలు వచ్చేందుకు అవకాశముంది.
ఎంసెట్
సూత్రాలను అర్థం చేసుకొని, వాటికి సంబంధించిన సమస్యలను బాగా ప్రాక్టీస్ చేయాలి. మూల సూత్రాలను పట్టిక రూపంలో రాసుకొని, వీలైనన్ని సార్లు పునశ్చరణ చేయాలి. మొదటి సంవత్సరం సిలబస్‌లోని ఎనర్జీ, ద్రవ్యవేగ, కోణీయ వేగ నిత్యత్వ సూత్రాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
- ఉష్ణగతిక శాస్త్రంలో ఇంటర్నల్ ఎనర్జీ ఫార్ములా, సరళహరాత్మక చలనంలోని డోలనం, డోలనావర్తనకాలం.. వాటి అనువర్తనాలను అధ్యయనం చేయాలి. సీనియర్ ఇంటర్ సిలబస్‌లోని కిర్కాఫ్స్ లాస్, ఫ్లెమింగ్ రైట్, లెఫ్ట్ హ్యాండ్ సూత్రాలు; ఎంసీజీ, ప్రవాహ విద్యుత్ శాస్త్రంలోని ప్రాథమిక ఫార్ములాలు నేర్చుకోవాలి.
గత ఎంసెట్ ప్రశ్నపత్రాల ఆధారంగా ఎంసెట్ ప్రశ్నల వెయిటేజీ (ద్వితీయ సంవత్సరం):
- వేవ్ మోషన్-2 ప్రశ్నలు; రే ఆప్టిక్స్, ఫిజికల్ ఆప్టిక్స్- 3; మ్యాగ్నటిజం-2; ఎలక్ట్రో స్టాటిస్టిక్స్- 2; కరెంట్ ఎలక్ట్రిసిటీ-2; ఎలక్ట్రో మ్యాగ్నటిజం-2; సెమీ కండక్టర్స్, న్లూక్లియర్ ఫిజిక్స్-2; కమ్యూనికేషన్ సిస్టమ్స్- 1 ప్రశ్న.
కెమిస్ట్రీ
- పబ్లిక్ పరీక్షల్లో ఫిజిక్స్ తరహాలోనే కెమిస్ట్రీకి 60 మార్కులు, ఎంసెట్‌లో 40 మార్కులుంటాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీలోని ఈక్వేషన్స్‌ను ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి. ఇంటర్మీడియెట్ కోణంలో చూస్తే సాలిడ్ స్టేట్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంశాలు క్లిష్టమైనవిగా భావిస్తారు. అయితే ఇవి చాలా ముఖ్యమైనవి.
- ఫిజికల్ కెమిస్ట్రీలోని ప్రాబ్లమ్ సాల్వింగ్‌లో తప్ప, మిగిలిన కెమిస్ట్రీ చాప్టర్లలో ఇంటర్మీడియెట్ ప్రిపరేషన్‌కు, ఎంసెట్ ప్రిపరేషన్‌కు పెద్దగా తేడా ఉండదు. కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, పీరియాడిక్ టేబుల్ అంశాలపై ఎక్కువ దృష్టిసారించాలి.
- ఆర్గానిక్ కెమిస్ట్రీలోని అన్ని కెమికల్ సమ్మేళనాల ధర్మాలు, తయారీ పద్ధతులు నేర్చుకోవాలి. ఆల్కహాల్స్, ఫినాల్స్, అమైన్స్‌లోని నేమ్డ్ రియాక్షన్స్, ఆర్డర్ ఆఫ్ యాసిడ్స్, బేసిక్ స్ట్రెంథ్ అంశాలను బాగా గుర్తుంచుకోవాలి.
ఎంసెట్ వెయిటేజీ అంచనా:
రెండో ఏడాది: సొల్యూషన్స్ (2), సాలిడ్ స్టేట్ (1), ఎలక్ట్రో కెమిస్ట్రీ (2), మెటలర్జీ (1), గ్రూప్ 15 ఎలిమెంట్స్ (1), గ్రూప్ 16 ఎలిమెంట్స్ (1), గ్రూప్ 17 ఎలిమెంట్స్ (1), డి-బ్లాక్ ఎలిమెంట్స్ (1), నోబుల్ గ్యాసెస్ (1), పాలిమర్స్ (1), కెమిస్ట్రీ ఇన్ ఎవిర్‌డే లైఫ్ (1), ఆర్గానిక్ కాంపౌండ్స్ (4), సర్ఫేస్ కెమిస్ట్రీ (1).
ఇన్‌పుట్స్
బి.రాజేంద్ర, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్
కె.శ్రీనివాసులు, శ్రీ చైతన్య విద్యాసంస్థలు