Chemistry Material on Use of Medicines: గ్రూప్ 1&2 పరీక్షలకు ప్రత్యేకం.. మోతాదుకు మించితే విషతుల్యం!
ఔషధాలు (డ్రగ్స్)
మానవులు, జంతువుల్లో జీవక్రియలను ప్రభావితం చేసి, వ్యాధులను నయం చేయడానికి ఉపయోగించే రసాయన కారకాలనే ఔషధాలు అంటారు.సాధారణ పరిభాషలో వీటిని మందులుగానూ వ్యవహరిస్తారు. వ్యాధులను గుర్తించడానికి, నయం చేయడానికే కాకుండా నిరోధించడానికి ఉపయోగించేవాటిని కూడా ఔషధాలుగా పేర్కొంటారు. వ్యాధులు లేదా రోగాల చికిత్సకు రసాయన పదార్థాలను ఉపయోగించే ప్రక్రియను ‘కెమోథెరపీ (Chemothe rapy)’ అంటారు.
జీవిలోకి ప్రవేశించిన ఔషధాలు జీవాణువులైన కార్బోహైడ్రేట్లు, లిపిడ్‌లు, ప్రోటీన్లు, న్యూక్లియిక్ ఆమ్లాల లాంటి వాటితో చర్య జరుపుతాయి. ఈ జీవాణువులనే లక్ష్య అణువులు (Target Molecules) అంటారు. ఔషధాలు వరణాత్మకంగా (Selective).. అంటే కేవలం ఆశించిన లక్ష్య అణువులతో మాత్రమే చర్యలో పాల్గొంటాయి. ఇతర లక్ష్య అణువులను ప్రభావితం చేయవు. ఇవి ఆశించిన ప్రదేశంలోనే పనిచేస్తాయి.
Wipro Cuts Offer Letters To Freshers: ఉద్యోగులకు షాక్ ఇచ్చిన విప్రో.. ఆ నియామకాలన్నీ రద్దు
వివిధ రకాల ఔషధాలు
బాధా నివారిణులు (Analgesics): ఏ విధమైన ఇతర రకాల నరాల వ్యవస్థకు సంబంధించిన రుగ్మతలను కలిగించకుండా నొప్పిని లేదా బాధను మాత్రమే తగ్గించే ఔషధాలను ఎనాల్జెసిక్‌లు అంటారు. ఇవి రెండు రకాలు.
అవి:
1. నాన్–నార్కోటిక్ ఎనాల్జెసిక్‌లు: దురలవాట్లకు (Addiction) లోను చేయని ఎనాల్జెసిక్‌లు. వీటినే నాన్–నార్కోటిక్ ఎనాల్జెసిక్‌లు అంటారు.
ఉదా: ఐబూప్రోఫెన్, ఆస్పిరిన్, పారాసెటమాల్.
n ఎనాల్జెసిక్‌లకు జ్వర తీవ్రతను తగ్గించే గుణం ఉండటం వల్ల యాంటీ పైరెటిక్‌లుగా కూడా పనిచేస్తాయి.
n ఆస్పిరిన్ (ఎసిటైల్ సాలిసిలికామ్లం) ప్రోస్టాగ్లాండిన్‌లు (కణజాలాల్లో వచ్చే మంటలు, తద్వారా వచ్చే నొప్పులకు కారణమైనవి) అనే రసాయన పదార్థాల ఉత్పత్తి వేగాన్ని తగ్గించి బాధా నివారిణిగా పనిచేస్తుంది. దీనికి రక్తాన్ని పలచన చేసే గుణం (Blood thinner) కూడా ఉంది. అందువల్ల ఆస్పిరిన్ రక్తం గడ్డకట్టకుండా చూసి, గుండెపోటు నివారణకు దోహదపడుతుంది.
2. నార్కోటిక్ ఎనాల్జెసిక్‌లు: ఓపియమ్ సాపీ (నల్లమందు) నుంచి గ్రహించే మార్ఫీన్ రకానికి చెందిన రసాయనాలు దురలవాట్లకు గురి చేసేవి (Addictive)గా ఉంటాయి. సాధారణంగా వీటిని శస్త్ర చికిత్సల అనంతరం కలిగే బాధలు, గుండెకు సంబంధించిన నొప్పి, కేన్సర్‌తో అవసాన దశలో ఉండే రోగికి కలిగే బాధలు, ప్రసవ సమయంలో నొప్పిని తగ్గించడానికి ఉపయోగిస్తారు. వీటిని ఔషధ మోతాదులో సేవిస్తే బాధను తగ్గించి, నిద్రను ప్రోత్సహిస్తాయి. అధిక మొత్తంలో సేవిస్తే మైకం, అపస్మారక స్థితి, మూర్ఛకు దారితీసి చివరికి మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంటుంది.
Ph D Admissions : జేఎన్‌టీయూఏలో పీహెచ్‌డీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు.. అర్హులు వీరే!
యాంటీ బయాటిక్‌లు: సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించేవి లేదా వాటిని నాశనం చేసే వాటిని యాంటీబయాటిక్‌లు అంటారు.
ఎరిత్రోమైసిన్, టెట్రాసైక్లిన్, క్లోరాంఫెనికాల్ లాంటివి సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధిస్తాయి. పెన్సిలిన్, ఆఫ్లోక్సాసిన్ మొదలైనవి సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి.
ఆమ్ల విరోధులు (Antacids): హైడ్రోక్లోరికామ్లం ఉదరంలో ఆహారం జీర్ణమవడానికి తోడ్పడుతుంది. ఒక వేళ జీర్ణకోశంలో ఈ ఆమ్లం అధికంగా ఉత్పత్తి చెందితే అది ప్రకోపానికి (Irritation) లేదా నొప్పికి దారితీస్తుంది. ఇంకా తీవ్రస్థాయిలో జరిగితే జీర్ణకోశంలో పుండ్లు (అల్సర్లు) ఏర్పడతాయి. రానిటిడిన్, ఒమిప్రజోల్, పెంటాప్రజోల్ లాంటివి ఈ ఆమ్ల ఉత్పత్తిని నియంత్రిస్తాయి. ఉత్పత్తి అయిన ఆమ్లాన్ని తటస్థీకరించేవి – సోడియం బై కార్బోనేట్ (బేకింగ్ సోడా), మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్ మొదలైనవి.
యాంటీ సెప్టిక్‌లు (చీము నిరోధులు): గాయాలు, కోతలు, అల్సర్‌లు అయినప్పుడు జీవ కణాలకు పూతగా పూసే పదార్థాలే యాంటీ సెప్టిక్‌లు. యాంటీ బయాటిక్‌ల మాదిరిగా వీటిని నోటితో మింగకూడదు.
ఉదా: అయోడిన్ టింక్చర్, స్పిరిట్ (ఇథైల్ ఆల్కహాల్), ఫినాల్ ద్రావణం, డెట్టాల్ (క్లోరోకై్జలినాల్, టెర్పినియోల్‌ల మిశ్రమం), బిథియోనాల్, క్లోరిన్ జలద్రావణం, అయొడోఫాం.
GATE 2025 Notification : ఎంటెక్ ప్రవేశాలకు గేట్ 2025 నోటిఫికేషన్ విడుదల..
మాదిరి ప్రశ్నలు:
1. కిందివాటిలో నాడీ సంబంధమైన వ్యాధికానిది?
1) స్పృహ కోల్పోవడం
2) మానసిక ఆందోళన
3) పక్షవాతం
4) జీర్ణకోశంలో పుండ్లు (అల్సర్లు)
2. జీర్ణకోశంలో పెప్సిన్, హైడ్రోక్లోరికామ్లాల ఉత్పత్తిని ప్రేరేపించే రసాయనం?
1) హిస్టమీన్ 2) రెనిటిడీన్
3) ఎడ్రినలిన్ 4) మార్ఫీన్
3. అధిక ఆమ్ల వ్యాధి (Acidity) చికిత్సకు ఉపయోగించే ఔషధం?
1) సిమెటిడిన్ 2) రెనిటిడిన్
3) ఓమిప్రజోల్ 4) పైవన్నీ
4. కిందివాటిలో ఆమ్ల విరోధిగా పనిచేసేది ఏది?
1) సోడియం బైకార్బోనేట్
2) అల్యూమినియం హైడ్రాక్సైడ్
3) మెగ్నీషియం హైడ్రాక్సైడ్
4) పైవన్నీ
5. చిన్న పిల్లలకు ఆమ్ల విరోధిగా ఉపయోగించే మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అనేది?
1) మెగ్నీషియం హైడ్రాక్సైడ్
2) అల్యూమినియం హైడ్రాక్సైడ్
3) రానిటిడీన్
4) ఓమీప్రజోల్
6. కిందివాటిలో యాంటీ హిస్టమీన్ ఏది?
1) వేలియం 2) పారాసిటమాల్
3) బ్రోమ్‌ఫెనిరమీన్ 4) ఆస్పిరిన్
7. నిద్ర తెప్పించే (హిప్నాటిక్) ఔషధం?
1) సెరటోనిన్ 2) వేలియం
3) క్లోరోడయజీపాక్సైడ్ 4) పైవన్నీ
8. కిందివాటిలో నార్కోటిక్ నొప్పి నివారిణి ఏది?
1) మార్ఫీన్ 2) ఆస్పిరిన్
3) పారాసెటమాల్ 4) పైవన్నీ
9. కిందివాటిలో ఎనాల్జెసిక్ ఏది?
1) పారాసెటమాల్ 2) ఆస్పిరిన్
3) ఐబూప్రోఫెన్ 4) పైవన్నీ
10. రక్తాన్ని పలచన చేసే గుణం ఉన్న ఔషధం (Blood thinner) ఏది?
1) పారాసెటమాల్ 2) ఆస్పిరిన్
3) మార్ఫీన్ 4) కొడీన్
Contract Jobs at IIST : ఐఐఎస్‌టీలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తులకు చివరి తేదీ!
11. కెమోథెరపీ అంటే?
1) కీళ్లు వాచేలా కొట్టడం
2) ఔషధాలను ఉపయోగించి వ్యాధులు నయం చేయడం
3) ఫిజియోథెరపీ
4) యోగా ద్వారా వ్యాధులు నయం చేయడం
12. ఎసిటైల్ సాలిసిలికామ్లం అని దేన్నంటారు?
1) ఆస్పిరిన్ 2) పారాసెటమాల్
3) క్లోరోక్విన్ 4) పెన్సిలిన్
13. సింకోనా చెట్టు బెరడు నుంచి సంగ్రహించే ఔషధం?
1) క్వినైన్ 2) మార్ఫీన్
3) నికోటిన్ 4) కెఫీన్
14. కిందివాటిలో సరైన వాక్యం ఏది?
1) పారాసెటమాల్ అధిక మోతాదులో వాడితే కాలేయం దెబ్బతింటుంది
2) ఆస్పిరిన్ అధికంగా వాడితే అల్సర్‌లు ఏర్పడతాయి
3) మిథైల్ సాలిసిలేట్ మూత్రవర్ధకంగా పనిచేస్తుంది
4) పైవన్నీ సరైనవే
15. కిందివాటిలో బాధా నివారిణిగా పనిచేస్తూ జ్వరాన్ని తగ్గించే గుణం ఉన్న ఔషధం కానిది?
1) పారాసెటమాల్ 2) ఆస్పిరిన్
3) కెఫీన్ 4) మార్ఫీన్
16. ఎలర్జీని తగ్గించే గుణం ఉన్న ఔషధాలను ఏమంటారు?
1) ఎనాల్జెసిక్‌లు
2) ట్రాంక్విలైజర్‌లు
3) యాంటీ హిస్టమీన్‌లు
4) యాంటీ బయాటిక్‌లు
17. హెరాయిన్ అనే మత్తుమందును దేన్ని ఎసిటైలేషన్ చేసి రూపోందిస్తారు?
1) మార్ఫీన్ 2) కెఫీన్
3) నికోటిన్ 4) సాలిసిలికామ్లం
18. కిందివాటిలో ఆల్కలాయిడ్ కుటుంబానికి చెందని డ్రగ్ ఏది?
1) మార్ఫీన్ 2) ఆస్పిరిన్
3) నికోటిన్ 4) కెఫీన్
19. కిందివాటిలో సరికాని జత?
1) టీ – కెఫీన్
2) నొగాకు – నికోటిన్
3) సింకోనా – క్వినైన్
4) పెన్సిలియం బూజు – క్లోరాంఫెనికాల్
20. కిందివాటిలో సరికాని జత?
1) పెన్సిలిన్ : యాంటీ బయాటిక్
2) డెట్టాల్: యాంటీ సెప్టిక్
3) వేలియం: ట్రాంక్విలైజర్
4) క్లోరోక్విన్: ఎనాల్జెసిక్
Jobs at IIIT Delhi : ఢిల్లీ ట్రిపుల్ఐటీలో వివిధ ఉద్యోగాలు.. పోస్టులు ఇవే..
21. క్షయ వ్యాధి నివారణకు ఉపయోగించే ఔషధం?
1) టెట్రాసైక్లిన్ 2) పెన్సిలిన్
3) క్లోరోక్విన్ 4) స్ట్రెప్టోమైసిన్
22. మలేరియా నివారణకు వాడే ఔషధం?
1) క్లోరోక్విన్ 2) పెన్సిలిన్
3) ఆస్పిరిన్ 4) వేలియం
23. మత్తు మందులకు అలవాటు పడిన వారు అవి దొరకకపోతే సేవించేది ఏది?
1) డెట్టాల్ 2) పురుగులమందు
3) దగ్గు మందు 4) ఎండ్రిన్
24. కిందివాటిలో గర్భ నిరోధక ఔషధం (యాంటీ ఫెర్టిలిటీ డ్రగ్) ఏది?
ఎ. నారిథిండ్రోన్
బి. ఇథైనైల్ ఈస్ట్రాడయోల్
సి. క్లోరామ్‌ఫెనికాల్
1) ఎ, బి 2) బి, సి
3) ఎ, సి 4) ఎ, బి, సి
25. కిందివాటిలో దోమల నియంత్రణకారి?
1) డెట్టాల్ 2) పైరిథ్రిన్
3) ఈథర్ 4) ఆలిటేమ్
26. కిందివాటిలో సరికాని జత ఏది?
1) కనుపాప విస్ఫారణం: అట్రోపిన్
2) స్థానిక మత్తు మందు: ఈథర్
3) గుండె జబ్బు: నైట్రో గ్లిజరిన్
4) మలేరియా: నికోటిన్
27. పెన్సిలిన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త?
1) అలెగ్జాండర్ ఫ్లెమింగ్
2) ఖొరానా
3) సాల్వర్‌సన్
4) సి.వి. రామన్
సమాధానాలు:
1) 4; 2) 1; 3) 4; 4) 4; 5) 1;
6) 3; 7) 4; 8) 1; 9) 4; 10) 2;
11) 2; 12) 1; 13) 1; 14) 4; 15) 3;
16) 3; 17) 1; 18) 2; 19) 4; 20) 4;
21) 1; 22) 1; 23) 3; 24) 1; 25) 2;
26) 4; 27) 1.
RMS School Admission 2025-26 : ఆర్మీ స్కూల్స్‌లో వివిధ తరగతుల్లో ప్రవేశాలు.. అర్హతలు ఇవే..
Tags
- Study Material
- chemistry study material
- Competitive Exams
- exam preparation tips for groups exams
- group 1 and 2 study materials
- appsc and tspsc groups exams
- appsc and tspsc chemistry material
- model questions for chemistry
- group exams
- group 1 and 2 chemistry study material
- groups exam study material
- appsc and tspsc chemistry exam
- materials and model questions for chemistry
- study material and model questions at groups exam
- material and model questions for chemistry groups exam
- practice questions for chemistry exams
- practice questions for chemistry groups exams
- use of medicines
- no self treatment
- notes on use of medicines
- Education News
- Sakshi Education News