Polity Practice Bits for APPSC/TSPSC Group-2: రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితిని కింద పేర్కొన్న ఏ సందర్భంలో పెంచవచ్చు?
1. కింది వాటిలో సరైన వ్యాఖ్య ఏది?
1) రాజ్యసభను తాత్కాలికంగా రద్దు చేయవచ్చు, కానీ శాశ్వతంగా రద్దు చేయలేం
2) లోక్‌సభను తాత్కాలికంగా రద్దు చేయవచ్చు, కానీ శాశ్వతంగా రద్దు చేయలేం
3) రాష్ట్ర అసెంబ్లీ (శాసన సభ)ని తాత్కాలికంగా, శాశ్వతంగా రద్దు చేయవచ్చు
4) రాష్ట్ర కౌన్సిల్ (శాసన మండలి)ను తాత్కాలికంగా, శాశ్వతంగా రద్దు చేయవచ్చు
- View Answer
- సమాధానం: 2
2. రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితిని కింద పేర్కొన్న ఏ సందర్భంలో పెంచవచ్చు?
1) జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన సందర్భంలో
2) రాష్ట్రపతి పాలన విధించినప్పుడు
3) ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించిన సందర్భంలో
4) పైన పేర్కొన్న అన్ని సందర్భాల్లో
- View Answer
- సమాధానం: 1
3. ‘ఫాదర్ ఆఫ్ లోక్‌సభ’ అని ఎవరిని అంటారు?
1) జి.వి. మౌలాంకర్
2) ఎ.ఎస్. అయ్యంగార్
3) గోపాలస్వామి అయ్యంగార్
4) కె.ఎం. మున్షీ
- View Answer
- సమాధానం: 1
4. శూన్య సమయాన్ని (జీరో అవర్) ఎప్పటి నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు?
1) 2001
2) 2002
3) 2003
4) 2004
- View Answer
- సమాధానం: 4
5. ‘ఎమ్డెన్ ఆఫ్ లోక్‌సభ’ అని ఎవరిని పేర్కొంటారు?
1) జి.వి. మౌలాంకర్
2) ఎ.ఎస్. అయ్యంగార్
3) హుకుం సింగ్
4) బలరాం జాకర్
- View Answer
- సమాధానం: 2
6. కింది వాటిలో బహిరంగ ఓటు హక్కు పద్ధతిలో జరిగే ఎన్నికలేవి?
1) రాజ్యసభ ఎన్నికలు
2) రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు
3) సర్పంచ్ ఎన్నికలు
4) పైవేవీకావు
- View Answer
- సమాధానం: 1
7. 2012 మే 13న పార్లమెంట్ వజ్రోత్సవాల సందర్భంగా.. మొదటి సభలో సభ్యులుగా ఉన్న వారిని పార్లమెంట్ ఘనంగా సన్మానించింది. కింది వారిలో వారెవరు?
ఎ) కందాల సుబ్రహ్మణ్యం, కానేటి మోహన్ రావు
బి) డోంకుపర్ రాయ్, ఫ్రైడే లింగ్డో
సి) రీశాంగ్ కిషింగ్, రేషమ్‌లాల్ జంగ్డే
1) ఎ, బి
2) బి, సి
3) సి, ఎ
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 3
8. వివిధ ఆర్థిక సంఘాలు - సూచించిన కమిటీలకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) ప్రభుత్వ ఖాతాల సంఘం - హేలీ కమిటీ
2) అంచనాల సంఘం - జాన్ మత్తాయ్ కమిటీ
3) ప్రభుత్వ రంగ సంస్థల సంఘం - వి.కె. కృష్ణమీనన్ కమిటీ
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 1
9. ఎన్నో లోక్‌సభ ఎక్కువ కాలం కొనసాగింది?
1) 5
2) 6
3) 7
4) 8
- View Answer
- సమాధానం: 1
10. భౌగోళిక విస్తీర్ణం పరంగా కింది వాటిలో ఏ నియోజకవర్గం పరిధి పెద్దది?
1) అసెంబ్లీ నియోజకవర్గం
2) లోక్‌సభ నియోజకవర్గం
3) జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గం
4) ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ నియోజక వర్గం
- View Answer
- సమాధానం: 4
11. కింద పేర్కొన్న ఏ సభలో ప్రత్యక్షంగా ఎన్నికైనవారు, పరోక్షంగా ఎన్నికైనవారు, నియామక సభ్యులు ఉంటారు?
ఎ) లోక్‌సభ
బి) రాజ్యసభ
సి) విధాన సభ
డి) విధాన పరిషత్
1) ఎ, సి
2) బి, డి
3) డి మాత్రమే
4) బి మాత్రమే
- View Answer
- సమాధానం: 3
12.భారత రాష్ట్రపతి సాధారణ బిల్లు విషయంలో సంయుక్త సమావేశానికి ఉత్తర్వులు జారీ చేశాక లోక్‌సభ రద్దు అయితే..?
1) సంయుక్త సమావేశం నిర్వహించవచ్చు
2) సంయుక్త సమావేశం రద్దవుతుంది
3) రాష్ట్రపతి విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది
4) రాజ్యసభ ఆమోదంతో ఆ బిల్లు శాసనంగా మారుతుంది
- View Answer
- సమాధానం: 1
13. కింద పేర్కొన్న ఏ బిల్లు ఆమోదం విషయంలో సంయుక్త సమావేశం నిర్వహించలేదు?
1) వరకట్న నిషేధ బిల్లు
2) పోటా బిల్లు
3) బ్యాంకింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్లు
4) టాడా బిల్లు
- View Answer
- సమాధానం: 4
14.పార్లమెంట్ ఉభయ సభలకు కింద పేర్కొన్న ఏ అంశంలో సమాన అధికారాలు ఉండవు?
1) రాష్ట్రపతిని ఎన్నుకోవడంలో
2) రాష్ట్రపతిని తొలగించడంలో
3) ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడంలో
4) ఉపరాష్ట్రపతిని తొలగించడంలో
- View Answer
- సమాధానం: 4
15. ఆర్టికల్ 249 ప్రకారం.. రాజ్యసభ దేని కోసం రాష్ట్ర జాబితాలోని అంశంపై శాసనం చేయమని తీర్మానం చేయవచ్చు?
1) జాతీయ సమైక్యత
2) జాతీయ అఖండత
3) జాతీయ ప్రయోజనం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 3
16. రాజ్యసభకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) రాజ్యసభలో మొదటి సభా నాయకుడు -ఎన్ గోపాలస్వామి అయ్యంగార్
బి) రాజ్యసభ మొదటి చైర్మన్ - సర్వేపల్లి రాధాకృష్ణన్
సి) రాజ్యసభ మొదటి డిప్యూటీ చైర్మన్ - ఎస్.వి. కృష్ణమూర్తి
1) ఎ, బి
2) బి, సి
3) బి మాత్రమే
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 4
17. ప్రస్తుతం లోక్‌సభలో కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎంత మంది సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు?
1) 13
2) 15
3) 23
4) 25
- View Answer
- సమాధానం: 1
18. భారత రాష్ట్రపతి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన కోసం డీ-లిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు?
1) 82
2) 83
3) 84
4) 86
- View Answer
- సమాధానం: 1
19. కేంద్రంలో ప్రతిపక్షానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
ఎ) లోక్‌సభలో తొలిసారిగా అధికారికంగా ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందినవారు - వై.బి. చవాన్
బి) రాజ్యసభలో తొలిసారిగా అధికారికంగా ప్రతిపక్ష నేతగా గుర్తింపు పొందినవారు - శ్యామ్ నందన్ మిశ్రా
సి) లోక్‌సభలో అనధికారికంగా ప్రతిపక్షనేతగా గుర్తింపు పొందినవారు - రావు సుభాష్‌సింగ్
1) ఎ, బి
2) ఎ మాత్రమే
3) ఎ, సి
4) ఎ, బి, సి
- View Answer
- సమాధానం: 3
20. పార్లమెంటరీ పరిభాషలో ‘డెడ్‌లాక్’ అంటే ఏమిటి?
1) సాధారణ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు తిరస్కరించడం
2) ఆర్థిక బిల్లును లోక్‌సభ తిరస్కరించడం
3) సాధారణ బిల్లు విషయంలో పార్లమెంట్ రెండు సభల మధ్య వైరుధ్యం ఏర్పడటం
4) సంయుక్త సమావేశంలో సాధారణ బిల్లును తిరస్కరించడం
- View Answer
- సమాధానం: 3
21. కింది వాటిలో సరికానిది ఏది?
1) రాజ్యసభ ఏర్పడిన తేదీ - 1952 మే 3
2) పార్లమెంట్ తొలి సమావేశం నిర్వహించిన తేదీ - 1952 మే 13
3) లోక్‌సభ ఏర్పడిన తేది-1952 ఏప్రిల్ 17
4) లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమైన తేదీ - 1951 డిసెంబర్ 15
- View Answer
- సమాధానం: 1
22. ప్రస్తుతం రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యే సభ్యుల సంఖ్య?
1) 233
2) 245
3) 229
4) 238
- View Answer
- సమాధానం: 3
23. ద్రవ్య బిల్లుకు సంబంధించి రాజ్యసభకు కింది వాటిలో ఏ రకమైన అధికారం ఉంది?
ఎ) చర్చించవచ్చు
బి) సవరణలు ప్రతిపాదించవచ్చు
సి) తిరస్కరించవచ్చు
1) ఎ, బి
2) ఎ మాత్రమే
3) ఎ, బి, సి
4) ఎ, సి
- View Answer
- సమాధానం: 1
24. ఎన్నో రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర పాలిత ప్రాంతాలకు రాజ్యసభలో ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు?
1) 7వ సవరణ (1956)
2) 24వ సవరణ (1971)
3) 42వ సవరణ (1976)
4) 70వ సవరణ (1992)
- View Answer
- సమాధానం: 1
25.ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల వివాదాన్ని రాష్ట్ర హైకోర్టు ప్రాథమిక విచారణాధికారంలో అంతర్భాగంగా విచారిస్తుంది. ఈ విషయంలో హైకోర్టు తీర్పునకు సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) సుప్రీంకోర్టులో సవాలు చేయవచ్చు
2) పార్లమెంట్ ఏర్పరచిన ప్రత్యేక కోర్టు విచారించవచ్చు
3) ఎన్నికల కమిషన్ విచారించవచ్చు
4) పైవేవీ సరికావు
- View Answer
- సమాధానం: 1
26. పార్లమెంట్ సభ్యుల అనర్హత గురించి తెలిపే రాజ్యాంగ ఆర్టికల్ ఏది?
1) 100
2) 102
3) 104
4) 106
- View Answer
- సమాధానం: 2
27.భారత పార్లమెంట్‌కు సంబంధించి కింది వాటిలో సరికాని ఆర్టికల్ ఏది?
1) ఆర్టికల్ 83 - లోక్‌సభ, రాజ్యసభ కాలపరిమితి
2) ఆర్టికల్ 85 - పార్లమెంట్ సమావేశాలు
3) ఆర్టికల్ 100 - పార్లమెంట్ కోరమ్
4) ఆర్టికల్ 101 - పార్లమెంట్ సభ్యులు తమ మాతృభాషలో ప్రసంగించవచ్చు
- View Answer
- సమాధానం: 4
28. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలలో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను 95వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎప్పటి వరకు పొడిగించారు?
1) 2019
2) 2020
3) 2026
4) శాశ్వతంగా
- View Answer
- సమాధానం: 2
29. కింది వాటిలో సరికానిది ఏది?
1) ఆంధ్రప్రదేశ్‌తో సమానంగా 25 లోక్‌సభ స్థానాలున్న మరో రాష్ట్రం రాజస్థాన్
2) తెలంగాణతో సమానంగా 17 లోక్‌సభ స్థానాలున్న రాష్ట్రం - అసోం
3) ఆంధ్రప్రదేశ్‌తో సమానంగా 11 రాజ్యసభ స్థానాలున్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్, గుజరాత్
4) తెలంగాణతో సమానంగా ఏడు రాజ్యసభ స్థానాలున్న రాష్ట్రాలు అసోం, పంజాబ్
- View Answer
- సమాధానం: 2
30. భారతదేశంలో ఒకే ఒక లోక్‌సభ స్థానం ఉన్న రాష్ట్రాలేవి?
1) సిక్కిం, నాగాలాండ్, మణిపూర్
2) సిక్కిం, నాగాలాండ్, మేఘాలయ
3) మణిపూర్, మిజోరాం, సిక్కిం
4) మిజోరాం, సిక్కిం, నాగాలాండ్
- View Answer
- సమాధానం: 4
31.భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం.. రాష్ట్రపతి లోక్‌సభను ముందే రద్దు చేయవచ్చు?
1) ఆర్టికల్ 84(2)
2) ఆర్టికల్ 84(2బి)
3) ఆర్టికల్ 85(2)
4) ఆర్టికల్ 85(2బి)
- View Answer
- సమాధానం: 4
32. కింద పేర్కొన్న వారిలో ఎన్నిక ద్వారా పదవిలోకి వచ్చే వారెవరు?
1) ప్రధానమంత్రి
2) ముఖ్యమంత్రి
3) ఉపరాష్ట్రపతి
4) పై ముగ్గురూ
- View Answer
- సమాధానం: 3
33. కేంద్రంలో ప్రభుత్వం రద్దైనప్పుడు బిల్లులపై పడే ప్రభావానికి సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ముందుగా రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లు పెండింగ్‌లో ఉంటే ఆ బిల్లు రద్దు కాదు
2) ఒక బిల్లు ముందుగా లోక్‌సభలో ప్రవేశపెట్టి.. పెండింగ్‌లో ఉంటే ఆ బిల్లు రద్దు కాదు
3) రెండు సభలు ఆమోదించి రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లు రద్దవుతుంది
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 1
34.కింద పేర్కొన్నవారిలో స్పీకర్ ఎవరిని నియమించరు?
1) ప్యానెల్ స్పీకర్
2) ఆర్థిక కమిటీల చైర్మన్లు
3) ఆర్థిక కమిటీల సభ్యులు
4) పైన పేర్కొన్న వారందరూ
- View Answer
- సమాధానం: 3
35. లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌కు ఏ రకమైన బిల్లులపై సాధారణ ఓటు (మొదటిసారి) వేసే అధికారం ఉండదు?
1) రాజ్యాంగ సవరణ బిల్లు
2) ఆర్థిక బిల్లు
3) రాష్ట్రాల ఏర్పాటు బిల్లు
4) లోక్‌సభ సమావేశాలకు అధ్యక్షత వహించినప్పుడు అన్ని రకాల బిల్లులపై
- View Answer
- సమాధానం: 4
36. MPLAD స్కీంలో కొంత మంది ఎంపీలు అవినీతికి పాల్పడటాన్ని ‘స్టార్ న్యూస్’ ఏ పేరుతో స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి బయటపెట్టింది?
1) ఆపరేషన్ దుర్యోధన్
2) ఆపరేషన్ లాడ్‌స
3) ఆపరేషన్ చక్రవ్యూహ్
4) ఆపరేషన్ డిటెక్ట్
- View Answer
- సమాధానం: 3
37. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులకు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది?
1) పి.వి. నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు 1993లో స్పీకర్ శివరాజ్ పాటిల్ ప్రారంభించారు
2) మాజీ హోంశాఖ మంత్రి గోవింద్ వల్లభ్‌పంత్ పేరుపై ఈ అవార్డును ఇస్తున్నారు
3) 2017 సంవత్సరానికి ఈ అవార్డును బర్తృహరి మహాతాబ్ పొందారు
4) ఈ అవార్డు అందుకున్న ఏకైక మహిళ సుష్మాస్వరాజ్
- View Answer
- సమాధానం: 4
38.1989లో కేంద్రంలో తొలిసారిగా హంగ్ లోక్‌సభ ఏర్పడింది. ఆ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీ ఏది?
1) జనతాపార్టీ
2) కాంగ్రెస్ (ఐ)
3) జనతాదళ్
4) భారతీయ జనతా పార్టీ
- View Answer
- సమాధానం: 2
39. 16వ లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన సీట్ల సంఖ్య ప్రకారం.. కింద పేర్కొన్న పార్టీల సరైన వరస క్రమం ఏది?
ఎ) టీఎంసీ
బి) ఏఐఏడీఎంకే
సి) శివసేన
డి) టీడీపీ
1) ఎ, బి, సి, డి
2) బి, ఎ, డి, సి
3) బి, ఎ, సి, డి
4) ఎ, బి, డి, సి
- View Answer
- సమాధానం: 3
40. భారత లోక్‌సభ ఎన్నికల చరిత్రలో అత్యధికంగా 6,96,321 ఓట్ల మెజారిటీతో ప్రీతం ముండే ఏ నియోజకవర్గం నుంచి(2014లో) లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు?
1) ఆరాంబాగ్
2) తమర్
3) వాషిం
4) బీడ్
- View Answer
- సమాధానం: 4