Indian Polity Bit Bank for Competitive Exams: నూతన అఖిల భారత సర్వీసును ఏర్పాటు చేసే అధికారం ఎవరికుంది?
1. ఒక వేళ రాష్ట్రపతి తన పదవికి రాజీనామా చేయాలనుకుంటే తాను రాజీనామా పత్రాన్ని ఎవరికి సమ ర్పించాలి.
ఎ) సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి
బి) ప్రధానమంత్రి
సి) ఉపరాష్ట్రపతి
డి) లోక్సభ స్పీకరు
- View Answer
- సమాధానం: సి
2. ఈ కింది వాటిలో సరైనది
1) భారత రాష్ట్రపతి పార్లమెంట్లో ఏ సభలోనూ సభ్యుడు కాదు.
2) భారత పార్లమెంట్లో రాష్ట్రపతి, రెండు సభలు ఉంటాయి.
ఎ) రెండు కాదు
బి) పైవి రెండూ
సి) 1 మాత్రమే
డి) 2 మాత్రమే
- View Answer
- సమాధానం: బి
చదవండి: Indian Polity for Competitive Exams: కేంద్ర ప్రభుత్వం – నిర్మాణం, అధికారాలు (కార్యనిర్వాహక శాఖ, శాసన శాఖ, న్యాయ శాఖ)
3. ఎన్నికల సంఘం గుజరాత్ (2002)లో అసెంబ్లీ ఎన్ని కలను వాయిదా వేయడం రాజ్యాంగపరంగా ఎంత వరకు సమంజస మనే దానిపై సుప్రీంకోర్టు అభి ప్రాయాన్ని రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం కోరారు.
ఎ) ఆర్టికల్ 142
బి) ఆర్టికల్ 143
సి) ఆర్టికల్ 144
డి) ఆర్టికల్ 145
- View Answer
- సమాధానం: బి
4. నూతన అఖిల భారత సర్వీసును ఏర్పాటు చేసే అధికారం ఎవరికుంది.
ఎ) ఉపాధి మంత్రిత్వ శాఖ
బి) లోక్సభ
సి) రాష్ట్రపతి
డి) పార్లమెంటు
- View Answer
- సమాధానం: డి
చదవండి: Indian Polity Bit Bank for Competitive Exams: ఈ కింది ఏ దశాబ్దంలో ఎక్కువ రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి?
5. రైజీనా హిల్స్ అనేవి
ఎ) రాష్ట్రపతి నివాసం ఉండే ప్రాంతం
బి) ప్రధాని నివాసం ఉండే ప్రాంతం
సి) పార్లమెంటు భవనం ఉండే ప్రాంతం
డి) పైవేవి కాదు
- View Answer
- సమాధానం: ఎ
6. ‘జాతికి ప్రాతినిధ్యం వహిస్తారు. కాని జాతిని నడిపించ లేడు’ అనే వ్యాఖ్యను ఎవరికి ఆపాదించవచ్చు.
ఎ) రాష్ట్రపతి
బి) ప్రధానమంత్రి
సి) ఉపరాష్ట్రపతి
డి) లోక్సభ స్పీకర్
- View Answer
- సమాధానం: ఎ
చదవండి: Indian Polity Notes for Competitive Exams: భారత రాష్ట్రపతి–ఎన్నిక పద్ధతి, అధికార విధులు
7. ఈ కింది వారిలో ఎవరిని రాష్ట్రపతి నియమించరు. కానీ తొలగించగలరు.
ఎ) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు
బి) రాష్ట్ర ఎన్నికల సంఘం
సి) రాష్ట్ర గవర్నర్
డి) పై అందరూ
- View Answer
- సమాధానం: ఎ
8. రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు. కాని తొలగింపులో పాల్గొనరు.
ఎ) నామినేటెడ్ సభ్యులు
బి) రాష్ట్ర విధాన సభ సభ్యులు
సి) రాష్ట్ర విధాన పరిషత్ సభ్యులు
డి) పై ఎవరు కాదు
- View Answer
- సమాధానం: బి
9. రాష్ట్రపతి తొలగింపులో పాల్గొంటారు. కాని ఎన్నికలో పాల్గొనరు
ఎ) రాష్ట్ర విధాన సభ సభ్యులు
బి) నామినేటెడ్ సభ్యులు
సి) పై ఇద్దరూ
డి) పై ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: బి
చదవండి: Indian Polity Notes for Group 1&2: భారత రాజ్యాంగం 73వ సవరణ చట్టం 1992 వర్తించని రాష్ట్రం
10. కేంద్ర ప్రభుత్వం అన్ని కార్య నిర్వాహక సంబంధ ఒప్పందాలు ఎవరి పేరు మీద జరుగుతాయి.
ఎ) కేబినెట్
బి) పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ బ్యూరో
సి) ప్రధానమంత్రి
డి) రాష్ట్రపతి
- View Answer
- సమాధానం: డి