Skip to main content

Telangana Government Jobs : పెరగనున్న గ్రూప్‌-2, 3, 4 పోస్టులు ఇవే.. ఉత్తర్వులు జారీ..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: తెలంగాణలోని నిరుద్యోగులకు ప్ర‌భుత్వం మ‌రో గుడ్‌న్యూస్ చెప్పింది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2, 3, 4 ద్వారా భర్తీ చేసే ఉద్యోగాల్లో మరికొన్ని రకాల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది.

ఈ మేరకు ప్ర‌భుత్వం న‌వంబ‌ర్ 23వ తేదీన‌(బుధవారం) రాత్రి కొత్త జీవో నె.136 జారీ చేసింది. అలాగే గతంలో జారీ చేసిన జీవో నెం.55ను సవరించింది. ఆయా సర్వీసుల్లో ఉన్న అర్హతలు ఒకేలా ఉండటంతో ఈ మార్పులు చేసింది ప్రభుత్వం. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఖాళీల సంఖ్య మరికొంత పెరగనుంది.

 టీఎస్‌పీఎస్సీ → స్టడీ మెటీరియల్ → బిట్ బ్యాంక్ → సక్సెస్ స్టోరీస్ → గైడెన్స్ → సిలబస్

☛ గ్రూప్‌-1,2,3,4 ప్రీవియ‌స్ కొశ్చన్‌ పేప‌ర్స్ కోసం క్లిక్ చేయండి

గ్రూప్‌-2లో..
టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-2లో మరో ఆరు రకాల పోస్టులు, గ్రూప్‌-3లో మరో రెండు, గ్రూప్‌-4లో మరో 4 రకాల పోస్టులను చేర్చింది. గ్రూప్‌-2లో రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇతర శాఖలకు చెందిన ఏఎస్‌వో, జువైనల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రొబేషనరీ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌,  అసిస్టెంట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులు కూడా ఉంటాయి.

TSPSC Group-2 Syllabus : 582 పోస్టులు.. గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల సిల‌బ‌స్ ఇదే..

చ‌ద‌వండి: TSPSC Groups Success Tips: కోచింగ్‌కు వెళ్లడం శుద్ధ దండగ.. ఇలా చ‌దివితే నెలలో ‘గ్రూప్స్‌’ కొట్టొచ్చు.

గ్రూప్‌-3లో..
గ్రూప్‌-3లో గిరిజన సంక్షేమశాఖ అకౌంటెంట్‌, హెచ్‌వోడీల్లోని సీనియర్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ అకౌంటెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులను చేర్చారు.

TSPSC: గ్రూప్-3 ఉద్యోగాలు.. ఎగ్జామ్స్‌ సిలబస్ ఇదే..!

TSPSC Group-1 Cut Off Marks : గ్రూప్‌-1 మెయిన్స్‌లో నిలవాలంటే ఎన్ని మార్కులు సాధించాలంటే..

గ్రూప్‌-4లో..
గ్రూప్‌-4లో జిల్లా కార్యాలయాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌, అకౌంటెంట్‌, జువైనల్‌ సర్వీసెస్‌ సూపర్‌ వైజర్‌ మేల్‌, జువైనల్‌ సర్వీసెస్‌ మ్యాట్రన్‌ స్టోర్‌ కీపర్‌, సాంకేతిక విద్యాశాఖ మ్యాట్రన్‌ పోస్టులు చేర్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

Groups Books: గ్రూప్-1&2కు కచ్చితంగా చదవాల్సిన పుస్తకాలు.. వీటి జోలికి అసలు వెళ్లోద్దు..!

చ‌ద‌వండి: Books for Groups Preparation: కోచింగ్‌ తీసుకోకుండా గ్రూప్స్‌లో విజయం సాధించడమెలాగో తెలుసుకుందాం..

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

Published date : 24 Nov 2022 06:37PM
PDF

Photo Stories