Skip to main content

Bad News.. TSPSC Group 2 Again Postponed : బ్రేకింగ్ న్యూస్.. గ్రూప్‌-2 మ‌ళ్లీ వాయిదా.. కొత్త తేదీలను...

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్‌పీఎస్సీ) గ్రూప్‌-2 మ‌ళ్లీ వాయిదా వేసింది. జ‌న‌వ‌రి 6, 7వ తేదీల్లో జ‌ర‌గాల్సిన ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేశారు. ఈ మేర‌కు టీఎస్‌పీఎస్సీ డిసెంబ‌ర్ 27వ తేదీన‌(బుధ‌వారం) ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.
tspsc group 2 postponed

ఈ వాయిదా ప‌డిన‌ గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల కొత్త తేదీల‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్నారు. దాదాపు 783 గ్రూప్‌-2 ఉద్యోగాల‌కు గ‌తంలో నోటిఫికేష‌న్ ఇచ్చిన విష‌యం తెల్సిందే. ఈ ఉద్య‌గాల‌కు దాదాపు 5.5 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థుల ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ‌లో కొత్త‌గా వ‌చ్చిన కాంగ్రెస్ ప్ర‌భుత్వం గ్రూప్-2 పోస్టుల సంఖ్య పెంచి.. కొత్త‌గా నోటిఫికేష‌న్ ఫిబ్ర‌వ‌రిలో ఇచ్చే అవ‌కాశం ఉంది. 

Published date : 27 Dec 2023 10:56PM

Photo Stories