TSPSC Group 1 Prelims Exam 2022 Key : గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రాథమిక ‘కీ’ ని ఎప్పుడు విడుదల చేస్తారంటే..?
ఎందుకంటే.. రాసిన ప్రశ్నలకు సరైన జవాబులపై అంచనాకు రాలేని పరిస్థితి నెలకొంది. ప్రాథమిక కీ విడుదలైతే తప్ప స్పష్టత వచ్చే అవకాశం లేదని అభ్యర్థులు పేర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఏర్పాటైన తర్వాత తొలిసారిగా గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఇందులో భాగంగా 503 కొలువుల కోసం అక్టోబర్ 16వ తేదీన 1,019 పరీక్షా కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు 2,86,051 (75%) మంది దీనికి హాజరయ్యారు.
☛ TSPSC Group 1 - 2022 Question Paper with Key (Held on 16.10.2022 )
కొన్ని ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో..
అభ్యర్థులుగానీ, కోచింగ్ సెంటర్లుగానీ పరీక్ష ముగిసిన తర్వాత నిపుణులు, మేధావులను సంప్రదించి సరైన సమాధానాలపై, తమకు వచ్చే మార్కులపై అంచనాకు రావడం జరుగుతుంది.టీఎస్‌పీఎస్సీ గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నపత్రంపై ఇప్పటికీ అభ్యర్థుల్లో గందరగోళమే కనిపిస్తోంది. ఒకే ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ జవాబులు ఉండటమే దీనికి కారణమని.. కొన్ని ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్లలో రెండు, మూడు సరైన సమాధానాలు ఉన్నాయని అభ్యర్థులు చెబుతు న్నారు. ఇక ఒకే ప్రశ్నలో నాలుగు ప్రశ్నలు అడుగుతూ వాటిని జతపర్చాలని సూచించారని అంటున్నారు. విభిన్న రకాలుగా ప్రశ్నలు ఇవ్వడంతో సరైన సమాధానాలను గుర్తించడంలో ఇబ్బందిపడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటున్నారు.
ప్రాథమిక ‘కీ’ని ఎప్పుడు విడుదల చేస్తారంటే..?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రాథమిక కీ ని విడుదల చేసేందుకు పదిరోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ముందుగా అభ్య ర్థుల ఓఎంఆర్ జవాబు పత్రాలను www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి పెట్టిన.. వెంటనే ప్రాథమిక ‘కీ’ని విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. రోజుకు సగటున 40వేల ఓఎంఆర్ షీట్లను స్కానింగ్ చేస్తున్నారు. అలాగే ఈ ప్రాథమిక కీ పై అభ్యంతరాలను తెలిపేందుకు అవకాశం కూడా ఇవ్వనున్నారు.