Skip to main content

Group-1 Notification: గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల.. ఎప్పుడంటే..!

గతంలో రెండుమూడు సార్లు గ్రూప్‌-1 పరీక్షలు పలు కారణాల వల్ల రద్దు చేయబడ్డాయి. అయితే ఇటీవలె, టీఎస్‌పీఎస్‌సీ గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు లైన్‌ క్లియర్‌ అయినట్లు వెల్లడైంది. పూర్తి వివరాలు..
Notification for Group-1 Exams   Group-1 Exam Cancellation History     TSPSC Group-1 Notification Clearance Announcement

గ్రూప్-1 నోటిఫికేషన్‌పై కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణలో గ్రూప్-1 నోటిఫికేషన్‌కు లైన్‌ క్లియర్‌ అయ్యింది. గతంలో టీఎస్‌పీఎస్సీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. దీంతో త్వరలో కొత్త గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల అయ్యే అవకాశం ఉంది.

Mana Badi: మన బడి నాడు-నేడు పథకంతో ఇస్పైర్‌ పోటీల్లో ఈ ముగ్గురు విద్యార్థులు సత్తా చాటారు..

కాగా రెండేళ్ల కిందట తొలిసారి నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్ష పేపర్‌ లీక్‌ కావడంతో ఆ పరీక్షను రద్దు చేశారు. రెండోసారి నిర్వహించిన పరీక్షలో కొందరి బయోమెట్రిక్ హాజరు తీసుకోలేదని కేసు వేయడంతో హైకోర్టు గ్రూప్‌-1 పరీక్షను రద్దు చేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ.. అప్పటి ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టుకు వెళ్లింది. అయితే, తాజాగా గ్రూప్-1పై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.

Open Exams: వచ్చే నెల టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు.. తేదీలు విడుదల..

ఇక గతంలోని 503 ఖాళీలకు అదనంగా మరో 60 పోస్టులను పెంచుతూ ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 563కి చేరుకుంది. ఈ పోస్టుల భర్తీకి అనుబంధ నోటిఫికేషన్ విడుదల కానుంది. గతంలో 503 పోస్టుల భర్తీకి TSPSC నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు వయోపరిమితిని 46 ఏళ్ల వరకు సడలిస్తామని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీంతో వీలైనంత త్వరగా నోటిఫికేషన్ విడుదల కానుంది.

 

 

                       

Published date : 12 Feb 2024 01:21PM

Photo Stories