Mana Badi: మన బడి నాడు-నేడు పథకంతో ఇస్పైర్ పోటీల్లో ఈ ముగ్గురు విద్యార్థులు సత్తా చాటారు..
సరైన సదుపాయాలు కల్పిస్తే తామెంతో అద్భుతంగా రాణించగలమని రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిరూపిస్తున్నారు. జాతీయ స్థాయిలోనే కాదు.. అంతర్జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు వీరు తమ ప్రతిభను చాటుతున్నారు. నాడు–నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్ది, విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.
State Level Chess: రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో గెలిచిన విద్యార్థులు వీరే..
దీంతో అక్కడి సైన్స్ ల్యాబ్స్, నిష్ణాతులైన ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో కేంద్ర ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిర్వహించే ‘ఇన్‌స్పైర్’ పోటీల్లో వారిప్పుడు తమ సత్తా చాటుతున్నారు. 2019 నుంచి 2022 విద్యా సంవత్సరం వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఏడుగురు విద్యార్థులు తమ సైన్స్ ప్రతిభతో ‘జపాన్ సకురా’ పోటీలకు ఎంపిక కాగా, వీరిలో ముగ్గురు జపాన్‌లో పర్యటించి వచ్చారు. మరో నలుగురు వచ్చే మేలో జపాన్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
EDCET & ICET Exam Dates Out- మే 23న ఎడ్‌సెట్..జూన్ 4,5 తేదీల్లో ఐసెట్
10 నుంచి మూడో స్థానానికి..
నిజానికి.. 2019కి ముందు జాతీయ స్థాయి ఇన్‌స్పైర్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో ఉంటే ఇప్పుడు 3వ స్థానానికి చేరుకుంది. గతంలో రెండు మూడేళ్లకు ఒక్కరు ఈ పోటీలకు ఎంపికవడమే గగనంగా ఉండే పరిస్థితి నుంచి ఇప్పుడు ఏటా ముగ్గురు నుంచి నలుగురు ఎంపికవుతుండడం విద్యా ప్రమాణాలు, సదుపాయాల పెరుగుదలకు, ఉపాధ్యాయుల శిక్షణ కారణమని విద్యావేత్తలు అభినందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యార్థుల్లో 10 మంది గత సెప్టెంబరులో అమెరికా, యూఎన్‌ఓలో ప్రసంగించిన విషయం తెలిచిందే. ఇప్పుడు అదే స్థాయిలో ఇన్‌స్పైర్ విద్యార్థులు జపాన్‌కు వెళ్లి ఏపీ విద్యా ప్రగతిని చాటుతున్నారు.
Students Education: నాడు-నేడు పథకంతో తల్లిదండ్రులకు ఆనందం.. కారణం..?
జాతీయ పోటీలకు ఏటా 40 మంది..
‘ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్‌స్యుట్ ఫర్ ఇన్‌స్పైర్డ్ రీసెర్చ్’ (ఇన్‌స్పైర్) పేరుతో కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సైన్స్ పోటీలను నిర్వహిస్తోంది. దీనిద్వారా పాఠశాల స్థాయిలోని విద్యార్థులు తమ దైనందిన జీవితంలో చూసిన సమస్యలకు పరిష్కారాలను చూపుతూ నమూనాలను తయారుచేయాలి. ఇందుకోసం ఇన్‌స్పైర్ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకుంటే.. ఆకర్షణీయమైన అంశాలౖపె ప్రాజెక్టు చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. గత నాలుగేళ్లుగా 40 వేల మందికి పైగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రాజెక్టులు నమోదుచేస్తున్నారు. వీటి నుంచి రాష్ట్రస్థాయి పోటీలకు 400 వరకు ఎంపికవుతుండగా, జాతీయ పోటీలకు 40 నుంచి 45 ప్రాజెక్టులు ఎంపికవుతున్నాయి. జాతీయ పోటీల్లో రాష్ట్రం నుంచి ఇంత పెద్దస్థాయిలో విద్యార్థుల ప్రాజెక్టులు ఎంపికవడం ఇప్పుడే జరుగుతోంది.
Group 1 Notification: తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్‌కు లైన్‌క్లియర్
ఉత్తమ ప్రాజెక్టులకు పేటెంట్ రైట్స్..
గతేడాది గుంటూరు జిల్లా అత్తోట జెడ్పీ స్కూల్ విద్యార్థిని పి. కీర్తి వీధుల్లో కూరగాయలు అమ్ముకునే వారికి ఉపయోగపడే వెండర్స్ ఫ్రెండ్లీ సోలార్ కార్ట్‌ను రూపొందించింది. రూ.10 వేల ఖర్చుతో తయారుచేసిన ఈ బండిపై ఆకు కూరలు వారంరోజుల పాటు ఫ్రెష్‌గా ఉంటాయి.
CAPF Conducted In Regional Languages- తెలుగులోనూ సీఏపీఎఫ్ పరీక్ష,తొలిసారిగా 13 భాషల్లో..
అలాగే..
► చిత్తూరు జిల్లా ఏఎల్‌పురం జెడ్పీ స్కూల్ విద్యార్థిని కె. ప్రణయ దాదాపు 15 రోజులపాటు కూరగాయలు పాడవకుండా ఫ్రెష్‌గా నిల్వచేసుకునే గార్లిక్ బ్యాగ్‌ను రూపొందించింది. వెల్లుల్లి పేస్టును గోనె సంచికి పూసి తయారుచేసిన ఈ సంచిని నిపుణులు సైతం పరిశీలించి, ప్రణయను అభినందించారు. వెల్లుల్లి ఉన్నచోట బ్యాక్టీరియా చేరదని, రూ.25 ఖరీదుతో చేసిన ఈ బ్యాగ్ రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థిని చెబుతోంది.
► ఇక చిత్తూరు జిల్లా జంగంపల్లి జెడ్పీ స్కూల్ విద్యార్థి పి. చరణ్ తేజ బైక్‌పై ప్రయాణించే మహిళలు పడిపోకుండా రక్షణగా ఉండే సైడ్ సీట్‌ను రూపొందించాడు.
Digital Classes: విద్యార్థులకు డిజిటల్ బోధన..
ఇలా.. రైతు కుటుంబాలకు చెందిన ఈ ముగ్గురు విద్యార్థులు తాము ప్రతిరోజూ చూస్తున్న సమస్యలకు పరిష్కారంగా ఈ ఆవిష్కరణలు చేసి, జాతీయ ప్రతినిధులను మెప్పించారు. తమ ఆవిష్కరణలకు పేటెంట్ హక్కులు పొందడంతో పాటు గత నవంబరులో జపాన్ వెళ్లి వచ్చారు. మేలో మరో నలుగురు విద్యార్థులు జపాన్ పర్యటనకు సిద్ధమవుతున్నారని స్టేట్ సైన్స్ ఆఫీసర్ డాక్టర్ భాగ్యశ్రీ ‘సాక్షి’కి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ల్యాబ్స్ సదుపాయాలు, బోధనా పద్ధతులు మెరుగుపడ్డాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ ప్రతాప్‌రెడ్డి చెప్పారు. 2022–23 సంవత్సరపు ఇన్‌స్పైర్ పోటీలు జిల్లా స్థాయిలో ఇప్పటికే ప్రారంభమయ్యాయని, గతంకంటే ఈసారి అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్లే మన విద్యార్థులు పెరుగుతారని ఆయన చెబుతున్నారు.