Students Education: నాడు-నేడు పథకంతో తల్లిదండ్రులకు ఆనందం.. కారణం..?
ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తుంది. ఈరోజు పేదింటి పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రపంచస్థాయి విద్యావిధానాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అమలుచేస్తున్నారు. మన బడి నాడు–నేడు కార్యక్రమంతో ఊహించని విధంగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారు.
–ఆర్.వెంకటరమణ,
జిల్లా విద్యాశాఖ అధికారి
Athletics: జాతీయ స్థాయిలో అథ్లెటిక్స్ కు ఎంపికైన విద్యార్థులు..
అన్నీ మారిపోయాయి
నేను 6వ తరగతి నుంచి ఇదే స్కూల్లో చదువుతున్నాను. 7వ తరగతిలోకి వచ్చాక నాడు–నేడు పనులు చేపట్టి మొత్తం రూపురేఖలు మార్చేశారు. టాయిలెట్లు, క్లాస్‌రూమ్‌లు, బెంచీలు, సీలింగ్ ఫ్యాన్లు, లైట్లు, కాంపౌండ్ అన్నీ చేశారు. ఇంగ్లిష్ మీడియం పాఠాలు చెబుతున్నారు. క్రీడలను ప్రోత్సహిస్తున్నారు. నేను జిల్లాస్థాయిలో రాణిస్తే రాష్ట్రస్థాయి డిస్కస్‌త్రో పోటీలకు తీసుకువెళ్లారు.
– కడలి నాగ రిషిత, 9వ తరగతి,
జెడ్పీ హైస్కూల్, ఎల్‌బీ చర్ల
Intermediate Practical: ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు మొదలు..
స్కూల్ మానితే ఫోన్ వచ్చేస్తుంది
మా ఇద్దరు పిల్లలు చిన్నమామిడిపల్లి హైస్కూల్‌లో చదువుతున్నారు. నా భర్త కూలీ పనులకు వెళుతుంటారు. పిల్లలు ఏ కారణంతో అయినా ఆలస్యంగా వెళ్లినా, అనారోగ్యంతో బడి మానేసినా వెంటనే స్కూల్ నుంచి ఫోన్ వస్తుంది. స్కూల్‌ను చాలా బాగా అభివృద్ధి చేశారు. పిల్లలు కూడా క్రమం తప్పకుండా పాఠశాలకు వెళుతున్నారు. సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం.
– జెన్ని భారతి, విద్యార్థుల తల్లి,
సరిపల్లి పద్మశ్రీ కాలనీ, నరసాపురం
State Level Chess: రాష్ట్రస్థాయి చదరంగం పోటీల్లో గెలిచిన విద్యార్థులు వీరే..
నా పిల్లలు ప్రభుత్వ బడిలోనే..
ప్రభుత్వ పాఠశాలలను చూ స్తుంటే చాలా ముచ్చటేస్తుంది. మేం చదువుకున్నప్పుడు ఇ లాంటి వసతులు లేవు. టాయిలెట్స్ కూడా సరిగా ఉండేవి కాదు. ఇప్పుడు టాయిలెట్స్, ఆర్‌ఓ ప్లాంట్, విద్యుత్, సీలింగ్ ఫ్యాన్లు ఇతర వసతుల కల్పించారు. ఆహ్లాదకర వాతావరణంలో ఇంగ్లిష్ మీడియం బోధన చేస్తున్నారు. నా ఇద్దరు కుమార్తెలను ప్రభుత్వ బడిలోనే చదివిస్తున్నా.
– గోగులమండ చినకృష్ణమూర్తి,
పూర్వ విద్యార్థి, యండగండి
APPSC Recruitment: ఏపీలో ఉద్యోగాల భర్తీకి 6 నోటిఫికేషన్లు విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
కార్పొరేట్ సంస్థల కన్నా మెరుగ్గా..
ప్రైవేటు విద్యాసంస్థలో ఫిజిక్స్ ఉపాధ్యాయునిగా పనిచేస్తు న్నాను. కోవిడ్ తర్వాత మా అమ్మాయిలు ఇద్దరినీ బీవీఆర్‌ఎం బాలికోన్నత పాఠశాలలో చదివిస్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ విద్యాసంస్థలను తలపించేలా ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే కార్పొరేట్ స్కూళ్లలో లేని సదుపాయాలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో కనిపిస్తున్నాయి. అన్ని వసతులు కల్పించారు.
– కవురు దేవేంద్రకుమార్,
ప్రైవేట్ ఉపాధ్యాయుడు, అడవిపాలెం