Intermediate Practical: ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు మొదలు..
సాక్షి ఎడ్యుకేషన్: జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆదివారం తొలిరోజున రెండు విడతల్లో (ఉదయం, మధ్యాహ్నం) సెకండియర్ సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. మొదటిరోజున 96 శాతం మంది హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఉదయం 52 కేంద్రాల్లో 2317 మంది విద్యార్థులకు 2205 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 44 కేంద్రాలలో 1520 మందికి 1461 మంది హాజరయ్యారు. పరీక్షలను జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కృష్ణయ్య పర్యవేక్షించారు.
Athletics: జాతీయ స్థాయిలో అథ్లెటిక్స్ కు ఎంపికైన విద్యార్థులు..
వైఎస్సార్ జిల్లాలో..
ఇంటర్మీటియట్ జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు ఆదివారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. మొదటి స్పెల్‌ల్లో భాగంగా తొలిరోజు జిల్లాలో 55 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించారు. ఉదయం సెషన్‌లో 2232 మంది హాజరుకావాల్సి ఉండగా 2149 హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్‌లో 1473 హాజరుకావాల్సి ఉండగా 1424 హాజరయ్యారు. ఉదయం, సాయంత్రం కలిపి 3705 మంది హాజరుకావాల్సి ఉండగా 3573 హాజరుకాగా 132 మంది గైర్హాజరయ్యారు. ఆర్‌ఐవో బండి వెంకటసబ్బయ్య కడపలోని మరియాపురం పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు.
Government Scheme: పాఠశాలల్లో నాడు-నేడు పథకం..!
ఈ సందర్భంగా ఆయన ఎగ్జామినర్లకు పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. పరీక్ష అనంతరం ఎగ్జామినర్స్ ఉదయం, సాయంత్ర తప్పకుండా విద్యార్థులకు సంబంధించిన పశ్నపత్రాలను వాల్యూయేషన్ చేసి మార్కులను ఆన్‌లైన్‌లో ఇంటర్ బోర్డు సైట్‌లో నమోదు చేయాలని సూచించారు.