Skip to main content

Government Scheme: పాఠశాలల్లో నాడు-నేడు పథకం..!

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల వసతులు అందేలా, తదితర సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటుంది. అందుకు ఈ పథకాన్ని అమలు చేశారు..
 Transforming government schools with upgraded facilities for students   Government applies Nadu-Nedu Scheme for govt schools   Government school facilities improved under Nadu-Nedu scheme

సాక్షి ఎడ్యుకేషన్‌: ప్రభుత్వం నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసింది. అదనపు తరగతి గదులను నిర్మించడంతో పాటు సురక్షిత తాగునీరు, తరగతి గదులలో లైటింగ్‌, ఫ్యాన్‌లు, ప్రహరీలు, బెంచీలు, అధునాతన టాయిలెట్లు తదితర అన్ని సౌకర్యాలు కల్పించారు. పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు పెయింటింగ్‌ వేశారు.

Athletics: జాతీయ స్థాయిలో అథ్లెటిక్స్‌ కు ఎంపికైన విద్యార్థులు..

విద్యాకానుక పథకం ద్వారా విద్యార్థులకు యూనిఫాం, బ్యాగ్స్‌, షూస్‌, బెల్ట్‌, టై, ఇంగ్లీషు డిక్షనరీ, పుస్తకాలు, ల్యాప్‌టాప్‌లు ఉచితంగా అందిస్తున్నారు. జగనన్న గోరుముద్ద ద్వారా మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం పెడుతున్నారు. విద్యార్థులు ఆసక్తిగా పాఠశాలకు వచ్చి విద్యను అభ్యసిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించడంతో విద్యార్థుల సంఖ్య పెరిగింది.

Published date : 12 Feb 2024 08:25AM

Photo Stories