TSPSC Group 1 Prelims Exam: గ్రూప్–1 ప్రిలిమ్స్‌కు పకడ్బందీ ఏర్పాట్లు
కరీంనగర్: ఈనెల 11న గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్ష జిల్లాలో సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ ఆడిటోరియంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈనెల 11న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు నిర్వహించే పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. దివ్యాంగులకోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని సూచించారు. 34కేంద్రాల్లో 16,829మంది పరీక్ష రాయనున్నారని, అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. ఉదయం 10.15 తరువాత అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించరాదని ఆదేశించారు. ఎలక్ట్రానిక్ వాచ్, సెల్‌ఫోన్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరాదని ఆదేశించారు. పరీక్షకు ముందు ఓఎంఆర్ హాల్‌టికెట్‌పై బబ్లింగ్ గురించి అభ్యర్థులకు తెలియజేయాలని తెలిపారు. శిక్షణ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, ఆర్డీవో ఆనంద్‌కుమార్, ఏవో జగత్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.
చదవండి: టీఎస్పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ