Skip to main content

Child Aadhar Card : ఆన్‌లైన్‌లో పిల్లల ఆధార్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

మీ పిల్లలకు ఆధార్ కార్డు తీసుకోవచ్చని మీకు తెలుసా? పిల్లల కోసం ఆధార్ కార్డును జారీ చేయడానికి ప్రత్యేకంగా యూఐడీఏఐ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Aadhar Card Online Apply for Child
Aadhar Card Online Apply for Child

వీరికి ఇచ్చే ఆధార్‌ను బాల ఆధార్ కార్డ్ అని పిలుస్తున్నారు. ఐదేళ్ల లోపు పిల్లలకు నీలం రంగు గల ఉచితంగా బాల్ ఆధార్ కార్డు ఇస్తారు. అయితే, పిల్లల బయోమెట్రిక్స్ వారి వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లు బాల్ ఆధార్ కార్డుతో లింకు చేయబడవు. పిల్లలకు 5 ఏళ్లు నిండిన తర్వాత బయోమెట్రిక్స్ (ముఖ ఛాయాచిత్రం, ఐరిస్ స్కాన్, వేలిముద్రలు)ని ఆధార్ కార్డులో తప్పనిసరిగా నవీకరించాలి.

బాల్ ఆధార్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
పిల్లల ఆధార్‌ కోసం ముందు యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌ ( https://uidai.gov.in/ )కు వెళ్లి, ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. పిల్లల పేరు, తల్లిదండ్రుల ఫోన్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్ వంటి వివరాలను ఆధార్ ఎన్‌రోల్‌మెంట్‌ ఫారమ్‌లో నింపాలి. అనంతరం బుక్ అపాయింట్‌మెంట్ బటన్‌పై క్లిక్ చేసి, ఆధార్ కార్డు కోసం రిజిస్ట్రేషన్ తేదీని, ఆధార్ కేంద్రాన్ని తల్లిదండ్రులు ఎంపిక చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ బుకింగ్ తేదీ నాడు పిల్లల బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల ఆధార్ కార్డు ఫోటో కాపీలు, అన్ని పత్రాలతో పాటు రిఫరెన్స్ నంబర్ తీసుకొని నమోదు కేంద్రానికి వెళ్లాలి.

సంబంధిత ఆధార్ అధికారులు అన్ని పత్రాలను సరిచూస్తారు. పిల్లలకు 5 సంవత్సరాలు ఉంటే, అప్పుడు కేవలం వారి ఫోటో మాత్రమే ఆధార్‌ కార్డు కోసం తీసుకుంటారు. వీరి బయోమెట్రిక్ వివరాలను తీసుకోరు. ఐదేళ్ల కంటే ఎక్కువ వయసు ఉంటే మాత్రమే పిల్లల బయోమెట్రిక్ వివరాలను నమోదు చేస్తారు. అన్ని వివరాలను సరిచూసిన తర్వాత దరఖాస్తుదారునికి ఒక ఎకనాలెడ్జ్‌మెంట్ నంబర్‌ ఇస్తారు. దీని ద్వారా బాల్ ఆధార్ అప్లికేషన్ స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. నమోదు చేసుకున్న 60 రోజుల్లో దరఖాస్తుదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒక ఎస్ఎంఎస్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది. నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత 90 రోజుల్లో బాల ఆధార్ కార్డును మీరు పేర్కొన్న చిరునామాకు పంపిస్తారు.

How To Apply Voter ID Card: ఓటు హక్కు లేదా..? అయితే ఆన్‌లైన్‌లో ఇలా నమోదు చేసుకోండి..

ATM card Alert : ఏటీఎం కార్డు పోతే...వెంట‌నే ఇలా చేయండి..!

Pancard : మీ పాన్‌ కార్డ్‌ పోయిందా..! అయితే వెంటనే ఇలా చేయండి..!

Aadhar Card Address Change : ఆన్‌లైన్‌లోనే..ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకోండిలా..

Aadhar card update : మీ ఇంట్లో నుంచే ఈ లింక్ ద్వారా ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోండిలా..

Driving Licence : ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లకుండానే..ఆన్‌లైన్‌లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయండిలా..

e-Pan Card: కేవలం పది నిమిషాల్లోనే ఈ-పాన్ కార్డు పొందండి ఎలా..?

Published date : 12 Nov 2021 04:31PM

Photo Stories