Skip to main content

ATM card Alert : ఏటీఎం కార్డు పోతే...వెంట‌నే ఇలా చేయండి..!

ప్రస్తుతం చాలా మంది వారి జీవితంలో ఏటీఎం కార్డులను ఎక్కువగా ఉపయోగిస్తారు.
ATM card Alert
ATM Card

ఏటీఎం ద్వారా డబ్బు విత్ డ్రా చేయడంతో పాటు డిపాజిట్ చేయడం వంటి పనులు చాలా తేలిక అవుతున్నాయి. లావాదేవీల కోసం ఎక్కువగా వాడే ఏటీఎం కార్డు పోతే మాత్రం ఇక అంతే సంగతులు. ఎందుకంటే ఏటీఎం నుంచి డబ్బులు ఇతరులు తీసుకునే ఆస్కారం ఎక్కువ. అందుకే ఒకవేల మీ డెబిట్ కార్డు ఎక్కడైన పోతే వెంటనే ఈ క్రింద చెప్పిన విదంగా చేయండి. 
1. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా..:
మీ ఖాతాకు కనుక ఇంటర్నెట్ సదుపాయం ఉంటే చాలా మంచింది. దీని ద్వారా మీ కార్డును క్షణాలలో బ్లాక్ చేయవచ్చు. కార్డును బ్లాక్ చేయడానికి మొదట ఇంటర్నెట్ బ్యాంకింగ్‌కు వెళ్లి లాగిన్ అవ్వండి. ఆ తర్వాత డెబిట్ కార్డ్ ఆప్షన్ ఎంపిక చేసుకోండి. ఇక్కడ మీరు పోయిన డెబిట్ కార్డ్ నంబర్‌ను వివరాలు సమర్పించండి. ఇప్పుడు బ్లాక్ యువర్ డెబిట్ కార్డ్ ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా మీ కార్డును బ్లాక్ చేయవచ్చు. కార్డు బ్లాక్ చేయడం వల్ల ఎవరూ మీ డబ్బును తీసుకోలేరు.

2. మొబైల్ బ్యాంకింగ్ యాప్ ద్వారా..:
మీరు మొబైల్ బ్యాంకింగ్ యాప్ సహాయంతో మీ కార్డును బ్లాక్ చేయవచ్చు. ఇందుకోసం మీ బ్యాంక్ యాప్‌ను మొబైల్‌లో ఓపెన్ చేయండి. ఇప్పుడు మీకు కార్డ్ ఆప్షన్‌కు వెళ్లి మీ డెబిట్ కార్డును బ్లాక్ చేసే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ డెబిట్ కార్డు బ్లాక్ అవుతుంది.

3. హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయండి :
మీరు బ్యాంక్ హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా కూడా మీ ఏటీఎం కార్డును బ్లాక్ చేయవచ్చు. హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసిన తర్వాత మీ ఏటీఎం, బ్యాంక్ ఖాతా నంబర్‌ వివరాలు పేర్కొనాలి. మీరు చివరిగా డబ్బులు ఎప్పుడు తీశారో తెలియజేయాల్సి ఉంటుంది. ధృవీకరణ తర్వాత మీ కార్డ్ బ్లాక్ చేయబడుతుంది.

4. ఎఫ్ఐఆర్ దాఖలు చేయండి :
మీ ఏటీఎం కార్డు ఎవరైనా దొంగలించినట్లు మీకు అనిపిస్తే వెంటనే ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి. దీనికోసం మీరు కార్డు దొంగతనం జరిగిన సమీప పోలీసు స్టేషన్‌కు వెళ్లి నివేదించాలి. ఎఫ్ఐఆర్ కాపీ రిజిస్టర్ చేసిన తర్వాత మీకు ఇస్తారు. ఈ కాపీని భవిష్యత్ ఉపయోగం కోసం ఉంచాలి.

Pancard : మీ పాన్‌ కార్డ్‌ పోయిందా..! అయితే వెంటనే ఇలా చేయండి..!

Aadhar Card Address Change : ఆన్‌లైన్‌లోనే..ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకోండిలా..

Aadhar card update : మీ ఇంట్లో నుంచే ఈ లింక్ ద్వారా ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోండిలా..

Published date : 28 Oct 2021 07:39PM

Photo Stories