Good News : ఆన్‌లైన్‌లో..(లేదా) మీ ఫోన్ నెంబర్ ద్వారా..పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండిలా..
ఈ మేరకు ఈపీఎఫ్‌ఓ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొంది. ఈపీఎఫ్ఓ ప్రస్తుతం పీఎఫ్ పెట్టుబడులపై 8.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. ఈపీఎఫ్ఓ 2020-21 సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సభ్యుల ఖాతాలకు వడ్డీ రేటును అక్టోబర్ 30వ తేదీన ఇచ్చిన సర్క్యులర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే.
డిపాజిట్ల కంటే ఎక్కువగా..
ఈ ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల కంటే ఎక్కువ విత్ డ్రా ఉన్నందున 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటును రిటైర్ మెంట్ ఫండ్ రెగ్యులేటరీ బాడీ మార్చకుండా ఉంచింది. దేశంలో కరోనావైరస్ వ్యాప్తి తర్వాత ఈపీఎఫ్ఓ మార్చిలో 2019-20 సంవత్సరానికి వడ్డీ రేటును ఏడు సంవత్సరాల కనిష్టస్థాయికి(8.5 శాతం) తగ్గించింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీరేటు 8.65 శాతంగా ఉంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.55 శాతం కాగా, 2016-17 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ ఖాతాదారులకు ఇచ్చిన ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.65 శాతంగా ఉంది.
ఆన్‌లైన్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి ఇలా..
☛ ఈపీఎఫ్ పోర్టల్ https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login లింకు మీద క్లిక్ చేయండి.
☛ ఇప్పుడు మీ ఖాతా ఓపెన్ చేయడానికి మీ యుఎఎన్ నెంబర్, పాస్ వర్డ్ నమోదు చేయండి.
☛ సైన్ ఇన్ చేసిన తర్వాత మీరు మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
మొబైల్ నెంబర్ నుంచి..
ఈపీఎఫ్ ఖాతాదారులు ఒక్క మెస్సేజ్ ద్వారా ఖాతాదారులకు పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. మీ మొబైల్ ద్వారా EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899కు మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మెస్సేజ్ చేయాలి. పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్, చివరి ఇన్‌స్టాల్ మెంట్ వివరాలు అందుతాయి. ఈపీఎఫ్ ఖాతాలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు.
ATM Money Withdrawal Alert : జనవరి 1, 2022 నుంచి ఖాతాదారులకు షాక్..?
Money Transfer with Aadhar Card : ఆధార్ నెంబర్‌తో మనీ ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు..ఇలా