Skip to main content

Aadhar card update : మీ ఇంట్లో నుంచే ఈ లింక్ ద్వారా ఆధార్ కార్డు అప్‌డేట్ చేసుకోండిలా..

నకిలీ వ్యవహారాలు మామూలు జనాలకు పెద్ద ఇబ్బందులే తెచ్చిపెడుతున్నాయి.

ఈ క్రమంలో ప్రతీదానికి ముడిపడి ఉన్న ఆధార్‌ విషయంలోనూ ఫేక్‌ కుంభకోణాలు కనిపిస్తున్నాయి. కొత్తగా ఆధార్‌ తీసుకుంటున్నవాళ్లు, లేదంటే మధ్యవర్తి ద్వారా కార్డులు సంపాదించుకుంటున్న వాళ్లు.. తమ 12 డిజిట్‌ నెంబర్లను ఆధార్‌ నెంబర్‌గా ఫిక్స్‌ అయిపోయి అన్నిచోట్లా సమర్పిస్తుంటారు. అయితే ఈ విషయంలో యూఐడీఏఐ ప్రజల కోసం ఓ అలర్ట్‌ను జారీ చేసింది.
  

ఈ లింక్ ద్వారా..
ఆధార్‌ను ఎక్కడైనా సమర్పించే ముందు అసలేనా? నకిలీనా? ఒక్కసారి తనిఖీ చేస్కోమని చెప్తోంది. లేకుంటే ఇబ్బందులు తప్పవని చెబుతోంది. ఇందుకోసం resident.uidai.gov.in/verify లింక్‌కు వెళ్లాలి. ఆపై కార్డుపై ఉన్న 12 అంకెల డిజిట్‌ను ఎంటర్‌ చేయాలి. కింద ఉన్న సెక్యూరిటీ కోడ్‌ లేదంటే క్యాప్చాను క్లిక్‌​ చేసి వెరిఫై కొట్టాలి.  అప్పుడు ఆ ఆధార్‌ నెంబర్‌ ఒరిజినలేనా? అసలు ఉందా? అనే వివరాలు కనిపిస్తాయి.
 

Aadhar Card Update


దీనికి మాత్రం తప్పనిసరిగా..
చాలామంది ఆధార్‌ అప్‌డేట్స్‌, మార్పుల విషయంలో గందరగోళానికి గురవుతుంటారు. కానీ, చిన్న చిన్న మార్పులు, సవరణల కోసం ఆన్‌లైన్‌లోనే వెసులుబాటు కల్పిస్తోంది యూఐడీఏఐ. ఇక అప్‌డేషన్‌, మొత్తంగా మార్పుల కోసం మాత్రం తప్పనిసరిగా ఎన్‌రోల్‌మెంట్‌ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందే. 

► ఆధార్‌ కార్డ్‌పై  అడ్రస్‌ సవరణ కోసం ఆన్‌లైన్‌లో వెసులుబాటు కల్పించింది యూఐడీఏఐ
► అడ్రస్‌ మార్పు కోసం ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ అంటే.. దగ్గర్లోని ఆధార్‌ సెంటర్‌ ఈ సౌకర్యం కల్పిస్తోంది. సవరించడం ఎలాగో తెలుసా?
► ఫొటో మార్చుకోవడానికి కూడా రీజియన్‌ సెంటర్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నిమిషాల్లో ఫొటో మార్చుకోవచ్చు.
► ఆధార్‌ కార్డు మీద పేరును రెండు సార్లు మార్చుకోవడానికి వీలుంటుంది. 
► డేట్‌ ఆఫ్‌ బర్త్‌, జెండర్‌(ఆడ/మగ/ట్రాన్స్‌జెండర్‌) ఒక్కసారే మారతాయి. 
► జెండర్‌ మార్పునకు ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదు. 
► మొబైల్‌ నెంబర్‌కు తప్పనిసరిగా లింక్‌ అయ్యి ఉండాలి. లేదంటే మార్పులేవీ జరగవు.
► ఒకవేళ మొబైల్‌ నెంబర్‌ వేరే వాళ్లది ఉన్నా.. పాత నెంబర్‌ను మార్చుకోవాలనుకున్నా అప్‌డేట్‌ చేసుకోవచ్చు. స్థానిక పోస్ట్ మ్యాన్ లేదా పోస్టు మాస్టర్ కు ఫోన్ చేసి కోరితే ఇంటికే వచ్చి ఈ సేవలు అందిస్తారు. అయితే ప్రధాన పట్టణాల్లో మాత్రమే ఇది అమలు అవుతుండడం విశేషం. గ్రామీణ ప్రాంతాల వాళ్లు మాత్రం మండల కేంద్రాలకు ‘క్యూ’ కట్టాల్సి వస్తోంది.
 ► సెల్ఫ్‌  సర్వీస్‌ అప్‌డేట్‌ పోర్టల్‌ ద్వారా (SSUP) https://ssup.uidai.gov.in/ssup/ లింక్‌ క్లిక్‌ చేసి సంబంధిత స్కాన్‌ డాక్యుమెంట్లు సమర్పించి చిన్న చిన్న మార్పులు చేసుకునే వీలు మాత్రమే. సెల్ఫ్‌ సర్వీస్‌ పోర్టల్‌ ద్వారా యాభై రూపాయలు ఛార్జ్‌ చేస్తారు. 
► ముఖ్యమైన విషయం ఏంటంటే.. పేరు, అడ్రస్‌, డేట్‌ ఆఫ్‌ బర్త్‌, జెండర్‌, మొబైల్‌​నెంబర్‌, ఈ-మెయిల్‌, ఫింగర్‌ ఫ్రింట్స్‌, ఐరిస్‌, ఫొటోగ్రాఫ్‌.. ఇలాంటి వివరాల అప్‌డేషన్‌ కోసం పర్మినెంట్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సెంటర్‌ను సంప్రదించాల్సిందే.
 ► సంబంధిత ఫామ్స్ అన్నీ యూఐడీఏఐ వెబ్‌సైట్‌లోనే దొరుకుతాయి కూడా.

ఒకవేళ పొరపాటున పరిమితులు మించిపోతే ఎలా..? 
ఆ టైంలో ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ లేదంటే అప్‌డేట్‌ సెంటర్‌ను సంప్రదించడం ఉత్తమం.  అక్కడ తప్పిదానికి గల కారణాలు, వివరణలు, పొరపాట్ల సవరణకు సంబంధించిన వివరాలు, సరైన ప్రూవ్స్‌ సేకరిస్తారు( సంబంధిత ఫామ్స్‌ ద్వారా). ఆ వివరాలన్నింటిని హెల్ప్‌ డెస్క్‌కు పంపిస్తారు. అవసరం అయితే ఆఫీసులకు పిలుస్తారు. ఆపై వెరిఫికేషన్‌ ప్రాసెస్‌ మొదలవుతుంది. అవసరం అనుకుంటే అదనపు ఇన్వెస్టిగేషన్‌ జరుగుతుంది. అప్పుడు అప్‌డేట్‌ లేదంటే మార్పులకు జెన్యూన్‌ రీజన్‌ అని తెలిస్తేనే.. ఆ రిక్వెస్ట్‌ను టెక్‌ సెంటర్‌కు ప్రాసెసింగ్‌/రీప్రాసెసింగ్‌ పంపిస్తారు. ఈ ప్రాసెస్‌ సాగడానికి కచ్చితంగా ఎన్నిరోజులు పడుతుందనేది చెప్పలేం. ఒక్కోసారి ప్రాసెస్‌ మధ్యలోనే ఆగిపోయినా ఆగిపోవచ్చు!.


ఆధార్ కార్డు చిరునామాని ఆన్‌లైన్‌లో సవరించడం ఎలా..?
మీరు కొత్త ఇంటికి మారరా? ఆధార్ కార్డు ఇంకా చిరునామాని చేంజ్ చేయలేదా? అయితే, ఇప్పుడు సులభంగానే ఇంట్లో నుంచే ఆధార్ కార్డులో చిరునామాని మార్చవచ్చు. ఆధార్ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్ ద్వారా ఆధార్ యూజర్ కొన్ని వివరాలను అప్ డేట్ చేయవచ్చు. ఆధార్ కార్డుదారులు స్వీయ సేవా పోర్టల్ ద్వారా చిరునామాను అప్ డేట్ చేయవచ్చు అని ఆధార్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ చేసింది. "మీరు ఇప్పుడు చిరునామాని ఆధార్ సెల్ఫ్ సర్వీస్ అప్ డేట్ పోర్టల్ ద్వారా అప్ డేట్ చేయవచ్చు" అని ట్వీట్ లో పేర్కొంది. 

Aadhar card address update

ఈ సేవను ఉపయోగించుకోవాలంటే ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబరును కలిగి ఉండాలని ఆధార్ యూజర్ గమనించాలి. అలాగే, ఆన్‌లైన్‌ పోర్టల్ ద్వారా అప్ డేట్ చేసినందుకు రూ.50 చార్జి చెల్లించాలి. సెల్ఫ్ సర్వీస్ ఆన్ లైన్ పోర్టల్ చిరునామాను అప్ డేట్ చేయడం కొరకు యుఐడీఎఐ వెబ్‌సైట్‌లో పేర్కొన్న పాస్ పోర్ట్, బ్యాంక్ పాస్ బుక్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్ ల కాపీని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

ఆధార్‌కార్డులో చిరునామాని ఇలా సవరించండి:
☛ముందుగా ఈ https://ssup.uidai.gov.in/ssup/ లింకును ఓపెన్ చేయాలి.
☛ అందులో ఫ్రోసిడ్‌ టూ ఆప్‌డేట్‌ ఆధార్‌ను క్లిక్‌ చేయాలి.
☛ఆప్‌డేట్‌ ఆధార్‌ ఆన్‌లైన్‌ను క్లిక్‌ చేసిన తరువాత 12 అంకెల ఆధార్‌ నంబర్‌ను ఎంటర్‌ చేసి కాప్చా కోడ్‌ను ఎంటర్‌ చేయాలి. 
☛ తరువాత సెండ్‌ ఓటీపీ మీద క్లిక్‌ చేయాలి. ఆధార్‌తో లింక్‌ ఐనా ఫోన్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
☛ మొబైల్‌కు వచ్చిన 6 అంకెల వన్‌ టైం పాస్‌వర్డ్‌ను ఎంటర్‌ చేసి లాగిన్‌ అవ్వాలి. 
☛ ఇప్పుడు డెమోగ్రాఫిక్ ఆప్షన్ ఎంచుకొని మీ కొత్త చిరునామా వివరాలు సమర్పించాలి.
☛ పీపీఎ డాక్యుమెంట్ ల మీ ఒరిజినల్ కలర్ స్కాన్ డ్ కాపీలను అప్ లోడ్ చేయండి.
☛ నమోదు చేసిన డేటాను ఇంగ్లిష్, స్థానిక భాషలో కనిపిస్తుంది. 
ఇప్పుడు అభ్యర్థనను సబ్మిట్ చేయండి. మీ ఆధార్ అప్ డేట్ స్టేటస్ ట్రాక్ చేయడం కొరకు మీరు మీ అప్ డేట్ రిక్వెస్ట్ నెంబరు(ఆర్ ఎన్ ఆర్ ఎన్)ని సేవ్ చేసుకోవాలి.

ఇంట్లో నుండే ఆధార్ అప్‌డేట్ చేసుకోవ‌డం ఎలా..?
కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో మనకి ఇంటి నుంచి బయటకి వెళ్లాలంటే భయం వేస్తుంది. ఏదైనా ప్రభుత్వ సేవల కోసం ప్రభుత్వాల కార్యాలయాలకు వెళ్లాలంటే మరి ఈ భయం ఎక్కువగా ఉంది. అందుకే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యుఐడీఎఐ) ఒక ముఖ్యమైన అప్డేట్ తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఇప్పుడు మీరు ఆధార్ కేంద్రాన్ని సందర్శించకుండా మీ పేరు, పుట్టిన తేదీ, లింగం, చిరునామా, భాషను ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకోవచ్చు అని యుఐడీఎఐ ఒక ట్వీట్‌లో పేర్కొంది. మిగతా సేవల అప్‌డేట్ కోసం ఆధార్ సేవా కేంద్రం లేదా నమోదు కేంద్రాన్ని సందర్శించాలి అని తెలిపింది.

Update

ఇలా అప్డేట్ చేసుకోండి.. 
స్టెప్ 1: ఆధార్ కార్డ్ అధికారిక వెబ్‌సైట్(uidai.gov.in)‌ను సందర్శించండి. 
స్టెప్ 2: మై ఆధార్ సెక్షన్ లోకి వెళ్లి 'అప్‌డేట్ డెమోగ్రాఫిక్ డేటా ఆన్లైన్'పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: తర్వాత 'ప్రొసీడ్ టూ అప్‌డేట్ ఆధార్'ని ఎంచుకోండి.
స్టెప్ 4: ఇప్పుడు మీ ఆధార్ ధార్ కార్డు నంబర్‌, కాప్చా కోడ్ ని ఎంటర్ చేయండి.  
స్టెప్ 5: మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి.   
స్టెప్ 6: ఇప్పుడు మీకు కనిపించే 'అప్‌డేట్ డామోగ్రాఫిక్ డేటా' సెలెక్ట్ చేసుకోండి.
స్టెప్ 7: తర్వాత ట్యాబ్ లో పేరు, చిరునామా, పుట్టిన తేదీ, లింగం, వంటి ఆప్షన్స్ మీకు కనిపిస్తాయి. 
స్టెప్ 8: ఇప్పుడు పైన చెప్పిన వాటిలో మీరు నవీకరించాలనుకుంటున్న దాన్ని ఎంచుకోండి.
స్టెప్ 9: అన్ని వివరాలను నింపిన తరువాత, ఐడిని అడ్రస్ ప్రూఫ్‌గా అప్‌లోడ్ చేయాలి. దీన్ని ఏ ఫార్మాట్‌లోనైనా పీడీఎఫ్, జేపిఇజి లేదా పీఎన్‌జీలో అప్‌లోడ్ చేయవచ్చు.
స్టెప్ 10: డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా రూ. 50 ఆన్‌లైన్ చెల్లించండి.
స్టెప్ 11: ఆన్‌లైన్ చెల్లింపు విజయవంతం అయ్యాక మీకు వెంటనే నిర్ధారణ కోసం మొబైల్ నంబర్‌కు URN కోడ్ వస్తుంది.


ఆధార్‌ కార్డ్‌ మీద ఫోటో నచ్చలేదా..అయితే ఇలా మార్చుకోండి..
మన గుర్తింపునకు ఆధార్‌ కార్డ్‌ తప్పనిసరి అయ్యింది. కానీ ఆధార్‌ కార్డులో ఉండే ఫోటోలు చూస్తే.. మనమా కాదా అని డౌట్‌ వస్తుంది. అంత చిత్రవిచిత్రమైన ఫోటో ఎలా తీశారబ్బ అనే అనుమానం కూడా కలగకమానదు. ఇక ఆధార్‌ కార్డు మీద ఫోటోల మీద బోలెడు మీమ్స్‌. కానీ ఏం చేస్తాం.. మనకు నచ్చినా, నచ్చకపోయినా ఆ ఫోటోతేనే అడ్జస్ట్‌ కావాలి. కొన్ని సార్లు గుర్తుపట్టరాని విధంగా ఉన్న ఫోటోలతో సమస్యలు ఎదుర్కొన్న వారు కూడా ఉన్నారు. కానీ ఈ సమస్యకు ఇప్పుడు పరిష్కారం దొరికింది. ఆధార్‌కార్డ్‌ మీద ఫోటోని మార్చుకోవచ్చు. అదెలాగంటే.. 

Photo Update

ఆధార్‌ కార్డ్‌లో ఫోటో మార్చి.. కొత్త దాన్ని అప్‌లోడ్‌ చేయాలంటే.. 
►ఆధార్‌ కార్డ్‌ మీద ఫోటో మార్చడం కోసం ఒక ఫామ్‌ నింపాల్సి ఉంటుంది. దీన్ని కూడా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ నుంచి సులభంగా యాక్సెస్ చేసుకుని, డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
►మీ ఫోటోను మార్చడానికి మీరు మీ ప్రాంతంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లాలి.
►ఇందుకోసం అవసరమైన ఫీజు చెల్లించాలి.
►ఆధార్ నమోదు కేంద్రంలోని సంబంధిత అధికారి మీ  కొత్త ఫోటోను క్లిక్ చేసి, మీ ఆధార్ కార్డుకు అప్‌లోడ్ చేస్తారు.
►ఆ తర్వాత నిర్ణీత వ్యవధిలోగా మీ ఆధార్‌ కార్డ్‌ మీద కొత్త ఫోటో వస్తుంది.

Published date : 08 Oct 2021 01:00PM

Photo Stories