Dark Earth: భూమిపై డార్క్ ఎర్త్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు
తాజాగా ఎంఐటీ, యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా, బ్రెజిల్ పరిశోధకులు అమెజాన్‌లో డార్క్ ఎర్త్‌ను కనుగొన్నారు. డార్క్ ఎర్త్ పేరుతో సారవంతమైన భూమిని రూపొందించేందుకు పురాతన అమెజోనియన్లు ప్రయత్నించారని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ఇటీవలి కాలంలో చేపడుతున్న వాతావరణ మార్పు ఉపశమన ప్రయత్నాలపై ఎంతో ప్రభావం చూపనుంది.
Dholpur-Karauli Tiger Reserve: ధోల్‌పూర్-కరౌలీ టైగర్ రిజర్వ్‌కు ఆమోదం
పచ్చని వృక్షసంపద, వర్షపాతానికి ప్రసిద్ధి చెందిన అమెజాన్‌లోని ఈ డార్క్ ఎర్త్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పురాతన మానవ స్థావరాల చుట్టూ ఉన్న నల్లని, సారవంతమైన మట్టిని పురావస్తు శాస్త్రవేత్తలు డార్క్ ఎర్త్ అని పిలుస్తారు. ఈ నేలను ఉద్దేశపూర్వకంగా తయారు చేశారా లేక ఇది పురాతన సంస్కృతుల ప్రతిబింబమా అనేది స్పష్టంగా తొలుత తెలియరాలేదు. ఈ పరిశోధనా బృందం.. మట్టి విశ్లేషణ, ఎథ్నోగ్రాఫిక్ ప్రతిస్పందనలు, ఆధునిక స్వదేశీ కమ్యూనిటీల సాయంతో పలు వివరాలు సేకరించి, డార్క్ ఎర్త్‌ను పురాతన అమెజోనియన్లు ఉద్దేశపూర్వకంగానే తయారు చేశారని నిరూపించారు.
డార్క్ ఎర్త్‌ను తయారు చేయడంలో నాటి ప్రజలు ప్రముఖ పాత్ర పోషించారని, దానిని మానవ జనాభా నివాసానికి అనువైన ప్రదేశంగా మార్చడానికి, వాతావరణాన్ని ఎంతో చొరవతో సవరించారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎంఐటీకి చెందిన ఎర్త్, అట్మాస్ఫియరిక్ ప్రొఫెసర్ టేలర్ పెర్రోన్ మాట్లాడుతూ డార్క్ ఎర్త్‌లో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఈ భూమిలో భారీ మొత్తంలో నిల్వఅయిన కార్బన్ ఉంది. ఇది వేల సంవత్సరాలుగా ఈ భూమిలో పేరుకుపోయింది. తరతరాల ప్రజలు తమ ఆహార వ్యర్థాలు, బొగ్గు, చెత్తతో ఈ మట్టిని సారవంతం చేశారన్నారు.
Continents of the World: 7 ఖండాలు కాదు.. ఏక ఖండమే..!
సైన్స్ అడ్వాన్సెస్‌లో ప్రచురితమైన నివేదికను ఆగ్నేయ అమెజాన్‌లోని ఎగువ జింగు నది పరీవాహక ప్రాంతంలోని క్యూకురో ప్రాంతం నుంచి సేకరించిన డేటా ఆధారంగా రూపొందించారు. పరిశోధకులు మట్టి నిర్వహణలో క్యూకురో పద్ధతులను అవగాహన చేసుకునేందుకు ప్రయత్నించారు. చెత్త, ఆహార స్క్రాప్‌ల కుప్పలు కంపోస్ట్ ఎరువు కుప్పల మాదిరిగానే ఉంటాయి. ఇవి కుళ్ళిపోయి మట్టిలో కలిసి, సారవంతమైన నేలను ఏర్పరుస్తాయి. ఈ డార్క్‌ఎర్త్ అభ్యాసాలను డాక్యుమెంట్ చేయడానికి పరిశోధకులు గ్రామస్తులతో ఇంటర్వ్యూలు కూడా చేపట్టారు. గ్రామస్తులు ఈడార్క్ ఎర్త్‌ను ఇగెపె అని పిలుస్తారు. వ్యవసాయ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, సారవంతమైన మట్టి రూపకల్పనకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని గ్రామస్తులు తెలిపారు.