Skip to main content

AP News: దేశంలోనే రికార్డు... కేవలం 39 నిమిషాల్లో ఆరోగ్ర శ్రీ కార్డు

ఆరోగ్య శ్రీ.. వేలాది ప్రాణాలకు కాపలా. లక్షలాది మంది సామాన్యులకు సంజీవని. వైఎస్సార్‌ నుంచి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వరకు అందరికీ మానస పుత్రిక. ఈ పథకం ఎందుకంత కీర్తి సంపాదించిందో మరో మారు నిరూపితమైంది. దీంతో పాటు ప్రభుత్వ చిత్తశుద్ధి కూడా అందరికీ తెలిసింది.
YS Jagan

రోడ్డు ప్రమాదానికి గురవడంతో...
ఇచ్ఛాపురం పట్టణం ఫకీరుపేట వార్డు సచివాలయానికి చెందిన వలంటీర్‌ వర్రి సింహాచలం సోమవారం ద్విచక్ర వాహనంపై జాతీయ రహదారిపై వెళ్తుండగా, మందస హైవేపై రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు, కుటుంబ సభ్యులు సింహాచలంను విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఫోన్‌లోనే వివరాలు...
సింహాచలంకు అంతవరకు ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో ఉచితంగా చికిత్స చేయడం కుదరలేదు. అసలే వారిది పేద కుటుంబం.. సమయానికి చేతిలో డబ్బు లేకపోవడంతో బాధితుడి బంధువులు ఈ విషయాన్ని సీడాప్‌ చైర్మన్‌ సాడి శ్యామ్‌ప్రసాద్‌ రెడ్డి దృష్టికి తెచ్చారు.

Simhachalam

ఆయన తక్షణమే స్పందించి బాధితుని వివరాలు నమోదు చేసుకుని వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ అడిషనల్‌ సీఈఓకు ఫోన్‌  చేసి వివరాలు చెప్పారు. వెంటనే హెల్త్‌ కార్డు మంజూరు చేయాలని కోరారు. 
కేవలం 39 నిమిషాల్లోనే కార్డు...
మధ్యాహ్నం 1.53 గంటలకు ఆయన ఫోన్‌  చేస్తే కేవలం 39 నిమిషాల్లో అంటే మధ్యాహ్నం 2.32 గంటలకు ఆరోగ్య శ్రీ కార్డు రెడీ అయిపోయింది. ఆ కార్డు సాయంతో సింహాచలంకు సకాలంలో ఉచితంగానే కార్పొరేట్‌ వైద్యం చేయగలిగారు. సకాలంలో స్పందించి తమకు సాయం చేసిన ప్రభుత్వానికి సింహాచలం కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’ పథకం పేదలకు సంజీవని అని కొనియాడారు.

చ‌ద‌వండి: దేశంలోనే టాప్‌లో ఏపీ... స్వచ్ఛ జల్‌ సే సురక్షలో రెండో స్థానం

చ‌ద‌వండి: రెండు నెలల్లో వైజాగ్‌ రాజధాని... టార్గెట్‌ ఐటీ హబ్‌

Published date : 24 Jan 2023 01:10PM

Photo Stories