Skip to main content

Ap grama and ward volunteer jobs: గ్రామ, వార్డు వాలంటీర్ల ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

Eligibility: Age 18-35, Vacant volunteer posts, District vacancies, Qualification: Pass 10th standard, Grama and ward volunteer jobs, Mandal Parishad Development Officers,
Grama and ward volunteer jobs

నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో ఖాళీగా ఉన్న వలంటీర్‌ పోస్టుల భర్తీకి సంబంధిత మండల పరిషత్‌ అభివృద్ధి అధికారులు దరఖాస్తులు ఆహ్వానించాలని కలెక్టర్‌ ఎం.హరినారాయణన్‌ ఆదేశించారు.

సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 147 వలంటీర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, నోటిఫికేషన్‌ ఇచ్చే నాటికి ఉన్న ఖాళీలను దృష్టిలో పెట్టుకుని భర్తీ చేస్తామని తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల లోపు వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణులై వారు అర్హులని తెలిపారు.

మంగళవారం నుంచి 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు స్వీకరిస్తారని, 9న దరఖాస్తుల పరిశీలన, 10న ఇంటర్వ్యూల నిర్వహణ పూర్తి చేసి ఎంపికై న వారికి 13వ తేదీన నియామక పత్రాలు అందజేయాలని తెలిపారు.

Published date : 08 Nov 2023 07:47AM

Photo Stories