GATE 2022: ఆన్సర్ కీ విడుదల.. అభ్యంతరాలు స్వీకరణకు చివరి తేదీ ఇదే..
ఐఐటీ ఖరగ్‌పూర్ కీ విడుదలపై ప్రకటన విడుదల చేసింది. గేట్ పరీక్ష ఈ ఏడాది ఫిబ్రవరి 5 నుంచి 13 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన అధికారిక ఆన్సర్ కీ విడుదలైంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://gate.iitkgp.ac.in/ నుంచి ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆన్సర్ కీలో ఏవైనా అభ్యంతరాలుంటే ఫిబ్రవరి 22 నుంచి ఫిబ్రవరి 25లోపు సవాళ్లను చేయటానికి ఐఐటీ ఖరగ్‌పూర్ అవకాశం కల్పించింది. అభ్యర్థి లేవనెత్తే ప్రతి అభ్యంతరానికి రూ. 500 ఫీజును తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుంది. పరీక్షకు సంబంధించిన తుది ఫలితాలు మార్చి 17 న విడుదల కానున్నాయి.
చదవండి:
GATE-2022: గేట్.. గెలుపు బాట ఇలా!
GATE 2022: ఉన్నత విద్యావకాశాలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలనూ సొంతం చేసుకోవచ్చు
గేట్ 2022లో కొత్తగా మరో రెండు కొత్త పేపర్లు.. పరీక్ష విధానం ఇదే..