GATE Exam 2025 : ఫిబ్రవరి 2025లో గేట్.. దీని స్కోర్‌తోనే ఎంటెక్, పీహెచ్‌డీతోపాటు పీఎస్‌యూ జాబ్స్!
అంతేకాకుండా గేట్ స్కోర్‌తో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలను కూడా దక్కించుకోవచ్చు. తాజాగా గేట్ 2025 షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో.. గేట్–2025 వివరాలు, గేట్ స్కోర్‌తో ప్రయోజనాలు, బెస్ట్ స్కోర్ సాధించడానికి మార్గాలు తదితర వివరాలు..
ఐఐటీలు, ఎన్‌ఐటీలు, జీఎఫ్‌టీఐలే కాకుండా.. రాష్ట్ర స్థాయిలోనూ ఎంటెక్ ప్రవేశాల్లో గేట్ విద్యార్థులకు తొలి ప్రాధాన్యం ఉంటుంది. పీఎస్‌యూలు కూడా గేట్ స్కోర్‌తో ఎంట్రీ లెవల్ ఇంజనీరింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. దీంతో జాతీయ స్థాయిలో లక్షల మంది ఈ పరీక్షకు హాజరవుతున్నారు. ఏటా ఎనిమిది లక్షలకు పైగా అభ్యర్థులు గేట్ రాస్తున్నట్లు అంచనా.
job calendar 2024: జాబ్ కేలండర్ ప్రక్రియ వేగవంతం చేస్తాం ..... 11 వేల టీచర్ పోస్టులను భర్తీ
నిర్వహణ.. ఐఐటీ–రూర్కీ
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ పరీక్షను ప్రతి ఏటా ఒక ఐఐటీ నిర్వహిస్తుంది. గేట్–2025 నిర్వహణ బాధ్యతలు ఐఐటీ–రూర్కీకి అప్పగించారు. దీంతో.. సంబంధిత వర్గాలు గేట్–2025 వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చాయి. అదే విధంగా అభ్యర్థుల సౌలభ్యం కోసం పరీక్ష షెడ్యూల్, సిలబస్, గేట్ గత పరీక్ష పేపర్లను సైతం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
మొత్తం 30 పేపర్లు
గేట్–2025 పరీక్షను మొత్తం 30 పేపర్లలో నిర్వహించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వీటిలో ఇంజనీరింగ్‌తోపాటు ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్, హ్యుమానిటీస్ సబ్జెక్ట్‌లు కూడా ఉండడం విశేషం. పలు ఐఐటీల్లో ఇటీవల కాలంలో సోషల్ సైన్సెస్ విభాగాల్లోనూ పీజీ కోర్సులను అందిస్తున్నారు. గేట్ స్కోర్ ఆధారంగానే ఆ సీట్లను భర్తీ చేయాలని నిర్ణయించారు. దీంతో గేట్‌లో ఎక్స్‌హెచ్ పేరుతో హ్యుమానిటీస్‌కు సంబంధించిన సబ్జెక్ట్‌లో పరీక్ష కూడా నిర్వహిస్తున్నారు.
UG and PG Course Admissions : కోయంబత్తూర్‌లోని ఈ స్కూల్‌లో యూజీ, పీజీ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు..
అర్హతలు
ప్రస్తుత విద్యా సంవత్సరం (2024–25)లో బీటెక్, ఇతర గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు మూడు, నాలుగు సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులు గేట్ 2025కు దరఖాస్తుకు అర్హులు.
వంద మార్కులకు పరీక్ష
గేట్–2025 పరీక్ష మొత్తం మూడు గంటల వ్యవధిలో ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తారు. మొత్తం వంద మార్కులకు పరీక్ష ఉంటుంది. రెండు విభాగాల్లో 65 ప్రశ్నలు అడుగుతారు. పార్ట్–1లో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి.
ఈ విభాగానికి 15 మార్కులు కేటాయిస్తారు. ఇందులో ఒక మార్కు ప్రశ్నలు అయిదు, రెండు మార్కుల ప్రశ్నలు అయిదు ఉంటాయి. ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్‌లో 13 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్ట్‌తో పార్ట్–బిని నిర్వహిస్తారు. ఈ విభాగంలో 72 మార్కులకు ప్రశ్నలు అడుగుతారు. ఇలా మొత్తం 100 మార్కులకు గేట్ పరీక్ష జరుగుతుంది.
Posts at Bank of Maharashtra : బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రాలో వివిధ పోస్టుల్లో భర్తీకి దరఖాస్తులు.. చివరి తేదీ!
ప్రశ్నల తీరు ఇదే
గేట్ పరీక్షలో మూడు రకాల ప్రశ్నలు ఉంటాయి. అవి.. మల్టిపుల్ ఛాయిస్ కొశ్చన్స్ (ఎంసీక్యూ), మల్టిపుల్ సెలక్ట్ కొశ్చన్స్ (ఎంఎస్‌క్యూ), న్యూమరికల్ ఆన్సర్ టైప్ (ఎన్‌ఏటీ) ప్రశ్నలు. ఎంసీక్యూ విధానంలో నాలుగు లేదా అయిదు ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్‌ను సమాధానంగా గుర్తించాల్సి ఉంటుంది. మల్టిపుల్ సెలక్ట్ కొశ్చన్స్ విధానంలో ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు సమాధానంగా ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే..సంబంధిత టాపిక్‌పై పూర్తి స్థాయిలో అవగాహన కలిగుండాలి. న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలు కొంత కాలిక్యులేషన్స్‌తో కూడినవిగా ఉంటాయి.
పీఎస్‌యూ జాబ్స్
గేట్ స్కోర్ ఆధారంగా ఐఐటీ, ఎన్‌ఐటీ, ఇతర ఇన్‌స్టిట్యూట్స్‌లలో ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీలలో ప్రవేశాతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు. పీఎస్‌యూలు గత కొన్నేళ్లుగా గేట్ స్కోర్ ఆధారంగా నియామకాలు చేపడుతున్నాయి. ఇందుకోసం అభ్యర్థులు ఆయా సంస్థలు విడుదల చేసే నోటిఫికేషన్లకు అనుగుణంగా ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన దరఖాస్తుల ఆధారంగా నిర్దిష్ట కటాఫ్ నిబంధనలను అనుసరించి జాబితాలో ఉన్న వారికి పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ టాస్క్ వంటివి నిర్వహించి తుది విజేతలను ఖరారు చేస్తారు.
DSC 2024 Hall Tickets: డీఎస్సీ హాల్ టికెట్లలో గందరగోళం.. ఫొటోల తారుమారు
మలి దశ ఎంపిక ప్రక్రియ
గేట్ స్కోర్ ఆధారంగా ఐఐటీ, ఎన్‌ఐటీ, ఇతర ఇన్‌స్టిట్యూట్స్‌లో ప్రవేశం పొందాలనుకునే వారు మలిదశ ఎంపిక ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఐఐటీల్లో కౌన్సెలింగ్‌తోపాటు గ్రూప్ పర్సనల్ టాస్క్, గ్రూప్ డిస్కషన్ ఉంటాయి. కొన్ని ఐఐటీలు రిటెన్ ఎస్సేలు నిర్వహిస్తున్నాయి. వీటిలో విజయం సాధించిన వారికే సీట్లు ఖరారు అవుతున్నాయి. జనరల్ కేటగిరీలో 750, రిజర్వ్‌డ్ కేటగిరీల్లో 550కుపైగా స్కోర్ ఉంటే మేలని నిపుణులు సూచిస్తున్నారు.
సీఓఏపీలో యాక్సెప్టెన్స్ తప్పనిసరి
ఐఐటీల్లో సీట్ల భర్తీలో సీఓఏపీ (కామన్ ఆఫర్ యాక్సెప్టెన్స్ పోర్టల్) విధానాన్ని అమలు చేస్తున్నారు. అంటే.. ఆయా ఐఐటీల్లో ఎంటెక్, ఇతర కోర్సులకు దరఖాస్తు చేసుకునే సమయంలో.. సీఓఏపీ రిజిస్ట్రేషన్ నెంబర్‌ను తెలియజేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా సీఓఏపీలో తమ వివరాలను నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్ నెంబర్ పొందిన విద్యార్థులే ఐఐటీల్లో ఎంటెక్ దరఖాస్తులకు అర్హులవుతారు. ఐఐటీల్లో సీటు లభించిన విద్యార్థులు సీఓఏపీ ద్వారానే తమ సమ్మతి లేదా తిరస్కరణ తెలియజేయాల్సి ఉంటుంది. అదే విధంగా పీఎస్‌యూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు కూడా సీఓఏపీలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
Guest Faculty Jobs: గురుకులాల్లో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో నియామకం
ఎన్‌ఐటీలకు సీసీఎంటీ
దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఇతర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు సెంట్రలైజ్డ్ కౌన్సెలింగ్ ఫర్ ఎంటెక్/మాస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చర్/మాస్టర్ ఆఫ్ ప్లానింగ్(సీసీఎంటీ) పేరుతో ఉమ్మడి కౌన్సెలింగ్ విధానాన్ని అనుసరిస్తారు. విద్యార్థులు సీసీఎంటీ వెబ్‌సైట్‌లో లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకుని ఛాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. దాని ఆధారంగా అభ్యర్థులు పేర్కొన్న ప్రాథమ్యాలు, వారికి వచ్చిన స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుని.. ఆన్‌లైన్‌లో సీటు కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది.
గేట్‌తో స్కాలర్‌షిప్
గేట్ స్కోర్ ఆధారంగా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఇన్‌స్టిట్యూట్స్‌లో.. ఎంటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్+పీహెచ్‌డీలలో ప్రవేశం పొందిన వారికి ఆర్థిక ప్రోత్సాహకం కూడా అందిస్తారు. ఎంటెక్ విద్యార్థులకు నెలకు రూ.12,400 చొప్పున 22 నెలలు స్కాలర్‌షిప్ ఇస్తారు. పీహెచ్‌డీలో ప్రవేశం ఖరారైన∙వారికి మొదటి రెండేళ్లు నెలకు రూ.37 వేలు చొప్పున; ఆ తర్వాత మూడేళ్లు నెలకు రూ.42 వేలు చొప్పున స్కాలర్‌షిప్ లభిస్తుంది.
Posts at Indian Army : ఇండియన్ ఆర్మీలో హవల్దార్, నాయబ్ సుబేదార్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు..
పీఎస్‌యూల్లోనూ మలి దశ
తొలిదశలో గేట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్న పీఎస్‌యూలు.. మలిదశలో సొంతంగా ఎంపిక ప్రక్రియ చేపడుతున్నాయి. మలిదశలో గ్రూప్ డిస్కషన్ /గ్రూప్ టాస్క్, పర్సనల్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నాయి. తుది జాబితా ఖరారులో.. గేట్ స్కోర్, జీడీ/జీటీ, పర్సనల్ ఇంటర్వ్యూలకు వెయిటేజీ ఇస్తున్నాయి. గ్రూప్ డిస్కషన్‌లో భాగంగా అభ్యర్థులను బృందాలుగా విభజించి.. ఏదైనా ఒక అంశం ఇచ్చి టీమ్‌లోని ప్రతి అభ్యర్థి మాట్లాడాలని సూచిస్తారు. గ్రూప్ టాస్క్‌లో ఒక వాస్తవ సమస్యను అభ్యర్థుల ముందు ఉంచి పరిష్కారం కనుక్కోవాలని పేర్కొంటున్నాయి. చివరగా నిర్వహించే పర్సనల్ ఇంటర్వ్యూలో అభ్యర్థుల వ్యక్తిగత నేపథ్యం, టెక్నికల్ నాలెడ్జ్‌లను పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.
గేట్–2025 ముఖ్య తేదీలు
➤ నోటిఫికేషన్ విడుదల: జూలై మూడో వారంలో..
➤ గేట్ పరీక్ష తేదీలు: 2025 ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీలు.
➤ పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://gate2025.iitr.ac.in
Foreign Workers: విదేశీ కార్మికుల హక్కుల రక్షణకు కఠిన చర్యలు.. ఏ దేశంలోనో తెలుసా?
సన్నద్ధత పొందండిలా
ఎంచుకున్న సబ్జెక్ట్‌లో బేసిక్స్ నుంచి అడ్వాన్స్‌డ్ టెక్నిక్స్ వరకూ.. పూర్తి స్థాయిలో పట్టు సాధించాలి. ప్రతి టాపిక్‌ను చదివేటప్పుడు అందులోని ప్రశ్నార్హమైన టాపిక్స్‌ను గుర్తించడం, దానికి సంబంధించి ప్రాథమిక భావనలపై పూర్తి స్థాయి అవగాహన ఏర్పరచుకోవడం చేయాలి.
అనుసంధానం
గేట్ అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో అనుసంధాన విధానాన్ని అలవర్చుకోవాలి. గేట్ సిలబస్‌ను అకడమిక్ సిలబస్‌తో అనుసంధానం చేసుకుంటూ.. ప్రిపరేషన్ సాగించాలి. వీక్లీ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరు కావాలి. ఈ అప్రోచ్ విజయ సాధనలో ఎంతో ఉపయుక్తంగా నిలుస్తుంది.
వెయిటేజీని పరిశీలిస్తూ
గేట్ అభ్యర్థులు ఆయా సబ్జెక్ట్‌లోని టాపిక్స్, వాటికి గత అయిదారేళ్లుగా లభిస్తున్న వెయిటేజ్, అకడమిక్‌గా ఉన్న వెయిటేజీ ప్రాధాన్యాన్ని అనుసరిస్తూ ప్రిపరేషన్ సాగించాలి. డిసెంబర్ చివరి వారం లేదా జనవరి మొదటి వారానికి ప్రిపరేషన్ పూర్తి చేసుకునేలా టైమ్ ప్లాన్ రూపొందించుకోవాలి. ఆ తర్వాత ఉన్న వ్యవధిలో ఆన్‌లైన్ మోడల్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరవ్వాలి. ఇలా ఇప్పటి నుంచే నిర్దిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ సాగితే..పరీక్షలో మంచి స్కోర్ సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది.
Tags
- GATE 2025 Notification
- M Tech and Ph D admissions
- PSU Jobs
- online applications
- admissions notifications
- Indian Institute of Technology Roorkee
- Entrance Exam
- interview based admissions
- GATE preparation tips
- GATE 2025 tips
- Masters and ph d admissions
- Education News
- Sakshi Education News
- GATE exam schedule
- gate 2025
- How to score high in GATE 2025
- study materials
- Preparation Strategy
- Best score in GATE 2025