Skip to main content

TS TET Results Out Now: తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

TS TET Results Out Now  Telangana TET 2024 Results Released Telangana TET 2024 Key Released

తెలంగాణ టెట్‌-2024 ఫలితాలు విడుదలయ్యాయి. తొలిసారిగా ఆన్‌లైన్ విధానంలో జరిగిన ఈ పరీక్షకు సంబంధించి కీని కూడా విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లా కేంద్రాల్లో మే 20 నుంచి జూన్ 2 వరకు పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు మొత్తం 2, 86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 2,36,487 మంది విద్యార్థులు హాజరయ్యారు.

తెలంగాణ టెట్ 2024 పరీక్ష ఫలితాలను TG-TET (aptonline.in) డైరెక్ట్‌ లింక్‌ ద్వారా చెక్ చేసుకోవచ్చు. హాట్‌టికెట్‌ నెంబర్‌, పుట్టినతేదీ వివరాలు ఎంటర్‌ చేసి టెట్‌ ఫలితాలను చూసుకోవచ్చు.

Good news for Anganwadis: అంగన్‌వాడీల్లో భారీగా ఉద్యోగాలు

 కాగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన మెగా డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో మొత్తం 11,062 పోస్టులు భర్తీ కానున్నాయి.వీటిలో 2629 స్కూల్ అసిస్టెంట్, 6,508 ఎస్జీటీ  727 లాంగ్వేజ్ పండిట్స్, 182 పీఈటీ, 220 స్పెషల్ కేటగరీ స్కూల్ అసిస్టెంట్లు, 796 స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నాయి.

డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించే టీచర్స్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్‌టీ) రాయాలంటే టెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి.

☛ తెలంగాణ డీఎస్సీ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

టెట్ పేపర్ 1లో ఉత్తీర్ణత చెందితే 1 నుంచి 5 వరకూ బోధించే ఎస్జీటీ పోస్టులకు అర్హత లభిస్తుంది. పేపర్ 2లో ఉత్తీర్ణత చెందితే 6 నుంచి 8 వరకూ బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత ఉంటుందన్న విషయం తెలిసిందే. 

Published date : 14 Jun 2024 11:17AM

Photo Stories