Skip to main content

TS TET Results Out Direct Link To Check: టెట్‌ ఫలితాలు విడుదల, గతేడాదితో పోలిస్తే ఈసారి పెరిగిన అర్హత శాతం

Telangana Tet 2024 Results  Paper-1 eligibility increase  Paper-2 eligibility increase  TS TET Results Out Direct Link To Check  Chief Minister Revanthredaddy announcing TET results

తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్‌రెడడ్డి బుధవారం మధ్యాహ్నం టెట్‌ ఫలితాలను రిలీజ్‌ చేశారు. ఈసారి టెట్‌-2024కు 2,86,381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్-1 పరీక్షకు 85 వేల 996 అభ్యర్థులు హాజరుకాగా వారిలో 57,725 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.

పేపర్‌-2 పరీక్షకు 1, 50,491 మంది అభ్యర్థులు హాజరుకాగా, 51,443 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. దీని ప్రకారం.. పేపర్‌-1లో 67.13% పేపర్-2లో 34.18% అభ్యర్థులు అర్హత సాధించారు. 2023తో పోలిస్తే పేపర్-1లో  అర్హత శాతం 30.24% పెరగగా,  పేపర్-2లో 18.88% అర్హత పెరిగింది.

TS TET Results Out Now: తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

టెట్-2024లో అర్హత సాధించని అభ్యర్థులకు వచ్చే టెట్‌కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటును ప్రభుత్వం కల్పించింది. టెట్-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఫలితాల కోసం డైరెక్ట్‌ లింక్‌ https://tstet2024.aptonline.in/tstet/ResultFrontను క్లిక్‌ చేయండి. 
 

Published date : 12 Jun 2024 03:33PM

Photo Stories