Seat in IIT Kharagpur : ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల విద్యార్థికి ఖరగ్‌పూర్ ఐఐటీలో సీటు
Sakshi Education
బెల్లంపల్లి: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ(సీఓఈ) కళాశాల విద్యార్థి దుర్గం చరణ్‌తేజ్ ప్రతిష్టాత్మక ఖరగ్‌పూర్ ఐఐటీలో సీటు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా శుక్రవారం కళాశాలలో అతడిని ప్రిన్సిపాల్ ఐనాల సైదులు, అధ్యాపకులు అభినందిస్తూ సన్మానించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ రెండు దశల్లో నిర్వహించిన జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలో ప్రతిభ కనబర్చి సీటు సాధించాడు. కాగా, బెల్లంపల్లి మండలం చాకేపల్లి గ్రామానికి చెందిన చరణ్‌తేజ్ ఆరు నెలల వయస్సు ఉన్నప్పుడు తండ్రి మృతిచెందగా, తల్లి దూరమైంది. పెద్దనాన్న దుర్గం వెంకటి, ప్రమీల దంపతులు చేరదీసి చదివిస్తున్నారు.
Also Read: 2 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాల్సిందే
Published date : 24 Jun 2024 08:43AM