Skip to main content

NEET Answer Key : నీట్ యూజీ 2024 ఆన్సర్ కీ విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి

NEET Answer Key  Question Paper  Released by NTA

NEET UG 2024 ఆన్సర్ కీ విడుదలయ్యింది. దీంతో పాటు ప్రశ్నపత్రం, అభ్యర్థల OMR ఆన్సర్‌ షీట్‌లను కూడా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(NTA)విడుదల చేసింది. అభ్యర్థులు exams.nta.ac.in/NEET లేదా neet.ntaonline.inలో నీట్‌ ఆన్సర్‌ కీ ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ఆన్సర్‌ కీ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే మే 31వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు exams.nta.ac.in/NEET ను సంప్రదించగలరు. కాగా నీట్ యూజీ 2024 పరీక్ష ఈనెల 5వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన ఈ ప‌రీక్ష‌కు మొత్తం 24 ల‌క్ష‌ల మంది హాజ‌ర‌య్యారు.

AP ECET Results Released: ఈసెట్‌ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

దేశవ్యాప్తంగా ఉన్న 571 నగరాలు, భారతదేశం వెలుపల 14 నగరాల్లో ఉన్న 4,750 కేంద్రాలలో ఈ ప‌రీక్ష‌ను నిర్వ‌హించారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నీట్‌ పరీక్షను నిర్వహిస్తారు. తుది ఫ‌లితాల‌ను వ‌చ్చే నెల 14వ తేదిన విడుద‌ల చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. 

NEET UG 2024 ఆన్సర్ కీని ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి.

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ exams.nta.ac.in.ను క్లిక్‌ చేయండి. 
  • హోం పేజీలో కనిపిస్తున్న నీట్ యూజీ 2024 పేజీని క్లిక్‌ చేయండి. 
  • మీ అప్లికేషన్‌ నెంబర్‌, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్‌ చేయండి
  • తర్వాతి పేజీలో ప్రొవిజనల్ ఆన్సర్ కీ డిస్‌ప్లే అవుతుంది. ప్రింట్‌ అవుట్‌ తీసుకోవచ్చు.
Published date : 30 May 2024 11:55AM

Photo Stories