Top 10 Toughest Exams in The World : ప్రపంచంలో టాప్-10 కఠినమైన పరీక్షలు ఇవే.. భారత్‌లో మాత్రం ఇవే..
ప్రపంచంలో టఫ్‌గా ఉండే పరీక్షలు చాలా ఉన్నాయి. ఇందులో టాప్-10 పరీక్షల జాబితాను ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ Erudera ఇటీవలే విడుదల చేసింది. ఇందులో భారత్‌కు చెందిన మూడు ఎగ్జామ్స్‌కు చోటు దక్కింది.
ప్రపంచంలో అత్యంత కఠినమైన టాప్-10 పరీక్షలు ఇవే..
1. గావోకావో పరీక్ష- చైనా
2. జేఈఈ అడ్వాన్స్‌డ్- ఇండియా
3. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్- ఇండియా
4. మెన్సా ఎగ్జామ్- యూకే
5. GRE(గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్)- అమెరికా
6. CFA(చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్)- అమెరికా
7. CCIE(సిస్కో సర్టిఫైడ్ ఇంటర్నెట్‌వర్క్ ఎక్స్‌పర్ట్)
8. గేట్ - ఇండియా
9. USMLE ఎగ్జామ్ - అమెరికా
10. కాలిఫోర్నియా బార్ ఎగ్జామ్
గావోకావో పరీక్ష (చైనా) :
ప్రపంచంలో అత్యంత కఠినమైన పరీక్షల జాబితాలో మొదటి స్థానం దక్కించుకుంది చైనాకు చెందిన గావోకావో పరీక్ష. సాధారణంగా పరీక్ష అంటే మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే ఉంటుంది. అయితే గావోకావో పరీక్ష వ్యవధి తొమ్మది గంటలు. చైనాలోని కాలేజీల్లో గ్రాడ్యుయేషన్‌లో ప్రవేశాల కోసం అర్హత పరీక్షగా దీన్ని నిర్వహిస్తారు. ఈ పరీక్షకు హాజరుకావాలంటే ముందుగా చైనీస్ లాంగ్వేజ్, గణితంపై నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి.
ఫారిన్ లాంగ్వేజ్ సెక్షన్ కింది ఇంగ్లీష్, ఫ్రెంచ్, జపనీస్, రష్యన్, జర్మన్ లేదా స్పానిష్‌లో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. Gaokao పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు లిబరల్ ఆర్ట్స్ లేదా నేచురల్ సైన్స్ నుంచి ఒక స్ట్రీమ్‌ను ఎంచుకోవాలి. ఈ టెస్ట్ క్వాలిఫై అయితే చైనాలోని టాప్ ఇన్ స్టిట్యూషన్స్‌లో ప్రవేశాలు లభిస్తాయి.
ఇక భారత్ నుంచి ఈ జాబితాలో మూడు పరీక్షలకు చోటు లభించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ రెండో స్థానంలో నిలవగా, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ నాలుగో ప్లేస్, గేట్ పరీక్ష ఎనిమిదో స్థానం దక్కించుకుంది.
చదవండి: NIRF: దేశంలో నంబర్ 1 ఐఐటీ ఇదే.. ఎన్‌ఐఆర్‌ఎఫ్–2023 ర్యాంకింగ్ నివేదిక విడుదల..
జేఈఈ అడ్వాన్స్‌డ్ :
భారత్‌లోని ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హత పరీక్షగా జేఈఈ అడ్వాన్స్‌డ్ నిర్వహిస్తారు. ఇంటర్ పాసైన విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతారు. అయితే జేఈఈ మెయిన్‌లో 2.5 లక్షల లోపు ర్యాంకు సాధించిన వారికి మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్ రాయడానికి అర్హులు. జేఈఈలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా జోసా పరిధిలోని కాలేజీల్లో సీట్లు కేటాయిస్తారు.
చదవండి: జేఈఈ (మెయిన్స్ & అడ్వాన్స్‌డ్) - గైడెన్స్ | న్యూస్ | వీడియోస్
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ (UPSC) :
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో సివిల్స్ ఎగ్జామ్ ఒకటి. ఆలిండియా అడ్మినిస్ట్రేషన్ సర్వీస్‌కు అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఇది మూడు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ప్రిలిమ్స్ ఎగ్జామ్, రెండో దశలో మెయిన్స్, చివరగా ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఎగ్జామ్ చాలా టఫ్‌గా ఉంటుంది. దీంతో చాలా తక్కువ మంది క్వాలిఫై అవుతుంటారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైతే వీరికి వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ మొదలైన కేడర్ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. మనం దేశంలో అత్యుత్తుమ ఉద్యోగాల్లో ఇవి మొదటి స్థానంలో ఉంటాయి.
☛ Civils 2022 40th Ranker: నా success సీక్రెట్ ఇదే..
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE) :
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE).. ఇంజనీరింగ్‌లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హత పరీక్షగా నిర్వహిస్తారు. వివిధ ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి గేట్ స్కోర్ తప్పనిసరి. గేట్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 7 ఐఐటీల(బొంబయి, ఢిల్లీ, గువాహటి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)తో పాటు బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్ ఆఫ్ సైన్స్, ఇతర ప్రభుత్వరంగ విద్యాసంస్థల్లో డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇతర ప్రైవేట్ యూనివర్సిటీలు, విద్యాసంస్థలు కూడా గేట్ స్కోరునే ప్రవేశాలకు ప్రామాణికంగా తీసుకుంటాయి.
➤☛ GATE Exam Preparation Tips: గేట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, విజయానికి అనుసరించాల్సిన వ్యూహాలు
కొన్ని ప్రభుత్వ సంస్థలు గేట్ స్కోరు ద్వారా ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నాయి. గేట్ ద్వారా ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్ పీజీ కోర్సుల్లో ప్రవేశాలతో పాటు డాక్టోరల్ పోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నడిపే సంస్థల్లో (PSUs) ఉద్యోగాల భర్తీకి కూడా గేట్ స్కోరును పరిగణనలోకి తీసుకుంటారు.
చదవండి: ఉన్నత విద్యావకాశాలతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలనూ సొంతం చేసుకోవచ్చు