RGUKT: ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు నోటిఫికేషన్
Sakshi Education
రాష్ట్రంలోని Rajiv Gandhi University of Knowledge Technologies (RGUKT) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు IIITల్లో 2022–23 విద్యాసంవత్సరంలో పీయూసీ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ప్రవేశాల నోటిఫికేషన్‌ను ఆగస్టు 30న జారీ చేయనున్నారు. ఈ విషయాన్ని చాన్స్‌లర్ ఆచార్య కేసీ రెడ్డి, వీసీ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి ఆగస్టు 24న తెలిపారు. అడ్మిషన్ షెడ్యూల్, దరఖాస్తులను తీసుకోవడానికి ఆఖరి తేదీ, కౌన్సెలింగ్ తేదీలు, ఎంపిక విధానం, తరగతులు ప్రారంభ తేదీల సమాచారమంతా ‘https://www.rgukt.in’ అందుబాటులో ఉంచనున్నారు.
చదవండి:
Published date : 25 Aug 2022 04:40PM