Skip to main content

ట్రిపుల్‌ ఐటీల్లో బిజినెస్‌ కోర్సులు

ఐఐటీల స్థాయిలో ట్రిపుల్‌ ఐటీలుండాలని, అందుకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం ఏమన్నారంటే..
చదవండి: మేటి ఇన్‌స్టిట్యూట్స్‌లో ఎంబీఏ చేసేందుకు మార్గాలు ఎన్నో.. స‌మాచారం తెలుసుకోండిలా.. 

ట్రిపుల్‌ ఐటీల్లో ప్రస్తుతం 22,946 మంది విద్యార్థులు ఉన్నారు. శ్రీకాకుళం, ఒంగోలులో ట్రిపుల్‌ ఐటీల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. గత ప్రభుత్వ హయాంలో ట్రిపుల్‌ ఐటీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ట్రిపుల్‌ ఐటీలకు సంబంధించి రూ.180 కోట్లకు పైగా నిధులను మళ్లించారు. మళ్లీ ట్రిపుల్‌ ఐటీలు మెరుగు పడాలి. ఇప్పుడున్న మౌలిక సదుపాయాలను మెరుగు పరచాలి. దీని కోసం కార్యాచరణ రూపొందించండి. ట్రిపుల్‌ ఐటీల్లో మంచి బిజినెస్‌ కోర్సులను ప్రవేశ పెట్టడంపైనా దృష్టి పెట్టండి. ఈ కోర్సులు అత్యుత్తమంగా ఉండాలి. ఇంజినీరింగ్‌ కోర్సులు మంచి నైపుణ్యం ఉన్న మానవ వనరులను అందించేలా చూడాలి.
Published date : 13 May 2021 12:34PM

Photo Stories