Skip to main content

KNRUHS: బీఎస్సీ నర్సింగ్, బీపీటీ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌

సాక్షి, హైదరాబాద్‌ : బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్‌ (పోస్ట్‌ బేసిక్‌), బీపీటీ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నేటి నుంచి డిసెంబర్‌ 10 వరకు రెండో విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది.
KNRUHS
బీఎస్సీ నర్సింగ్, బీపీటీ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌

ఈ మేరకు డిసెంబర్‌ 7న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వర్సిటీ పరిధిలోని బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్‌ (పీబీ), బీపీటీ డిగ్రీ కోర్సుల్లో కళాశాలల్లో కన్వీనర్‌ కోటా సీట్లను భర్తీ చేయనుంది.

చదవండి: YSRUHS: నర్సింగ్‌ డిగ్రీకి వెబ్‌ ఆప్షన్‌ల స్వీకరణ ప్రారంభం

తుది మెరిట్‌ జాబితాలోని అర్హులైన అభ్యర్థులు కళాశాలల వారీగా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని,మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.in చూడాలని పేర్కొంది.

చదవండి: Telangana Govt Jobs: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్టాఫ్‌ నర్సు పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..

Published date : 08 Dec 2022 12:59PM

Photo Stories