YSRUHS: నర్సింగ్ డిగ్రీకి వెబ్ ఆప్షన్‌ల స్వీకరణ ప్రారంభం
Sakshi Education
సాక్షి, అమరావతి: బీఎస్సీ (నర్సింగ్) రెండేళ్ల డిగ్రీ కోర్సులో 2022–23 విద్యా సంవత్సరానికి కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్లలో ప్రవేశాల కోసం మూడో విడత కౌన్సెలింగ్‌కు వెబ్‌ఆప్షన్‌లను ఆహ్వానిస్తూ డా.వైఎస్సార్ ఆరోగ్య వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది.
నర్సింగ్ డిగ్రీకి వెబ్ ఆప్షన్‌ల స్వీకరణ ప్రారంభం
ఆప్షన్‌ల నమోదు ప్రక్రియ నవంబర్ 30 ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమైంది. డిసెంబర్ 4 సాయంత్రం 6 గంటల వరకు https://ugpostbasic.ntruhsadmissions.comలో విద్యార్థులు ఆప్షన్‌లు నమోదు చేసుకోవచ్చు.