Skip to main content

YSRUHS: ఎంబీబీఎస్‌ విద్యార్థులుకు ఫ్రీ ఎగ్జిట్‌ అవకాశం

సాక్షి, అమరావతి: 2022–23 విద్యా సంవత్సరం ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి కన్వీనర్‌ కోటా తొలి దశ కౌన్సెలింగ్‌లో సీట్లు పొంది, కళాశాలల్లో రిపోర్ట్‌ చేసిన విద్యార్థులు నవంబర్‌ 18 సాయంత్రం 4 గంటల్లోగా ఫ్రీ ఎగ్జిట్‌కు Dr.YSR University of Health Sciences అవకాశం కల్పించింది.
YSRUHS
ఎంబీబీఎస్‌ విద్యార్థులుకు ఫ్రీ ఎగ్జిట్‌ అవకాశం

ఈ మేరకు రిజిస్ట్రార్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు నవంబర్‌ 16న ఉత్తర్వులు జారీ చేశారు. గడువు ముగిసిన అనంతరం ఎగ్జిట్‌ అవ్వడానికి వీలుండదని స్పష్టంచేశారు. ఎగ్జిట్‌ అయ్యే విద్యార్థులు సంబంధిత కళాశాల ప్రిన్సిపాళ్లకు వినతి ఇవ్వాలన్నారు. ప్రిన్సిపాళ్లు విద్యార్థుల ఒరిజినల్‌ ధ్రువపత్రాలు, ట్యూషన్, ఇతర ఫీజులను వెంటనే తిరిగి ఇచ్చేయాలని తెలిపారు. ఇందుకు నవంబర్‌ 18 సాయంత్రం ఐదు గంటలు తుది గడువుగా నిర్ధారించారు.

చదవండి: YSRUHS: హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు ప్రక్రియ పూర్తి

ఒక వేళ గడువు ముగిశాక, అకడమిక్‌ ఇయర్‌ మధ్యలో ఎగ్జిట్‌ అవ్వాలనుకుంటే 2019 జీవో ఎంస్‌ నెంబర్‌ 72 ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ జీవో ప్రకారం డిస్కంటిన్యూ అయ్యే విద్యార్థి రూ.3 లక్షలు, జీఎస్టీని కలిపి విశ్వవిద్యాలయానికి చెల్లించాల్సి ఉంటుందన్నారు. రూ.3 లక్షల డిమాండ్‌ డ్రాఫ్ట్‌తో డిస్కంటిన్యూ దరఖాస్తు విశ్వవిద్యాలయానికి సమర్పించాలని తెలిపారు. 

చదవండి: ఉద్యాన వర్సిటీ వంగడాలకు ప్రభుత్వ గుర్తింపు.. ఆ వంగడాలు ఇవే..

Published date : 17 Nov 2022 04:28PM

Photo Stories